breaking news
T20 world cricket tournment
-
అహ్మదాబాద్‌లో ఫైనల్.. భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?
టీ20 వరల్డ్ కప్-2026 వేదికలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో ఐదు వేదికలు భారత్‌లో, మూడు శ్రీలంకలో కలిపి మొత్తం 8 నగరాల్లో టోర్నీ జరుగుతుంది. అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరగడం ఖాయమైంది.అహ్మదాబాద్‌తో పాటు ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, చెన్నై నగరాలను భారత్‌లో వేదికలుగా నిర్ణయించారు. శ్రీలంకలో ప్రస్తుతానికి కొలంబో, కాండీలను వేదికలు నిర్ణయించింది. లంకలో మరో వేదికను ఇంకా ఖాయం చేయాల్సి ఉంది. ఇప్పటికే చేసుకున్న ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడుతుంది. ఒకవేళ పాక్ ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ అహ్మదాబాద్‌లో కాకుండా శ్రీలంకలోనే జరుగుతుంది. భారత్-పాక్ మ్యాచ్‌లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగే అవకాశముంది. కాగా పొట్టి ప్రపంచకప్ ఫిబ్రవరి 7న మొదలై మార్చి 8న ముగుస్తుంది. టోర్నీకి మరో మూడు నెలల సమయమే ఉన్నందున మ్యాచ్‌ల వేదికలు, తేదీలకు సంబంధించి ఐసీసీ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను వచ్చే వారం విడుదల చేయనుంది. వరల్డ్ కప్ బరిలోని జట్లు : భారత్, శ్రీలంక (ఆతిథ్య దేశాలు), ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ -
టి20 ప్రపంచకప్‌కు హాంకాంగ్, నెదర్లాండ్స్
అబుదాబి: వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు హాంకాంగ్, నెదర్లాండ్స్ జట్లు అర్హత సంపాదించాయి. బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చే ఈ మెగా ఈవెంట్లో టెస్టు దేశాలతో పాటు ఐసీసీ క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా అర్హత సాధించిన జట్లు ఆడనున్నాయి. గురువారం ఇక్కడి జయేద్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్ 29 పరుగుల తేడాతో పాపువా న్యూ గినియా (పీఎన్జీ)పై గెలిచింది. మొదట హాంకాంగ్ 9 వికెట్లకు 137 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పీఎన్జీ 108 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై ఘనవిజయం సాధించింది. వచ్చే మార్చిలో జరిగే మెగా ఈవెంట్లో హాంకాంగ్, నెదర్లాండ్స్, అఫ్ఘానిస్థాన్, ఐర్లాండ్, నేపాల్, యూఏఈలు అర్హత సాధించాయి.


