పాలీసెట్ కౌన్సెలింగ్ షురూ
మెదక్‌టౌన్: పాలీసెట్-2015 కౌన్సెలింగ్ గురువారం మెదక్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైంది. మొదటిరోజు 1వ ర్యాంకు నుంచి 14 వేల ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్‌కు జిల్లా నలుమూలల నుంచి 270 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అధికారులు అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి, రిజిస్ట్రేషన్ చేయించారు. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వద్ద రూ.150ల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లను ఏఎస్డబ్ల్యూఓ వసంత, బీసీ సంక్షేమా శాఖ అధికారులు పరిశీలించారు.
రాజగోపాల్‌పేటలో..
నంగునూరు: రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం పాలీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 179 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ఈసందర్భంగా పాలీసెట్ కౌన్సెలింగ్ కో ఆర్డినేటర్ మోహన్‌బాబు మాట్లాడుతూ మొదటి రోజు ఒకటో ర్యాంక్ నుంచి 14,000 ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించామన్నారు. కౌన్సెలింగ్‌కు అన్ని సర్టిఫికెట్లను వెంట తెవాలన్నారు. జిల్లాలో రెండు సెంటర్లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.