breaking news
sindhu civilization
-
‘సింధు’ పూర్వీకులు ఇరాన్ రైతులు!
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు నాగరికతకు చెందిన ప్రజల గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం దక్షిణాసియా ప్రాంత ప్రజల్లో అత్యధికులు ఇరాన్ ప్రాంతం నుంచి రైతులని చెబుతున్నారు. ఆ కాలానికి చెందిన రాఖీగఢీ నగరం (ప్రస్తుత హరియాణా రాష్ట్రం) నుంచి సేకరించిన సుమారు 60 అస్తిపంజర నమూనాల సాయంతో జన్యు పరిశోధనలు జరపగా.. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన సీసీఎంబీ శాస్త్రవేత్త కె.తంగరాజ్ తెలిపారు. సుమారు 5 వేల ఏళ్ల కింద ఇరాన్ ప్రాంత రైతులు తొలుత యూరప్‌వైపు వలస వెళ్లారని.. ఆ తర్వాత 1,500 సంవత్సరాల కింద తిరిగి సింధు నాగరికత ప్రాంతానికి వచ్చారని తమ పరిశోధనల ద్వారా తెలిసిందని వివరించారు. దక్షిణాసియా ప్రాంతంలోని అనేక గిరిజన తెగల ప్రజల జన్యువులు, ఇరానియన్ల జన్యువుల మధ్య సారూప్యత ఉండటానికి ఇదే కారణమని తెలిపారు. దీన్ని బట్టి దక్షిణాసియా ప్రాంతంలో వ్యవసాయాన్ని పశ్చిమ ప్రాంతాల వారు నేర్పింది కాదని కూడా తెలుస్తోందని, స్థానిక పశుకాపరులే వ్యవసాయాన్ని ప్రారంభించినట్లు అర్థమవుతోందని వివరించారు. అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధన సింధు నది నాగరికతతో పాటు పురాతన యుగానికి చెందిన సుమారు 524 మంది వ్యక్తుల జన్యువులను అమెరికా, యూరప్, మధ్య, దక్షిణాసియా ప్రాంత శాస్త్రవేత్తలు, సీసీఎంబీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధించారు. వీరి జన్యు క్రమాలను నమోదు చేసి ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోని ప్రజల జన్యు క్రమాలతో పోల్చగా.. దక్షిణ, మధ్య ఆసియా ప్రాంత ప్రజల పూర్వీకుల వివరాలు కొన్ని తెలిశాయి. ఇతర చారిత్రక ఘట్టాలను కూడా పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా.. యురేసియా ప్రాంతంలో ప్రజలు వేటాడటం నుంచి వ్యవసాయానికి ఎప్పుడు మళ్లారన్న అంశంతో పాటు ఇండో–యూరోపియన్ భాషల విస్తృతి ఎలా మొదలైందన్న అంశంపై స్పష్టత వచ్చింది. యురేసియా ప్రాంత స్టెప్పీలు (సంచార తెగలు) ఇండో–యూరోపియన్ భాషలను ప్రపంచం నలుమూలలకు చేర్చారని దశాబ్దాలుగా ఉన్న స్టెప్పీ ప్రతిపాదనకు ఈ పరిశోధనలు బలం చేకూరుస్తున్నాయి. స్టెప్పీ (కుర్గాన్) హైపోథీసిస్ ప్రకారం అనటోలియా (ప్రస్తుత టర్కీ) ప్రాంత రైతులు అటు పశ్చిమ దిక్కుకు.. ఇటు తూర్పువైపూ ప్రయాణించారు. ఇందుకు తగ్గట్టుగానే దక్షిణాసియా ప్రాంత ప్రజల జన్యువుల్లో అనటోలియా ప్రాంత ప్రజలకు సంబంధించిన ఆనవాళ్లేవీ లేవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న మరో శాస్త్రవేత్త హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డేవిడ్ రీచ్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలు సెల్, సైన్స్ జర్నల్స్ తాజా సంచికల్లో ప్రచురితమయ్యాయి. -
కోటలు లేని ఏకైక సింధు నాగరికత పట్టణం?
