breaking news
Tamil Nadu State Government
-
'కుక్క' అన్న పిలుపు విషయమై తలెత్తిన వివాదం..చివరికి..
చిన్న మాట పట్టింపు కాస్త చివరికి హత్యకు దారితీయడం బాధకరం. వారి మధ్య ఉన్న వివాదం పెద్దది కూడా కాదు. కేవలం తమ ఇగోతో ప్రస్టేజ్లకు పోయి చంపుకునేంత వరకు వెళ్లి చివరికి కటకటాల పాలవ్వు తున్నారు. అచ్చం అలాంటి ఘటనే తమిళనాడులోని దిండుగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..తమిళనాడులోని ఉలగంపట్టియార్కొట్టంలె నిర్మలా ఫాతిమా రాణి, ఆమె కుమారులు డానియల్, విన్సెంట్తో కలిసి ఉంటోంది. వీళ్లకు ఓ పెంపుడు కుక్కడ ఉంది. అయితే వాళ్ల పొరుగింట్లో ఉండే రాయప్పన్(62).. దానిని పేరుతో కాకుండా కుక్క అని సంభోధిస్తూ వస్తున్నాడు. ఇది నచ్చక పలుమార్లు రాయప్పన్ హెచ్చరించారు ఫాతిమా కుటుంబ సభ్యులు. అయినప్పటికీ రాయప్పన్ అలానే పిలుస్తుండేవాడు. ఈ క్రమంలో.. ఒక రోజు పొలంలోని నీళ్ల పంపు ఆపేయమని రామప్పన్ తన కొడుకు కెల్విన్కి చెప్పాడు. దీంతో అతను వెళ్లేందుకు సిద్ధమవ్వగా.. ఆ పొలం పరిసరాల్లో కుక్కు ఉంటుందని అందువల్ల కర్రను కూడా తీసుకుని వెళ్లమని చెబుతుండగా.. ఆ మాట విన్న డానియల్ కోపంతో నా పెంపుడు కుక్కను ‘కుక్క’ అంటావా అంటూ దూకుడుగా మీదకు వచ్చాడు.ఆ తర్వాత రాయప్పన్ ఛాతిపై బలంగా ఒక పంచ్ విసిరాడు. దీంతో అక్కడికక్కడే రామప్ప కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ హఠాత్పరిణామనికి భయంతో డేనియల్ అతని కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పోలీసులు తీవ్రంగా గాలించి.. నిర్మలా రాణి తోసహా ఆమె కుమారులను పట్టుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎయిర్ ఇండియా మూత్ర విసర్జన ఘటన: వెలుగులోకి కీలక ఈమెయిల్స్) -
ఆటోలకు మీటర్లు
సాక్షి, చెన్నై: ఆటోవాలా దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం కళ్లెం వేయడానికి సిద్ధమైంది. చార్జీల్ని నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయించింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ చార్జీల అమలుకు 45 రోజులు గడువు ఇచ్చింది. ఆటోవాలా దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెన్నై నగరంలోని ఆటోలకు మీటర్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయంచింది. చార్జీల్ని నిర్ణయించి, గత ఏడాది అమల్లోకి తెచ్చినా.. పూర్తి స్థాయిలో అమలు చేయించేందుకు నానా తంటాలు పడక తప్పడం లేదు. రాజధానిలో 70 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఇందులో 25 నుంచి నలభై శాతం మేరకు ఆటో వాలాలు మీటర్ల వేస్తూ, న్యాయ పరంగా నడుచుకుంటున్నారు. మిగిలిన వాళ్లు యాథా రాజా తదా ప్రజా అన్నట్టుగా తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వారిపై కొరడా ఝుళిపించే పనిలో ట్రాఫిక్ యంత్రాంగం ఉన్నా, పోలీసుల కళ్లుగప్పి తిరిగే ఆటో వాలాలు అధికం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లోనూ ఆటోలకు మీటర్లు తప్పనిసరి చేయాలన్న డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఇందుకు సంబంధించిన ఓ పిటిషన్ మద్రాసు హైకోర్టులో దాఖలైంది. ఈ పిటిషన్ మేరకు కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో చార్జీల్ని నిర్ణయిస్తూ, అమలు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. అమల్లోకి అన్ని చోట్లా ఒకే విధంగా చార్జీల్ని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీచేసింది. చెన్నైలో ఇదివరకు 1.8 కి.మీ దూరానికి కనిష్టంగా రూ.25 నిర్ణయించారు. తదుపరి కిలో మీటరకు రూ.12 చెల్లించుకోవాల్సిందే. రాత్రి పదకొండు నుంచి ఉదయం ఐదు గంటల వరకు మీటరు చార్జీలో సగం అధికం. ఇక వెయింటింగ్ చార్జీగా ప్రతి ఐదు నిమిషాలకు రూ.3.50 పైసలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా చార్జీల్ని నిర్ణయించి ఉండడం గమనార్హం. అన్ని జిల్లాల్లో చార్జీల అమలు బాధ్యతల్ని కలెక్టర్ల భుజాన వేశారు. వారి ఆదేశాల మేరకు ఆర్టీఏ, ఆయా ప్రాంతాల్లోని ట్రాఫిక్ వర్గాలు చార్జీల్ని అమలు చేయించేందుకు ఇక ఆటోవాల వెనుక ఉరకలు తీయాల్సిందే. కాగా, ఈ చార్జీల్ని రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరునల్వేలి, తిరుచ్చి, మదురై, తూత్తుకుడి తదితర నగరాల్లో అమలు చేయడానికి వీలున్నా, ఇతర జిల్లాల్లోని ఆటో డ్రైవర్లు, యాజమాన్యాలు వ్యతిరేకించడం ఖాయం. ఇతర జిల్లాల్లోని నగరాల విస్తీర్ణం అంతంత మాత్రమే. ఈ దృష్ట్యా, తమకు ఈ చార్జీల్ని వ్యతిరేకించేందుకు ఆయా ప్రాంతాల్లోని ఆటో సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇక, చెన్నై వంటి నగరాల్లోని డ్రైవర్లు సైతం వ్యతిరేకించేందుకు రెడీ అవుతున్నారు. అత్యంత రద్దీతో కూడిన నగరాల్లో, చిన్నచిన్న పట్టణ, నగరాల్లోనూ ఆటో చార్జీలు ఒకే విధంగా నిర్ణయించకుండా, ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా చార్జీలు ప్రకటించాలన్న డిమాండ్ తెరమీదకు వస్తోంది. అలాగే, ఆటోల మీటర్లకు మున్ముందు రోజుల్లో భలే డిమాండ్ రాబోతోంది. వీటి ధర కూడా పెరగడం ఖాయం.