11న చెన్నైలో నటి మోనిక పెళ్లి
తమిళసినిమా: నటి మోనిక పెళ్లి ఈ నెల 11న చెన్నైలో జరగనుంది. బాల తారగా చంటి, స్వాతి చిత్రాల్లో కనిపించిన మోని క, నా అల్లుడు వెరీ గుడ్ చిత్రంలో హీరోయిన్గా చేశారు. దీంతోపాటు ప్రధాన పాత్రలకు చెల్లెలు, కూతురులాంటి పలు రకాల పాత్రలను తెలుగు, తమిళం భాష ల్లో పోషించారు. ఇటీవలే ఇస్లాం మతాన్ని స్వీకరించిన ఈమె తన పేరును రహీనాగా మార్చుకున్నారు. మదురైకు చెందిన వ్యాపారవేత్త మానిక్తో మోనికకు నిశ్చితార్థం ఇటీవల జరిగింది. వీరి పెళ్లి ఈ నెల 11న చెన్నై నందంబాక్కంలో ఇస్లాం సంప్రదాయం ప్రకారం జరగనుంది. వివాహానంతరం నటనకు స్వస్తి పలకనున్నట్లు ఇప్పటికే మోనిక ప్రకటించారు. వివాహానంతరం తన భర్త వ్యాపారంలో పాలు పంచుకుంటానని తెలిపారు.