breaking news
srividhya
-
తల్లి ప్రొడ్యూసర్.. కూతురు డైరెక్టర్
శ్రీవిద్య బసవ.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ ఇక్కడే పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌లో చేరిందిఆ తర్వాత మానేసింది. చదువులో డ్రాపవుట్ అయినప్పటికీఆత్మవిశ్వాసంతో ముందుకెళుతోంది. కూతురు కలను నిజంచెయ్యాలనేది శ్రీవిద్య తల్లి ఇందిర తలంపు. చదువు మానేస్తాను,టీవీ షో చేస్తాను, సినిమా తీస్తాను.. ఇలా శ్రీవిద్య ఏం చేస్తానన్నా ఆమె కాదనలేదు. తన తాహతుకు మించి కుమార్తె రూపొందించేచిత్రానికి ప్రొడ్యూసర్‌గా మారింది. త్వరలో విడుదల కానున్న‘మధ’ చిత్రం గురించి ‘సాక్షి’తో శ్రీవిద్య తన అంతరంగాన్నిఇలా పంచుకుంది. సాక్షి, సిటీబ్యూరో :మా స్వగ్రామం మెదక్ జిల్లా జోగిపేట. పుట్టి పెరిగిందతంతా హైదరాబాద్‌లోనే. మేం ఐదుగురం అక్కాచెల్లెళ్లం. నేను మూడోదాన్ని. చిన్నప్పటి నుంచి డాక్టరవ్వాలని నా కోరిక ఉండేది పరిస్థితుల కారణంగా ఇంజినీరింగ్‌లో జాయినయ్యా. కానీ మధ్యలోనే మానేశా. 2009 మొదటిసారిగా పెట్స్‌తో క్యూట్ కంపానియన్స్ అని షో చేశాను. అలా మొదటిసారి విజువల్ మీడియాలోకి వచ్చాను. ఈ షో సక్సెస్ అయ్యాక చిన్న చిన్న యాడ్స్ డైరెక్ట్ చెయ్యటం స్టార్ట్ చేశాను. ఇలా సుమారు 20 కంపెనీల యాడ్స్ చేశాను. కొంతకాలం తర్వాత సినిమాటిక్ వెడ్డింగ్స్ షూట్ చేశాను. ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీతో పాటు వీడియో షూటింగ్, కెమెరా టెక్నిక్స్ నేర్చుకున్నాను. షూటింగ్లో.. ‘మధ’కుఅంకురార్పణఅలా.. యాడ్స్‌కి కాన్సెప్టులు రాస్తున్నప్పుడు స్టోరీ ఐడియాలు కూడా వచ్చేవి. కొత్తగా, బాగా అనిపించిన స్టోరీలు రాసేదాన్ని. ‘మధ’ స్టోరీ కూడా అలా ఆరేళ్ల క్రితం రాసిందే. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్‌లో వెళ్లి చూపించాను. వారు కొన్ని మార్పులు చేసుకొని రమ్మన్నారు. చేశాను, కానీ నాకు నచ్చలేదు. 2017 మార్చిలో ‘మధ’ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఫీచర్ ఫిలిం చెయ్యాలని డిసైడయ్యా. విషయం అమ్మకు చెప్పాను. 6 నెలలు అమెరికాలో వెయిట్రస్‌గా పని చేశాను. కొంత డబ్బు సంపాదించుకొని వచ్చాను. దాంతో సినిమా ప్రారంభించాను. ఆస్తులు అమ్మి మరీ.. 