breaking news
Raitanna life
-
అంపశయ్యపై అన్నదాత
సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రతి ఏటా కరువు విలయతాండం చేస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపించింది. రైతులకు సకాలంలో రుణాలు అందక రుణమాఫీ పూర్తిస్ధాయిలో వర్తించక తమ కష్టాలను ప్రభుత్వ పట్టించుకోకపోవడంతో అన్నదాతలో నిర్వేదం అలముకుంటోంది. జిల్లాలో రైతు కుటుంబాలు 5.50 లక్షలకు పైగా ఉంటాయి. సాగు విస్తీర్ణం 2.50 లక్షల హెక్టార్లు. ఇందులో దాదాపుగా 80 వేల హెక్టార్లలో వరిని ఎద పద్ధతిలో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 47,525 హెక్టార్లలో ఇతర పంటలు పండిస్తున్నారు. అధికారిక లెక్కలు అలా చెబుతున్నా వాస్తవానికి ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. అతివృష్టి లేక అనావృష్టి టీడీపీ అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని ఎన్నో విపత్తులు కదిపేశాయి. 2014లో హుద్‌హుద్ తుపాన్ సమయంలో సుమారు 3 లక్షల హెక్టార్లలో పంట పోయింది. అంతేకాకుండా నదుల్లో కట్టలు తెగిపోయి పొలాల్లో నీరుచేరి భారీగానే నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చిన సమయంలో 2018లో తిత్లీ తుపాన్ వచ్చి సుమారు 3.50 లక్షల హెక్టార్లను నీటముం చింది. రూ.510 కోట్లు నష్టం జరిగితే నేటికీ ఆ పరిహారం ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలకే అప్పగించింది. ఈ ఐదేళ్లలో వర్షాలు సరైన సమయంలో కురవక రణస్ధలం, లావేరు, జి.సిగడాం, వంగర, రేగిడి, సంతబొమ్మాళి, మం దస, భామిని మండలాల్లో కరువు సంభవించినా కరువు నిధులు నేటికీ అందలేదు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అందింది అరకొర నీరే ప్రధాన సాగునీటి వనరులైన తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అంతంతమాత్రంగానే అందించారు. నీటిపారుదల శాఖ అధికారులు నీరు–చెట్టు పనులు మీద చూపించే శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టుల మీద చూపించకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పలేదు. కాలువల్లో పూడికలు తీయక ప్రధా న సాగునీటిప్రాజెక్టుల నుంచి వచ్చేనీరంతా వృధా గా పోయింది. ప్రాజెక్టులు పూర్తికాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో అందని విత్తనాలు, ఎరువులు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులందరికీ కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించలే దు. అంతేకాక విత్తనాలు ఎరువులు అందించడంలోనూ పక్షపాత వైఖరినే అవలంబించారు. కల్తీ ఎరువులతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దళారీల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిíస్ధితి ఏర్పడింది. ఖరీఫ్ సమయానికి అరకొరగా విత్తనాలు పంపిణీ చేయడంతో రైతులు విత్తన కేంద్రాలు, మార్కెట్ యార్డుల వద్ద తిండితిప్పలు లేకుండా పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. జిల్లాకు విత్తనాలు ఖరీఫ్‌లో 50 వేల టన్నులు, రబీలో 1389 టన్నులు, ఎరువులు 2,62,988 మెట్రిక్ టన్నులు అవసరం ఉన్నప్పటికీ సకాలంలో సరఫరా చేయకపోవడంతో రైతులు నానాపాట్లు పడ్డారు. ఖరీఫ్ రుణాలు అంతంతమాత్రమే రైతులకు రుణ మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలు మీదే పెడతాననిని చెప్పి అధికారం చేపట్టిన చంద్రబాబు.. దానిని ఐదు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటికీ మాఫీ జరగలేదు. రూ.5 వేలు లోపు రుణాలు తీసుకున్నవారికే మాఫీ జరిగింది తప్ప మిగిలిన వారికి బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతంలో ఇచ్చినవాటికి రె న్యువల్ చేశారు తప్ప కొత్తగా ఒక్క పైసా ఇవ్వలేదు. నేటికీ అందని గతేడాది ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం రైతుల మెప్పు కోసం హడావిడిగా కరువు మండలాలను ప్రకటించడమే గానీ ఆదుకున్నది లేదు. 