25న సాహిత్య పురస్కార ప్రదానోత్సవం
ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక ఎస్బీ మెమోరియల్ హైస్కూల్లో ఈనెల 25న ఉదయం 10గంటలకు ఎస్.దస్తగిరిసాహెబ్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం, ''మన దస్తూ'' పుస్తకావిష్కరణ చేయనున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ అహ్మద్ హుసేన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శతావదాని నరాలా రామారెడ్డి, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ కలీముల్లా తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.