ఉపాధ్యాయుల డిప్యుటేషన్లలో అక్రమాలు!
కామారెడ్డి, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ టీచర్ల సర్దుబాటుకు ఇచ్చిన అనుమతి విద్యాశాఖ అధికారుల కు వరంగా మారింది. ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని అందినంత దండుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డిప్యుటేష న్ల వ్యవహారంలో డబ్బులు చేతులు మారాయ న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యుటేష న్ల విషయంలో కనీస నియమాలు పాటించకుం డా సర్దుబాట్లను చేసినట్టు తెలుస్తోంది. కామారె డ్డి డివిజన్లోని వివిధ మండలాల్లో జరిగిన డి ప్యుటేషన్లలో చాలా అక్రమాలు జరిగినట్టు స మాచారం. పదో తరగతి విద్యార్థులకు న్యా యం జరిగేవిధంగా సర్దుబాట్లు చేయాలని జి ల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు ఇక్కడి అధికారు లు తమకు అనుకూలంగా మలచుకున్నారు. మాచారెడ్డి మండలం భట్టుతండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న జయశ్రీ అనే ఉపాధ్యాయురాలిని వేల్పూర్ మండలం అంక్సాపూర్‌కు డిప్యూటేషన్‌పై పంపారు. మాచారెడ్డి మండలం లో ఎన్నో పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్నా అధికారులు మాత్రం పది మండలాలు దాటి వెళ్లారు. ఆమె పనిచేస్తున్న పాఠశాలకు, డి ప్యుటేషన్‌పై పంపిన పాఠశాలకు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ డిప్యుటేషన్ వ్యవహారంలో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తాడ్వా యి మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పా ఠశాలలో పరమేశ్వరి అనే ఉపాధ్యాయురాలిని కామారెడ్డి మండలం క్యాసంపల్లి ఉన్నత పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపారు. తాడ్వాయి మండలంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలు ఉన్నప్పటికీ ఆమెను కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లికి పంపించారు. క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టులు బోధించే ఉ పాధ్యాయులు ఉన్నప్పటికీ డిప్యుటేషన్‌పై అవసరం లేకున్నా మరో ఉపాధ్యాయురాలిని పంప డం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ క్యాసంప ల్లి ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయులను డిప్యు టేషన్‌పై పంపాలనుకుంటే ఇదే మండలంలో పనిచేసే ఉపాధ్యాయులను పంపించే వీలుంది. సదాశివనగర్ మండల కేంద్రంలోని ఉన్నత పా ఠశాలలో పనిచేస్తున్న నళినీదేవి అనే తెలుగు ఉ పాధ్యాయురాలిని కామారెడ్డి మండలం అడ్లూ ర్ ఉన్నత పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపిం చారు. కామారెడ్డి పట్టణంలోని పలు పాఠశాల ల్లో తెలుగు పండితులు అదనంగా ఉన్నా వారి ని కదిలించకుండా సదాశివనగర్ మండలం నుంచి ఉపాధ్యాయురాలిని తీసుకురావడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని ఎస్సీవాడ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తె లుగు ఉపాధ్యాయుడు కృష్ణను సదాశివనగర్‌కు డిప్యుటేషన్‌పై పంపించారు.
ఇదే ఉపాధ్యాయుడిని అడ్లూర్‌కు పంపి, సదాశివనగర్‌లో ప నిచేసే ఉపాధ్యాయురాలిని అక్కడి మోడల్ స్కూల్‌కు పంపించే అవకాశం ఉన్నా ఆ పనిచేయలేదు. భిక్కనూరు మండలం జంగంపల్లి ఉ న్నత పాఠశాలలో పనిచేస్తున్న వెంకట్రాములు అనే హిందీ ఉపాధ్యాయుడిని భిక్కనూరు మం డల కేంద్రలోని బాలుర ఉన్నత పాఠశాలకు డి ప్యుటేషన్‌పై పంపించారు. జంగంపల్లికి పక్కనే ఉన్న తలమడ్ల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులు అసలే లేరు. ఇక్కడ హిందీ ఉపాధ్యాయుడు అవసరం ఉన్న నేపథ్యంలో వెంకట్రాములును జంగంపల్లి నుంచి తలమడ్లకు పంపాల్సి ఉంది. కాని అధికారులు ఆయన్ను భి క్కనూరు మండల కేంద్రానికి డిప్యుటేషన్ చేశా రు. డిప్యుటేషన్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.