క్రీ.పూ.2500 ఏళ్ల కిందట సింధు నాగరికత విలసిల్లింది. సింధు నదీ పరీవాహక ప్రాంతంలో విరాజిల్లడం వల్ల ఈ నాగరికతను సింధు నాగరికత అని, సింధులోయ నాగరికత అని పిలుస్తారు. తొలిసారి హరప్పా ప్రాంతంలో తవ్వకాలు జరపడంతో దీన్ని హరప్పా నాగరికత అని కూడా అంటారు. తొలిసారిగా 1921లో భారత సర్వేయర్ జనరల్‌గా ఉన్న సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో దయారాం సహాని.. హరప్పా (రావి నది ఒడ్డు)న తవ్వకాలు జరపడంతో ఒక విశిష్ట నాగరికత బయటపడింది. సింధు నాగరికత పేరును హరప్పా నాగరికతగా సర్ జాన్‌మార్షల్ మార్చాడు. పురావస్తు ఆధారాల ప్రకారం సింధు నాగరికత కాలం క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,500. సింధు నాగరికత ఉన్నత దశలో ఉన్న కాలం క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 వరకు. సింధు నాగరికతకు లిపి ఉంది. కానీ చదివేందుకు వీలుకాకపోవడం వల్ల దీన్ని ‘ప్రోటో హిస్టారిక్’ యుగం (సంధి కాలపు చారిత్రక యుగం) అని పిలుస్తారు. ఈ యుగంలో ఉపయోగించిన లోహం ‘కంచు’. అందుకే సింధు నాగరికతను ‘కాంస్య యుగపు’ నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ నాగరికత శిలాయుగం నుంచి లోహ యుగానికి మార్పు చెందుతున్న కాలంలో అభివృద్ధి చెందింది. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు.. మెసపటోమియా (ఇరాక్) (యూప్రటీస్, టైగ్రిస్); ఈజిప్ట్ (నైలు నది); చైనా (హోయాంగ్ హో) మొదలైనవి. సమకాలీన నాగరికతల కంటే సింధు నాగరికత 6 అంశాల్లో విశిష్టమైందిగా గుర్తింపు పొందింది. సింధు నాగరికత మిగిలిన నాగరికతల కంటే వైశాల్యంలో పెద్దది. ఇది 1.3 మి.చ.కి.మీ.లలో విస్తరించి ఉంది. దీని సరిహద్దులు ఉత్తరాన జమ్ముకశ్మీర్‌లోని మండా నుంచి దక్షిణాన మహారాష్ర్టలోని దైమాబాద్ వరకు, తూర్పున ఉత్తరప్రదేశ్‌లోని అలింగీర్ నుంచి పాకిస్తాన్‌లోని (సుక్త-జందార్) వరకు విస్తరించి ఉంది. సింధు నాగరికత పట్టణ నాగరికత (ఇది సింధు నాగరికత ముఖ్య లక్షణం). ఇక్కడి పట్టణాలు గ్రిడ్ వ్యవస్థలో, ప్రధాన వీధులు ఉత్తర-దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు -పడమరలుగా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. సింధు ప్రజలు ఇళ్ల నిర్మాణంలో కాల్చిన ఇటుకలను ఉపయోగించటాన్ని ప్రత్యేక అంశంగా చెప్పొచ్చు (దీనిలోనే సింధు ప్రజలు పరిపక్వత సాధించారు). ఈ నాగరికతలో పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మురుగు నీటి కోసం ఇంకుడు గుంతలు తవ్వటం ఈ నాగరికతలోని ప్రత్యేకత. సాంకేతిక పరిజ్ఞానంలో మిగిలిన నాగరికతల కంటే గొప్పది. సింధు ప్రజలు ప్రపంచంలో తొలిసారి పత్తిని పండించారు. సింధు నాగరికత తవ్వకాల్లో మొత్తం 250 ప్రదేశాలు బయటపడ్డాయి. అందులో ముఖ్యమైనవి.. సింధు నాగరికతకు చెందిన ప్రధాన ప్రదేశాలు - పురావస్తు విశేషాలు హరప్పా: సింధు