ఇంద్రవెల్లి పోరాటం
ఏప్రిల్ 20వ తేదీ ఆదివాసీ పోరాట చరిత్రలో చెరVýæని జ్ఞాపకం. 70వ దశకం చివరిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసులు భూమి పట్టాలు, శిస్తు వసూలు, తూకంలో మోసం, షావుకారీ వ్యవస్థ తదితర తీవ్ర సమ స్యలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీలకు ‘గిరిజన రైతుకూలీ సంఘం’తో పరిచయం ఏర్పడింది. గోండు, కోలం, కోయ తెగల రైతులు అందులో చేరారు. పోడు భూములకు పట్టాలు, దళారీ షావుకారుల అధిక వడ్డీ వ్యాపా రంలో మోసాలు తదితర అంశాలపై గిరిజన రైతుకూలీ సంఘం మహాసభలను 1991 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ చేయాలని నిర్ణయించారు. ముందుగా సభ నిర్వహణ అనుమతికై స్థానిక ఆదివాసీలు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోగా, మొదట అనుమతి మంజూరు చేశారు. కానీ సభ జరిగే రోజు అను మతి రద్దుచేసి 144 సెక్షన్ విధించారు. అప్పటి విప్లవ పార్టీ పీపుల్స్‌వార్ సైద్ధాంతిక మద్దతును గిరిజన రైతుకూలీసంఘం కలిగివుందనే అనుమానంతో అధి కారులు ఈ పనికి పూనుకున్నారు. అను మతి రద్దయిన సంగతి తెలియక, 144 సెక్షన్ గురించిన సమాచార లోపంతోఇంద్రవెల్లి చుట్టుపక్కల గ్రామాల ఆదివా సులతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ గూడేల ఆదివాసులు పెద్ద సంఖ్యలోఇంద్రవెల్లి సభాస్థలికి వెళ్లారు. పోలీసులు చెట్లపై మాటువేసి ఆదివాసీలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 17 మంది ఆదివాసులు మరణించారు. వందల మందిని అరెస్టు చేశారు. ఈ ఘటనను పాఠ్యాంశం చేయాల్సిన అవసరముంది. – సిడం జంగుదేవ్,ఆదివాసీ విద్యార్థి సంఘంతెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు