breaking news
rajini reddy
-
ఎన్నికల ప్రచారంలో టిఫిన్ రెడీ!
సాక్షి, జోగులాంబ గద్వాల: అయిజ మండల పరిధిలోని సింధనూరు గ్రామంలో నివారం అలపూర్ బీజేపీ అభ్యర్థి రజినీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో ఓ హోటల్ వద్దకు వెళ్లారు. అప్పటికే కార్యకర్తలకు ఆకలి వేస్తుండడంతో రజినీరెడ్డి స్వయంగా పెద్ద పాత్రలో అల్పాహారం (ఉగ్గాని) తయారుచేసి కార్యర్తలకు వడ్డించారు. ఆ చేతులతో టీ తయారుచేసి గ్లాసుల్లో పోసి కార్యకర్తలకు అందించారు. -
'కేసీఆర్ భాషతో తెలంగాణకు ఒరిగేదేం లేదు'
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపయోగిస్తున్న భాషతో తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండబోదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి రజనీరెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మీద టీఆర్ఎస్ చేసిన విమర్శలన్నీ అవాస్తవాలని తేలిపోయిందని, తెలంగాణలో విద్యుత్ కోతలను నివారించేందుకు మహారాష్ట్రతో మాట్లాడతామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడినంత మాత్రాన ఈ ప్రాంత ప్రజలకు ఏమీ ఒరగదని కిషన్ రెడ్డి చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్ల విషయంలో కోతలకు టార్గెట్ పెట్టడంపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రజనీరెడ్డి బీజేపీలో చేరారు. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపర్చడానికే తాను బీజేపీలో చేరినట్లు రజనీరెడ్డి చెప్పారు.