breaking news
suspends sales
-
రిలయన్స్ గ్యాస్ వేలం నిలిపివేత
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వామి బీపీ పీఎల్సీ తమ తూర్పు ఆఫ్‌షోర్ కెజీ–డీ6 బ్లాక్ నుండి సహజ వాయువు అమ్మకం కోసం ఉద్ధేశించిన వేలాన్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేశాయి. మార్జిన్ల నియంత్రణకు ఉద్ధేశించి కేంద్రం మార్కెటింగ్ నిబంధనల మార్పు నేపథ్యంలో రెండు సంస్థలూ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వేలాన్ని నిరవధికంగా నిలిపివేసినట్లు రిలయన్స్, బీపీ ఎక్స్‌ప్లోరేషన్ (ఆల్ఫా) లిమిటెడ్ (బీపీఈఎల్) ఒక నోటీస్‌లో పేర్కొన్నాయి. రోజుకు 6 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అమ్మకం కోసం ఈ–బిడ్డింగ్‌ను జనవరి 24న చేపట్టాల్సి ఉంది. డీప్ సీ, అల్ట్రా డీప్ వాటర్, హై ప్రెజర్–హై టెంపరేచర్ ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన గ్యాస్ విక్రయం, పునఃవిక్రయానికి ఈ నెల 13న పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్కెటింగ్ నిబంధనలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీసుకున్న వేలం నిలిపివేత నిర్ణయానికి రిలయన్స్, బీపీలు తగిన కారణం వెల్లడించలేదు. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సంస్థల బిడ్డింగ్ ప్రణాళికలకు అనుగుణంగా లేకపోవడమే తాజా సంయుక్త ప్రకటనకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజా నిబంధనావళి ప్రకారం, డీప్సీ వంటి కష్టతరమైన క్షేత్రాల నుండి సహజ వాయువును విక్రయించడానికి ప్రభుత్వం ఒక పరిమితి లేదా సీలింగ్ రేటును నిర్ణయిస్తుంది. 2022 అక్టోబర్ 1నుండి 2023 మార్చి 31 వరకు ఈ పరిమితి ఎంఎంబీటీయూకు 12.46 డాలర్లుగా ఉంది. -
ఫోక్స్‌వాగన్‌కు షాకిచ్చిన దక్షిణ కొరియా
జర్మన్ కారు తయారీదారి ఫోక్స్ వాగన్‌కు దక్షిణ కొరియా ప్రభుత్వం దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. 80 ఫోక్స్‌వాగన్ మోడల్స్ అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ఆ దేశ పర్యావరణ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. ఉద్గారాల చీటింగ్ స్కాండల్‌కు పాల్పడినందుకు గాను నిషేధంతో పాటు 16.06 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధిస్తున్నట్టు తెలిపింది. మొత్తం 83వేల డీజిల్, పెట్రలో సామర్ధ్యంతో రూపొందిన ఫోక్స్ వాగన్ వెహికిల్స్‌కు, తన లగ్జరీ కారు బ్రాండ్లు ఆడీ,బెంట్లీలకు అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు పర్యావరణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో మొత్తం 2,09,900 ఫోక్స్ వాగన్ అమ్మకాలు దక్షిణ కొరియాలో నిలిపివేయనున్నారు. ఈ అమ్మక నిషేధం ఫోక్స్ వాగన్ గ్రూపుకు చెందిన మొత్తం 32 రకాల వాహనాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. 2007 నుంచి ఫోక్స్‌వాగన్ మొత్తం 68 శాతం వెహికిల్స్ ను ఆ దేశంలో విక్రయించినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. నవంబర్ లోనే 1,26,000 ఫోక్స్ వాగన్ వాహనాలకు ప్రభుత్వం అమ్మక సర్టిఫికేషన్ రద్దు చేసింది. ఆ వాహనాలన్నింటినీ వెంటనే రీకాల్ చేసుకోమని ఆదేశించి, నష్టపరిహారం సైతం విధించింది. తాజాగా అమ్మకాల నిషేధంతో పాటు, 16.06 మిలియన్ డాలర్లను ఫైన్ గా విధిస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయానికి ముందే ఈ కారు తయారీదారి వినియోగదారుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి స్కాంకు ప్రభావితమైన కార్ల అమ్మకాలను జూలై 25నుంచి నిషేధిస్తున్నట్టు తెలిపింది. డీజిల్ ఉద్గారాల టెస్టులో చీటింగ్‌కు పాల్పడినట్టు ఈ కారు తయారీదారు అమెరికాలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 లక్షల వాహనాల్లో ఈ అక్రమ సాప్ట్‌వేర్‌ను అమర్చినట్టు తన తప్పును ఒప్పుకుంది. ఈ తప్పును సరిదిద్దుకునే నేపథ్యంలో ఫోక్స్ వాగన్ అష్టకష్టాలు పడుతోంది. దక్షిణ కొరియాలో ఇప్పటికే అమ్మకాలు పతనమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఫోక్స్‌వాగన్‌కు నేడు వెలువరించిన నిర్ణయం మరింత కుంగదీయనున్నట్టు తెలుస్తోంది. ఈ స్కాండల్ బయటపడక ముందు దక్షిణ కొరియాలో టాప్ సెల్లింగ్ వెహికిల్స్ లో ఫోక్స్ వాగన్ ఒకటిగా నిలిచేది.