తెలుగు పుస్తకాలకు అమెజాన్లో ప్రత్యేక స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.ఇన్ ఆన్లైన్ తెలుగు బుక్స్టోర్ను అందుబాటులోకి తెచ్చింది. క్లాసిక్స్, లిటరే చర్, ఫిక్షన్, చిల్డ్రన్, బయోగ్రఫీస్, బిజినెస్ అండ్ ఫైనాన్స్, కుకింగ్ తదితర విభాగాల్లో 10,000కుపైగా పుస్తకాలు ఈ స్టోర్లో కొలువుదీరాయి. రంగనాయకమ్మ, యద్దనపూడి సులోచనారాణి, మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, బి.వి.పట్టాభిరామ్ వంటి రచయితల పుస్తకాలు వీటిలో ఉన్నాయి.