breaking news
shocking mobile phone footage
-
దాదాపు ఆ అమ్మాయి చావును చూసేసింది
-
దాదాపు ఆ అమ్మాయి చావును చూసేసింది
ఫ్రాన్స్: ప్యారిస్‌లో గుండెలు ఆగిపోయే సంఘటన జరిగింది. ఓ మహిళ దాదాపు చావు అంచుల వరకు వెళ్లింది. తిరిగి భూమిమీద అడుగుపెట్టే వరకు కూడా తాను బతికుంది నిజమేనా అనుకునేంత భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొంది. చూసినవారికి దాదాపు గుండె ఆగిపోయినంత పనవుతుంది ఈ సంఘటన చూస్తే. ప్యారిస్‌లోని ఓ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి వెళ్లిన ఇద్దరు మహిళలు బంగీ జంప్లాంటి అనుభూతినిచ్చే ఎత్తయిన ఊగే ఊయలలాంటిదాన్ని ఎక్కారు. అయితే సీటు బెల్టు మాదిరిగా పూర్తిగా రక్షణ కవచాలు ఉండటంతోపాటు కాళ్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బెల్టులు ఉన్నాయి. అయితే, బంగీ జంపింగ్‌లాంటి అనుభూతిని పొందేటప్పుడు గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, వారిద్దరిలో ఒకమ్మాయి మాత్రం తన పట్టును కోల్పోవడంతో అంత ఎత్తులో తలకిందులైంది. వేగంగా నేలమీదకు దూసుకొచ్చి అనంతరం గాల్లో ఊయల ఊగినట్లు ఊగడం మొదలైంది. దీంతో ఆ అమ్మాయి పెట్టే అరుపులకు ఆసన్ని వేశం చూస్తున్నవారికి గుండె ఆగిపోయినంత పనైంది. నిర్వాహకులు వచ్చి ఆమెను పట్టుకొనేందుకు ప్రయత్నించినా కొద్ది సేపు నియంత్రణలోకి రాలేకపోయింది. కేవలం కాళ్లకు కట్టి ఉన్న సేఫ్టీ బెల్ట్‌ల సహాయంతోనే ఆమె తిరిగి బతికి బయటపడింది.