16 నెలల పాటు 4 షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తి చేశాం. ఒక్కో షెడ్యూల్ కోసం బంగారం, తర్వాత కారు, ఆ తర్వాత భూమి అమ్మేయ్యాల్సి వచ్చింది. ఇలా ఆస్తులన్నీ అయిపోయాక అప్పు తీసుకొని ఫిలిం పూర్తి చేశాం. ఈ ఫిలిం పూర్తిగా, సీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్. దీనికి కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో మార్పులు చెయ్యమన్నారు కొందరు. చేసినప్పుడల్లా కథలో మార్పులు సూచించే వారు. చిత్రంలో ప్రతి ఫ్రేమ్, సీన్ నేను దగ్గరుండి, నాక్కావలసినట్లు తీయించుకున్నాను. దాంట్లో ఎవరైనా వేలు పెడితే నేను హ్యాండిల్ చేయలేను. అందుకే వేరే వారిని ప్రొడ్యూసర్‌గా తీసుకోలేదు. ప్రొడ్యూసర్‌గా మా అమ్మనే ఎంచుకున్నా. నటీనటులకు సూచనలిస్తున్న శ్రీవిద్య చిత్ర ప్రత్యేకతలివీ.. మధ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ కథతో సాగుతుంది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ మహిళ, దర్శకురాలు మహిళే. తెలుగు చిత్ర చరిత్రలో తల్లి ప్రొడ్యూసర్‌గా, కూతురు దర్శకురాలిగా పనిచేసిన చిత్రం ఇదే ప్రథమం కాబోలు. తెలుగు చిత్రాల మూస ధోరణి, ముద్ర ఈ చిత్రం మీద పడకూడదని పోస్ట్ ప్రొడక్షన్ పనులు తమిళం, మలయాళ పరిశ్రమల వారితో చేయించాం. ‘మధ’ చిత్రీకరణలో దర్శకురాలు శ్రీవిద్య టైటిల్ వెనక ఇదీ కథ.. లొకేషన్, హీరో, హీరోయిన్ల పేరుతో హర్రర్ చిత్రాల టైటిల్స్ ఉంటాయి. అలా కాకుండా, సినిమా కాన్సెప్ట్‌ని రిఫ్లెక్ట్ చేసేలా టైటిల్ పెట్టాలనుకున్నాను. మధ పదం చాలా భాషల్లో ఉంది, సంస్కృతంలో మధ అంటే పిచ్చితనం. అది ఒక మానవ రూపంలో పరిణమిస్తే అదే మధ. ఈ టైటిల్ కోసం ఫిలిం చాంబర్లో చాలా పోరాడాల్సి వచ్చింది. తెలుగు టైటిల్ పెట్టుకోమని, సంస్కృతం అర్థం కాదు అని ఇలా చాలా చెప్పారు. కానీ వాళ్ల ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి, చాలా కష్టపడి నాక్కావలసిన టైటిల్ ఓకే చేయించుకున్నాను. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేద్దామనుకుంటున్నాం. -
సంబోధన...సంప్రదాయం
‘ఒరేయ్ చక్రధర్....ఎక్కడున్నావ్!’ ఓ తండ్రి గట్టిగా అరిచాడు. పెరట్లో నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కొడుకు చక్రధర్ కోపంగా జవాబిచ్చాడు. ‘ఇక్కడే ఉన్నాను. ఎందుకలా అరుస్తారు?’ కొంచెం హెచ్చుతగ్గులతో దాదాపు ప్రతి ఇంటా ఇదే సన్నివేశం రోజూ తారసపడుతూనే ఉంటుంది. తండ్రి కుమారుణ్ణి ఒకటి, రెండుసార్లు పిలిచి, రాకపోయేసరికి కాస్త కోపంగా అలా అని ఉండొచ్చు. పిల్లవాడు పలకలేదు. కానీ, ఆ సర్వంతర్యామి...అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు పిలవగానే పలుకుతాడు. స్పందిస్తాడు. కాబట్టే మన పెద్దలు ఈ అలవాటు మనకు బోధించారు. సాంకేత్యం పరిహాస్యంగా వా స్తోభం హేళన మేవవా వైకుంఠ నామగ్రహణం అశేషాఘహరం విదుః ఒకరిని అవసరార్ధమే పిలిచినా, హేళనగా పిలి చినా, స్తోత్రం చేసినా...