ఫేస్ బుక్ ద్వారా గూఢచర్యం
జైసల్మేర్: ఇటీవల భారత నిఘా వర్గాలకు చిక్కిన పాకిస్థాన్ గూఢాచారి ఫేస్ బుక్ ద్వారా సరిహద్దు ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించాడని పోలీసులు వెల్లడించారు. భారత్, పాక్ సరిహద్దు గ్రామాల ప్రజలతో నఖిలీ ఫేస్ బుక్ అకౌంట్ల తీసి వారితో చాటింగ్ చేస్తూ వ్యూహాత్మకంగా సమాచారం సేకరించేందుకు ప్రయత్నించాడని విచారణలో తేలింది. భారత్ లోని కొన్ని ప్రాంతలకు చెందిన కొన్ని ఫోటోలు అతని ఫేస్ బుక్ ఖాతాలో లభించినట్టు అధికారులు తెలిపారు. అపరిచిత వ్యక్తులతో ఫేస్ బుక్ లో చాటింగ్ చేయడం మంచిది కాదని అలాంటి వారికి లైక్ లు కొట్టరాదని, వారితో సమాచారం పంచుకోవడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.