breaking news
Rs.1.44 Crores
-
రూ.1.44 కోట్ల నగదుతో పట్టుబడ్డ వ్యక్తి
-
రూ.1.44 కోట్ల నగదుతో పట్టుబడ్డ వ్యక్తి
హైదరాబాద్: ఎటువంటి పత్రాలు లేకుండా పెద్ద మొత్తంలో నగదును మూటల్లో తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 1.44 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి భారీ నగదు మూటలతో శనివారం అర్ధరాత్రి ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సమీపంలో పోలీసుల కంటపడ్డాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. నగదు నెల్లూరుకు చెందిన 14 మంది రైస్‌మిల్లుల యజమానులదని తెలిపాడు. అయితే ఈ భారీ మొత్తం నగదు ఎలాంటి పత్రాలు లేకుండా, ప్రభుత్వానికి ఎలాంటి రుసుము చెల్లించకుండా ధాన్యం తరలించడం ద్వారా సంపాదించిన డబ్బు కావడంతో వారి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగదును సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు.