breaking news
same accused
-
బలవంతంగా కారులో ఎక్కించుకుని..
రోహ్టక్: 'హర్యానాలోని రోహ్టక్ కాలేజీలో నేను బీఎస్సీ మ్యాథ్స్ చదువుతున్నాను. బుధవారం ఉదయం 9 గంటలకు కాలేజీకి వెళ్లాను. మధ్యాహ్నం 1.30 గంటలకు కాలేజీ నుంచి తిరిగొస్తుండగా అంబేద్కర్ చౌక్ వద్ద అమిత్, జగ్మోహన్ కారు దగ్గర నిలబడి ఉండడం చూశాను. దారిలో వారు నన్ను అడ్డగించారు. నేను చాలా భయపడ్డాను. బలవంతంగా నన్ను కారులోకి తోసేశారు. మౌసమ్, ఆకాశ్, సందీప్ కారు లోపల కూర్చునివున్నారు. నేను కేకలు పెట్టకుండా చెంపదెబ్బలు కొట్టారు. నా సోదరుడి కోసం కూడా వెతికినా అతడు దొరకలేదని చెప్పారు. నాతో బలవంతంగా మత్తు పదార్థం తినిపించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియలేదు. స్పృహ వచ్చేసరికి అర్ధనగ్నంగా పడివున్నాను. మరోసారి అత్యాచారానికి గురైయ్యానని అర్థమైంది. నన్ను కారులోంచి బయటకు గెంటేశారు. నన్ను చంపాలని ఒకడు అన్నాడు. చిక్కుల్లో పడతామని మిగిలివాళ్లు వారించారు. నన్ను రోడ్డుపై వదిలేసి పారిపోయారు. అదే దారిలో వెళుతున్న కొంత మంది మహిళలు నన్ను ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక ఐదుగురు రేపిస్టులపై కేసు పెట్టాను. జైలుకు వెళ్లినా వీళ్ల బుద్ధి మారలేదు. తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. ఈ దుర్మార్గులను కఠినంగా శిక్షించాల'ని రోహ్టక్ గ్యాంగ్ రేప్ బాధితురాలు పేర్కొంది. హర్యానాలోని భివానిలో మూడేళ్ల క్రితం బాధితురాలిపై ఐదుగురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. మళ్లీ బుధవారం మరోసారి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విపక్షాలు, మహిళా సంఘాలు గట్టిగా డిమాండ్ చేశాయి. -
గ్యాంగ్ రేప్ బాధితురాలిపై మళ్లీ దారుణం
రోహ్టక్: హరియాణాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ దళిత యువతిని సామూహిక అత్యాచారం చేసిన నిందితులు మరోసారి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. రేప్ కేసును ఉపసంహరించుకోనందుకు నిందితులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు చెప్పారు. భివానిలో మూడేళ్ల క్రితం బాధితురాలిపై ఐదుగురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పట్లో కేసు నమోదైంది. నిందితులను అరెస్ట్ చేసినా తర్వాత బెయిల్పై బయటకువచ్చారు. కేసును వెనక్కు తీసుకోవాల్సిందిగా నిందితులు బాధిత కుటుంబ సభ్యులను పలుమార్లు బెదిరించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం రోహ్టక్కు మారింది. రోహ్టక్లోని ఓ మహిళా కాలేజీలో బాధితురాలు చదువుతోంది. బుధవారం కాలేజీకి వెళ్లిన ఆమె మళ్లీ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అదే రోజు రాత్రి సుఖ్పుర చౌక్ వద్ద బాధితురాలు అపస్మారకస్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఆమె దుస్తులు చిందరవందరగా ఉన్నాయి. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులు తనను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి అత్యాచారం చేశారని బాధితురాలు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.