శ్వేతనాగు
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొత్తపేట గ్రామంలో ఆదివారం అరుదైన శ్వేత నాగు కనిపించింది. ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండపై నుంచి ఇది రోడ్డుపైకి వచ్చింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడవుతో తెల్లగా మెరిసిపోతున్న ఈ సర్పం అప్పుడే పొలాల్లోకి వెళ్తున్న స్థానికులను చూసి బుసలు కొట్టడం ప్రారంభించింది. అరుదైన ఈ సర్పాన్ని చూసేందుకు గ్రామస్తులు గుమిగూడారు. కాసేపయ్యాక అది నెమ్మదిగా అక్కడినుంచి వెళ్లిపోయింది.
- నెల్లిమర్ల (విజయనగరం జిల్లా)