నాగరికత తవ్వకాల్ల్లో బయటపడిన మొట్టమొదటి పట్టణం. పట్టణ నిర్మాణం- ముఖ్య లక్షణాలు 2 వరుసల్లో నిర్మించిన 6 ధాన్యాగారాలు, పంటలు నూర్చే వృత్తాకారపు వేదికలు బయటపడ్డాయి. రాతితో చెక్కిన నటరాజ విగ్రహం వెలుగుచూసింది. చెక్కతో తయారు చేసిన శవపేటికలు. కోటకు వెలుపల చిన్నచిన్న గదులతో కూడిన నిర్మాణాలు. మొహంజోదారో: మొహంజోదారో అంటే సింధు భాషలో మృతుల దిబ్బ (కౌఠఛీ ౌజ ఈ్ఛ్చఛీ) అని అర్థం. తవ్వకాల్లో బయటపడిన అతి పెద్ద సింధు నాగరికత ప్రాంతం. పెద్ద ధాన్యాగారం కాల్చిన ఇటుకలతో నిర్మించిన 39ఁ23ఁ9 అడుగుల విస్తీర్ణం గల మహాస్నానవాటిక బయటపడింది. అనేక స్తంభాలతో కూడిన అసెంబ్లీ హాలు నిర్మాణం. ఏడుసార్లు వరదలకు గురై, తిరిగి 7 సార్లు పునర్నిర్మితమైన పట్టణం. కంచుతో పోత పోసిన నాట్యగత్తె విగ్రహం లభించింది. రాతితో తయారుచేసిన పశుపతి మహాదేవుని విగ్రహం దొరికింది. చాన్హుదారో: కోటలు లేని ఏకైక సింధు నాగరికత పట్టణం. సిరాబుడ్డి (ఐజు ఞ్టౌ) దొరికింది. పూసలు, ఆభరణాలు తయారుచేసే పరిశ్రమ ఆనవాళ్లు వెలుగుచూశాయి. కాళీభంగన్: రాజస్థానీ భాషలో కాళీభంగన్ అంటే నల్ల గాజులు అని అర్థం. నాగలితో పొలం దున్నిన ఆనవాళ్లు ఇక్కడ కనిపించాయి. యజ్ఞ యాగాదులకు గుర్తుగా 2 అగ్నిహోమాలు బయటపడ్డాయి. లోథాల్: కాల్చిన ఇటుకలతో కూడిన మానవ నిర్మిత నౌకాశ్రయం ఉన్న పట్టణం. మొదటిసారిగా వరి పండించిన ఆనవాళ్లు లభించాయి. ఎక్కువగా ముద్రికలు దొరికాయి. సతి ఆచారానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. కొలిచే ప్రమాణం (త్రాసు, కొలబద్ద) వంటి పనిముట్లు దొరికాయి. కాళీభంగన్లా అగ్ని గుండం ఆనవాళ్లు ఇక్కడ బయల్పడ్డాయి. చదరంగం లాంటి ఆటకు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి. రంగాపూర్: ఇక్కడ హరప్పాకు పూర్వం ఉన్న సంస్కృతి వెలుగుచూసింది. ధాన్యపు పొట్టుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. కోట్-డిజి: సింధు నాగరికతకు పూర్వమే విలసిల్లిన నాగరికత విశేషాలు ఉన్నాయి. ఇక్కడ రాతితో చేసిన బాణాలు బయటపడ్డాయి. రూపార్ : ఇక్కడ కుండల తయారీ ఆనవాళ్లు లభించాయి. సుర్కటోడా: గుర్రం అవశేషాలు లభించిన ఏకైక పట్టణం. క్షీణ దశలో ఉన్న సింధు నాగరికత ఆనవాళ్లు లభించాయి. బన్వాలి: మేలు రకపు బార్లీ, ఆవాలను ఉపయోగించిన, పండించిన ఆనవాళ్లు దొరికాయి. అలంగీర్పూర్: ఇది హరప్పా నాగరికత చివరి దశను తెలుపుతుంది. ధోలవీర: భారతదేశంలో బయల్పడిన సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణం. ఆర్థిక పరిస్థితులు వ్యవసాయం: సింధు ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. గోధుమ, బార్లీ ముఖ్య పంటలు. వీటిని రబీ సీజన్లో అధికంగా పండించేవారు. ఇతర ముఖ్య పంటలు నువ్వులు, ఆవాలు, బఠాణీలు తదితర లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన పంటలను పండించేవారు. నవంబర్‌లో విత్తనాలు చల్లి ఏప్రిల్‌లో కోతలు కోసేవారు. సింధు ప్రాంత ప్రజలు తొలిసారిగా పత్తిని పండించారు. వీరు తొలిసారిగా పత్తిని పండించటం వల్ల గ్రీకులు పత్తిని సిండర్ అని పిలిచేవారు. వ్యవసాయ మిగులు ఎక్కువగా ఉండేది. మిగులును ధాన్యాగారాల్లో భద్రపరిచేవారు. వ్యవసాయ మిగులుతో అంతర్గతంగా ఎద్దుల బండి ద్వారా, అంతర్జాతీయంగా పడవల ద్వారా వ్యాపారం చేసేవారు. ఆవు, ఎద్దు, బర్రె, మేక, కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులతో పాటు ఏనుగు, పులి, ఖడ్గమృగం వంటి అడవి జంతువులు కూడా వీరికి తెలుసు. సింహం గురించి వీరికి తెలియదు. పరిశ్రమలు: కుండలు, పూసల తయారీ, బొమ్మలు (టైట బొమ్మలు) - ముద్రలు, తాయెత్తులు, పడవల తయారీ పరిశ్రమలు ముఖ్యమైనవి. వర్తక వాణిజ్యం: అంతర్జాతీయ వ్యాపారం మెసపటోమియాలోని సుమేరియన్లతో ఎక్కువగా జరిగేది. మెసపటోమియాలో లభించిన అనేక హరప్పా వ్యాపార ముద్రికలు దీనికి ఉదాహరణ. ఎగుమతులు: వ్యవసాయ ఉత్పత్తులైన గోధుమ, బార్లీ, పత్తితోపాటు దంతాలతో చేసిన సామగ్రి, కుండలు, బొమ్మలు, పూసలు తదితరాలు. దిగుమతులు: ఆఫ్గానిస్తాన్ నుంచి తగరం, అఫ్గ్గానిస్తాన్, పర్షియా నుంచి బంగారం, రాజస్థాన్ నుంచి రాగిని, సౌరాష్ర్ట నుంచి కాంబ్షల్స్ (విలువైన రాయి)ని దిగుమతి చేసుకొనేవారు. వస్తు మార్పిడి విధానం ద్వారానే వ్యాపారం జరిగేది. వి. రమణయ్య సబ్జెక్ట్ నిపుణులు, శ్రీకాకుళం -
ఆ సినిమాపై క్షమాపణ చెప్పాలి: పాక్ మంత్రి
ప్రాచీన సింధు నాగరికత నేపథ్యంగా తెరకెక్కిన 'మొహెంజోదారో' సినిమాపై పాకిస్థాన్ లోని సింధు ప్రాంత సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి సర్దార్ అలీ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. హృతిక్ రోషన్, పూజాహెగ్డే జంటగా నటించిన ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని విమర్శించారు. ఇందుకుగాను చిత్ర దర్శకుడు అశుతోష్ గోవారికర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేవారు. ఐదువేల ఏళ్ల కిందట నాటి అత్యున్నత సాంస్కృతిక నాగరికత అయిన సింధు నాగరికతను అపహాస్యం చేసేలా ఈ సినిమా ఉందని డాన్ పత్రికతో షా పేర్నొన్నారు. ఈ విషయంలో సింధు ప్రజల అభ్యంతరాలు, ఆందోళనను చిత్ర దర్శకుడికి తెలియజేస్తానని ఆయన చెప్పారు. ఈ సినిమా నిండా దర్శకుడి కల్పిత ఊహలు మాత్రమే ఉన్నాయని, మొహెంజోదారో చరిత్రతో సినిమాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎంతో సంపన్నమైన నాగరికతగా సింధు చరిత్రకు ప్రపంచవ్యాప్తంగా పేరున్నదని, అందుకే మొహెంజోదారో ప్రాంతాన్ని యునెస్కో సైతం చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించిందని ఆయన అన్నారు. వందకోట్ల బడ్జెట్ తో భారీ అంచనాలతో రూపొందిన 'మోహెంజోదారో' బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోని విషయం తెలిసిందే.