breaking news
Services market
-
‘ఇంట్లో ఏం తింటాం.. బయటికెళ్దాం’.. ఆసక్తికర నివేదిక
దేశంలో ప్రజల ఆహార అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఈటింగ్ అవుట్, ఫుడ్ డెలివరీలకు సంబంధించిన భారతదేశపు ఫుడ్ సర్వీస్ మార్కెట్‌పై ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ కంపెనీ బైన్ సంయుక్తంగా ఓ అధ్యయనాన్ని నిర్వహించాయి. ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.దేశపు ఆహార సేవల మార్కెట్ వచ్చే ఏడేళ్లలో ఏటా 10–12% వృద్ధి చెందుతుందని, ఇది 2030 నాటికి రూ. 9–10 లక్షల కోట్లకు చేరుతుందని స్విగ్గీ-బైన్ నివేదిక తెలిపింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 5.5 లక్షల కోట్లుగా ఉందని, ఏడాది ప్రాతిపదికన ఇప్పటి వరకు ఉన్న 8–9% వృద్ధితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుందని నివేదిక పేర్కొంది. అంటే ఈ మార్కెట్లో ఉన్న కస్టమర్ బేస్ ప్రస్తుతం ఉన్న 33 కోట్ల నుంచి 2030 నాటికి 45 కోట్లకు చేరుతుంది.వేగంగా పెరుగుతున్న ఆన్లైన్ ఫుడ్ డెలివరీమొత్తం మార్కెట్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వృద్ధి గణనీయంగా పెరిగింది. 2019-2023 మధ్య కాలంలో ఇది 8% నుంచి 12%కి పెరిగింది. ఇది 18% రెట్టింపు వార్షిక వృద్ధి రేటుతో దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. 2030 నాటికి మొత్తం ఫుడ్ సర్వీస్ మార్కెట్లో 20% ఉన్న ‘ఈటింగ్ అవుట్’ కంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు వేగంగా పెరుగుతున్నాయి.స్థూల ఆర్థిక పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఈ నివేదిక ఉదహరించింది. వేగవంతమైన పట్టణీకరణ, జెనరేషన్ జెడ్ అంటే పాతికేళ్లలోపు యువత కొనుగోలు శక్తి పెరుగుదలతో సహా, బయటి ఫుడ్ తినే ప్రవృత్తి ఉన్నాయి. నెలకు సగటున ఐదుసార్లు బయట తినే భారతీయులు ఎక్కువగా బయటే తినే అమెరికా, చైనా వంటి దేశాలను అనుసరిస్తున్నారని నివేదిక పేర్కొంది. -
350 బిలియన్ డాలర్లకు దేశీ టెక్, సర్వీసెస్ మార్కెట్!
న్యూఢిల్లీ: భారత టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ పరిమాణం వచ్చే దశాబ్ద కాలంలో మరింత విస్తరించనుంది. ఈ పెరుగుదలకు కొత్త ఆవిష్కరణలు, వాణిజ్య నిర్వహణ వంటి అంశాలు దోహదపడనున్నాయి. ఈ విషయం నాస్కామ్-మెకిన్సె నివేదికలో వెల్లడైంది. నివేదిక ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 132 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ టెక్నాలజీ, సర్వీసెస్ మార్కెట్ దాదాపు 10-11% వృద్ధితో 2020 నాటికి 225 బిలియన్ డాలర్లకు, 2025 నాటికి 350 బిలియన్ డాలర్లకు పెరుగుతుం దని అంచనా. డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో గ్లోబల్ టెక్నాలజీ, బిజినెస్ సర్వీసులు 2025 నాటికి 3.6% సగటు వార్షిక వృద్ధి రేటుతో 4 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. దేశీ టెక్ పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధించడానికి అపార అవకాశాలు ఉన్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెక్ కంపెనీలు డిజిటల్ సర్వీసులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని మెకిన్సె ఇండియా మేనే జింగ్ డెరైక్టర్ నొషిర్ తెలిపారు. వ్యాపార అనుకూల పరిస్థితుల కల్పనకు పన్ను విధానం తదితర అంశాల్లో మార్పు రావాల్సి ఉందని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నాస్కామ్-మెకిన్సె నివేదిక