పరుగుల రాణులు.. లక్ష్మీకటాక్షానికి దూరం !
బూర్జ: సీరపు సరస్వతి, ఆకెళ్ల చంద్రుడమ్మలదీ బూర్జ మండలంలోని చినకురుంపేట గ్రామం. పరుగులో కఠోర సాధన చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరూ కలిసి జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయిలో 49 స్వర్ణ, సిల్వర్ పతకాలు సాధించారు. అయితే వీరికి పేదరికం శాపంగా మారింది. కనీసం పోటీల్లో పాల్గొనేందుకు కూడా సహకరించని పరిస్థితి నెలకొంది. సీరపు సరస్వతిది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం. తల్లిదండ్రులు లక్ష్మి, సింహాచలంలు బతుకు తెరువు కోసం చెన్నై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. క్రీడాకారిణి సరస్వతి తాతగారి ఇంటివద్దే ఉంటూ బూర్జ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతోంది.
వారికి కూలి, వ్యవసాయ పనుల్లో సాయం చేస్తూనే మరోవైపు క్రీడలపై ఆసక్తి చూపుతోంది. కొన్నిసార్లరుుతే తిండికి కూడా కటకటే. పస్తులతో జీవించాల్సిన పరిస్థితి. సరస్వతి 2009వ సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతుండగా క్రీడలపై ఆసక్తి చూపించటంతో కె.కె.రాజపురం గ్రామానికి చెందిన కోచ్ ఈది అప్పన్న పరుగులో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. ఉత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దారు. దీంతో 11 రాష్ట్రస్థాయి, నాలుగుసార్లు జాతీయస్థాయి పోటీలకు హాజరై 35 పతకాలను సాధించింది. ఈ ఏడాది వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన 1000 మీటర్లు, 3000 మీటర్లు, మూడు కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. నాలుగు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. డిసెంబర్లో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో నిర్వహించనున్న అథ్లెటిక్ పోటీలకు అర్హత సాధించింది. అరుుతే, ఇప్పుడు అక్కడకు వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆవేదన చెందుతోంది. ఆపన్న హస్తాల కోసం ఎదురు చూస్తోంది.
చంద్రుడమ్మ పరిస్థితి మరింత దారుణం. ఈమె తల్లి తండ్రులు ఆకెళ్ల వరలక్ష్మి, శాంతారావులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కూలి చేస్తేనే ఆ రోజు నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్లేది. లేకుంటే పస్తులే. ఇలాంటి దుస్థితిలో కూడా చంద్రుడమ్మ తనకు ఇష్టమైన అథ్లెటిక్స్‌లో రాణిస్తూ ముందుకు సాగుతోంది. ఈమె ప్రస్తుతం కె.కె.రాజపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. 2011లో క్రీడల్లో అక్షరాభ్యాసం చేసిన చంద్రుడమ్మ మండల, జిల్లా, రాష్ట్రస్థారుు పోటీల్లో ప్రతిభ చూపుతోంది. ఇప్పటికే 14 పతకాలు కైవసం చేసుకుని జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగే జాతీయ స్థారుు పోటీల్లో తలపడేందుకు అర్హత సాధించింది. ఈమెది కూడా సర్వసతి పరిస్థితే. కూలాడితేగాని కుండాడని దుస్థితిలో పోటీల్లో తలపడేందుకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నారుు. కనీసం స్పోర్ట్సు దుస్తులు, షూస్, కొనుగోలు చేసుకునే స్థోమత కూడా లేదు. ఒంట్లో సత్తువ, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉన్నా పోటీల్లో పాల్గొనేందుకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. దాతలు దయతో ముందుకు వచ్చి చేయూతనివ్వాలని వేడుకుంటున్నారు. సహకరించాలనుకునేవారు కోచ్ ఈది అప్పన్న సెల్: 94904 05260 నంబర్‌ను సంప్రదించాలని ప్రాథేయపడుతున్నారు.