breaking news
the second phase of the test
-
నేడు సాక్షి స్పెల్‌బీ రెండో ద శ పరీక్ష
ఒంగోలు వన్‌టౌన్: సాక్షి ఇండియా స్పెల్‌బీ రెండో దశ పరీక్ష ఆదివారం ఒంగోలు రామ్‌నగర్ 7వ లైనులోని భాష్యం పబ్లిక్ స్కూలులో నిర్వహిస్తున్నట్లు సాక్షి ఇండియా స్పెల్‌బీ పరీక్ష నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షకు వివిధ కేటగిరీల నుంచి మొత్తం 163 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. సాక్షి స్పెల్‌బీ మొదటి దశ పరీక్షలో కేటగిరీ-1, 2, 3, 4లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 163 మందిని రెండో దశ పరీక్షకు ఎంపిక చేశారు. కేటగిరీ-1 విద్యార్థులకు ఉదయం 10 గంటలకు, కేటగిరీ-2 విద్యార్థులకు మధ్యాహ్నం 12 గంటలకు, కేటగిరీ-3 విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు, కేటగిరీ-4 విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటలకు, కేటగిరీ-4 విద్యార్థులకు మధ్యాహ్నం 4 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నుంచి లైవ్‌లో విద్యార్థులకు ప్రశ్నలు చెప్తారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు రాయాలి. రెండో రౌండ్లో ప్రతిభ కనబరిచిన 20 శాతం మందిని, మూడో రౌండ్‌కు ఎంపిక చేస్తారు. సెమీఫైనల్‌గా భావించే మూడో రౌండ్ పరీక్ష విజయవాడలో నిర్వహిస్తారు. రెండో రౌండ్ పరీక్షకు ఎంపికైన విద్యార్థులు ఆయా కేటగిరీలకు నిర్దేశించిన సమయానికి హాజరుకావాలని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులందరూ తప్పనిసరిగా తమ పాఠశాల యూనిఫాంలో రావాలి. పాఠశాల యాజమాన్యం జారీ చేసిన గుర్తింపు కార్డులు, మొదటి రౌండ్ పరీక్షకు హాజరైనప్పుడు, స్పెల్‌బీ నిర్వాహకులు జారీ చేసిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్లపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకొని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి. -
నేడు ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలకు పదును పెట్టేం దుకు ‘సాక్షి-ఇండియా స్పె ల్బీ’ సంయుక్త ఆధ్వర్యంలో ‘సాక్షి-స్పెల్‌బీ’ రెండో దశ పరీక్ష ఆదివారం జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆదివారం గుంటూరు లక్ష్మీపురం 4వ లైను (హరిహరమహల్ థియేటర్ రోడ్డు)లోని మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్ కేంద్రంలో జరిగే రెండో దశ పరీక్షకు హాజరు కావాలని నిర్వాహకులు ప్రకటించారు. ఒకటవ కేటగిరీ విద్యార్థులకు ఉదయం 10.15 గంటలకు, రెండో కేటగిరీకి మధ్యాహ్నం 12.15 గంటలకు, మూడో కేటగిరీకి మధ్యాహ్నం 2.15 గంటలకు, నాలుగో కేటగిరీ విద్యార్థులకు సాయంత్రం 4.15 గంటలకు పరీక్ష జరుగుతుందని వివరించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఆయా పాఠశాలల యూనిఫాం ధరించి ప్యాడ్లను వెంట తెచ్చుకోవాలని పేర్కొన్నారు. కేటగిరీల వారీగా నిర్దేశిత సమయానికి పరీక్ష కేంద్రంలో ఉండాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99127 22911 నంబర్‌కు ఫోన్ చేయూలని కోరారు.