breaking news
Saturdays
-
శనివారాలు బ్యాంకులు మూత నిజమేనా?
చెన్నై : బ్యాంకులకు జూన్ ఒకటవ తేదీ నుంచి ఐదు పనిదినాలు మాత్రమే ఉండనున్నాయని, ప్రతి శనివారం బ్యాంకులకు సెలవని ఇటీవల వాట్సాప్లో ఓ మెసేజ్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదట. ఇది కేవలం తప్పుదోవ పట్టించే మెసేజ్ మాత్రమేనని వెల్లడవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇటీవల విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా డీమానిటైజేషన్ తర్వాత నగదు విషయంలో, మిగతా ఆదేశాల విషయంలో ఆర్బీఐ ప్రకటించకున్నా.. కొన్ని మెసేజ్ లు ప్రజల్లో భయాందోళన రేపుతూ పంపుతున్నారు. ప్రజలకు భయాందోళన కలిగించే మెసేజ్ లు పంపే ముందు ఒక్కసారి రిజర్వు బ్యాంకు అధికారిక ప్రకటనను చెక్ చేసుకోవాలని వాదనలు వినిపిస్తున్నాయి. బ్యాంకులు కేవలం రెండో, నాలుగో శనివారం మాత్రమే సెలవు దినాలను పాటించనున్నాయి. 2015 ఆగస్టు నుంచి బ్యాంకులు ఈ సెలవును పాటిస్తున్నాయి. -
శనివారాల్లో సెలవు లేదు
భారీ వర్షాల వల్ల విద్యాసంస్థలు ప్రకటించిన సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులకు చేదు మాత్ర. పని దినాలను భర్తీ చేసేందుకు ఇకపై వారాంతపు సెలవు దినాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ప్రతి శనివారం విద్యాసంస్థలు పనిచేస్తాయని ప్రకటించింది. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం చెన్నైలో ప్రారంభమై జిల్లాలకు ఎగబాకి తీవ్రరూపం దాల్చింది. సముద్ర తీర, డెల్టా జిల్లాల్లో వారం రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, దిండుగల్లు తదితర జిల్లాల్లో విద్యాసంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించేశారు. ఈ సెలవు దినాలను పని దినాలుగా మారిస్తే గానీ విద్యార్థుల పాఠ్యాంశాల పోర్షన్ పూర్తికాదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఏడాదికి 220 పని దినాలు, ఉన్నత, మహోన్నత పాఠశాలలకు ఏడాదికి 210 పని దినాలుగా ఉన్నాయన్నారు. వర్షాల కాలంలో సహజంగా సెలవులు ప్రకటిస్తారు, అయితే ఈ సారి ఎక్కువగా సెలవులు మంజూరు చేసినట్లు భావిస్తున్నారు. ఈ కారణంగా శనివారం సైతం విద్యాసంస్థలు పనిచేయక తప్పదని ఉన్నతాధికారులు సూచించారు. అయితే అయా విద్యాసంస్థల పరిస్థితులను బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లకు వెసులుబాటు కల్పించారు.