ఏ భావంతో చెప్పినా ఆ వైకుం ఠుడి నామం పాపాలన్నిటినీ పోగొడుతుందని భావం. ఇటీవల పిల్లలకు భగవంతుని పేరే పెట్టినా ఆ పేర్లతో పిలిచే అలవాటు పోయింది. చిలుకూరులో జరిగిన ఒక సన్నివేశాన్ని మీ అందరికీ చెబుతాను. స్వామివారి పాదతీర్థాన్ని భక్తులకు ఇచ్చేటపుడు ఎవరైనా చిన్న పిల్లలను తీసుకుని వస్తే వారి పేర్లు అడగటం నాకు అలవాటు. ఆ పేరు తెలుసుకుని, అలాగే పిలవడం నా మనసుకు ఆనందాన్నిస్తుంది. ఒకసారి ఓ అమ్మమ్మగారనుకుంటాను...చిన్న పాపను ఎత్తుకుని వచ్చింది. ఆ పాప ముద్దుగా ఉంది. మూడేళ్లుంటాయేమో. ఆమెకు కూడా తీర్థం అడిగి తీసుకున్నారు. ‘పాప పేరేమిటమ్మా’ అని అడిగాను. ‘శ్రీవిద్య అని పెట్టాము స్వామీ’ అని ఆ పెద్దావిడ అన్నారు. అద్భుతమైన పేరు. తాంత్రికమైనటువంటి సాధనకై పెట్టిన పేరు శ్రీవిద్య. ఇందులో లక్ష్మీ సరస్వతులున్నారు. ‘ఇంట్లో ఈ పాపను ఏమని పిలుస్తారమ్మా’ అని అడిగితే ‘శ్రీవిద్యనే అంటాం స్వామీ’ అని ఆమె జవాబిచ్చారు. కాస్సేపయ్యాక తీర్థం పంచడాన్ని వేరొక అర్చకస్వామికి అప్పగించి మంటపంవైపు వెళ్లాను. అక్కడ ఆ పాప మళ్లీ కనబడింది. వాళ్ల అమ్మమ్మ అలా దించగానే పరుగెత్తడం మొదలెట్టింది. ‘ఏయ్... మ్యాగీ ఎటుపోతున్నావ్’ అంటూ ఆ అమ్మమ్మ గట్టిగా అరిచారు. భక్తులంతా గొల్లున నవ్వారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడున్నందువల్ల నేను సరదాగా జోక్యం చేసుకుని అన్నాను. ‘చూశావామ్మా...స్వామివారి వద్ద అబద్ధం ఆడావు. పాపను ఇంట్లో శ్రీవిద్య అని పిలుస్తామన్నావు. ఇప్పుడేమో మ్యాగీ అంటున్నావు. అమ్మాయికి నూడుల్స్‌కు పెట్టే పేరు పెడతావామ్మా నువ్వు...’ అన్నాను. అందరూ గమనించవలసిన ముఖ్య విషయం ఉంది. ఈ ఆధునిక యుగంలో స్వామివారినిగానీ, మన దైవాన్ని గానీ, అమ్మవారినిగానీ తలచుకొనే అవకాశం తక్కువ. ఏ పండగకో, ఉత్సవానికో వెళ్లినప్పుడే స్వామివారిని తలుచుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో భగవన్నామాన్ని నిరంతరం ఉచ్చరించడానికి అవకాశం మనకు పిల్లల పేర్ల ద్వారా కలుగుతుంది. వాళ్లకు భగవత్సంబంధమైన పేర్లు పెట్టి వారిని అలాగే పిలుస్తుంటే భగవంతుని అష్టోత్తరం చదివినట్లు అవుతుంది. చక్రధర్ అని పేరుపెట్టి చంటి అని పిలుస్తున్నారు. పండు అంటున్నారు. కనీసం రోజుకి కొన్నిసార్లయినా వారిని పూర్తి పేరుతో పిలిచే అలవాటు చేసుకోవాలి. - సౌందరరాజన్ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు