breaking news
siddartha college
-
నేను విజయవాడ కుర్రాడినే..
‘ఛలో’ చిత్ర కథానాయకుడు నాగశౌర్య పీబీ సిద్ధార్థ కళాశాల విద్యార్థులతో శనివారం సాయంత్రం సందడి చేశారు. కళాశాల ఆడిటోరియంలో అందరితో కొద్దిసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను విజయవాడలోనే పెరిగానని, టిక్కిల్ రోడ్డులో తిరిగానని చెప్పాడు. నగరానికి వస్తే తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నాడు. ‘ఛలో టీజర్‌ను యూట్యూబ్‌లో చూశారా’ అంటూ విద్యార్థులను అడిగాడు. పైరసీని ఎంకరైజ్ చేయవద్దు అన్నారు. అనంతరం నాగశౌర్యతో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. – మొగల్రాజపురం -
రాష్ట్రస్థాయి చెస్‌పోటీలలో పెద్దివీడు ఉన్నత పాఠశాల విద్యార్థి
వీరబల్లి: ఈనెల 18, 19వ తేదీలలో విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్‌పోటీలలో వీరబల్లి మండలంలోని పెద్దివీడు రెడ్డివారిపల్లెలో గల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎం.వెంకటేశ్వర్లు ప్రధమస్థానం సంపాదించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు తెలిపారు. ఏపీ చెస్ ఫెడరేషన్ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలలో జిల్లానుంచి 7మంది విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాల విద్యార్థి ప్రథమస్థానం సంపాదించారన్నారు. ఈ విద్యార్థికి ఏపీ ఫెడరేషన్ తానా వారు బంగారుపథకంతోపాటు రూ.10వేలు నగదు, జ్ఞాపికను బహుమతిగా అందజేశారు. ఈ విద్యార్థిని పాఠశాలలోని పీఈటీ ఉమాదేవితోపాటు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.