2015–2016లో ఖరీఫ్‌లో 18 కరువు మండలాలు, 2016– 2017లో 11, 2017–20 18కి గాను 9 కరువు మండలాలుగా ప్రకటించినా నేటికీ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. 2015–2016లో 3,10,867 హెక్టార్లకుగాను 89,450మంది రైతులకు రూ.46.63 కోట్లుగా ఇన్పుట్ సబ్సిడీ నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క రైతు ఖాతాలో కూడా ఒక్క రూపాయీ జమ కాకపోవడం గమనార్హం. ఇప్పటికీ బిల్లులను ఆన్లైన్లో ప్రాసెస్ చేస్తున్నామని చెబుతున్నారు. కౌలు రైతుల బతుకులు చితికాయి అధికారంలోకి రాకముందు కౌలు రైతులందరినీ ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. జిల్లాలో 2 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. వీరి లో ఇప్పటివరకు 18 వేల మందికి మాత్రమే గుర్తిం పు కార్డులు ఇచ్చారు. సాధారణ మరణాలుగానే ఆత్మహత్యలు పంటలకు గిట్టుబాటు ధరలేక అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వాటిని సాధారణ మరణాలుగానే గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. భామిని, కొత్తూరు మండలాల్లో రెండేళ్ల క్రితం పత్తి రైతు నష్టాలకు గురై మరణిస్తే వాటిని సహజ మరణాలుగానే అధికారులు, టీడీపీ నేతలు పేర్కొన్నారు. -
రాజధానిలో రైతు ఆత్మహత్య
హైదరాబాద్: పంట నష్టం ఆవేదన.. పెట్టుబడుల కోసం చేసిన అప్పులెలా తీర్చాలన్న ఆందోళన.. కన్న కొడుకు అనారోగ్యం.. వైద్యం చేయించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దైన్యం.. అన్నీ కలసి ఓ రైతన్న ప్రాణాలను బలితీసుకున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ రైతు ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఇంతకాలం గ్రామాల్లోనే జరుగుతు న్న రైతుల ఆత్మహత్యలు దీనితో రాజధానికి చేరాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన లింబయ్య అనే రైతు బుధవారం హైదరాబాద్‌లో లోయర్ ట్యాంక్‌బండ్ ప్రాంతంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో కరెంట్ స్తంభానికి ఉరి వేసుకొన్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం రాతాలరామరెడ్డికి చెందిన నేరళ్ల లింబయ్య(50), శ్రీలక్ష్మి దంపతులు. లింబయ్యకు ఐదెకరాల పొలం ఉంది. దీనిపై వచ్చే ఆదాయంతోనే కుటుం బాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నరేష్ (25) డిగ్రీ పూర్తిచేయగా, నవిత (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. మరో కుమారుడు నవీన్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం కామారెడ్డిలో చదువు తున్నాడు. మూడేళ్లుగా పెద్ద కుమారుడు నరేష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజుల నుంచి మూర్ఛలు రావడంతో చాదర్‌ఘాట్‌లో న్యూలైఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఒకవైపు రాబడి లేకపోగా మరోవైపు దాదాపు రూ.4 లక్షల అప్పు కావడంతో కుటుంబం పరిస్థితి దీనంగా మారింది. ఆస్పత్రిలో కుమారుడి వద్ద ఉన్న లింబయ్య బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు భార్య లక్ష్మికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఉద యం 8 గంటలకు లోయర్ ట్యాంక్‌బండ్‌లో కట్టమైసమ్మ ఆలయం వద్దకు చేరుకున్నాడు. పూజారిని కలసి రూ.10 వేలు అక్కడ పెట్టి ఆస్పత్రిలో ఉన్న తన కొడుక్కి అందజేయాలని చెప్పి వెళ్లాడు. తొలుత బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుందామనుకున్న లింబయ్యను అక్కడున్న స్థానికులు, పోలీసులు కాపాడి పక్కనే కూర్చోబెట్టారు. తర్వాత ఆలయం సమీపంలోని చెత్త డంపింగ్‌యార్డ్ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు స్తంభానికి వైర్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో పోలీసులు కాస్త పసిగట్టినా లింబయ్య ప్రాణం దక్కేది. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతంగా మారింది. లక్ష్మి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. తండ్రి మృతి విషయాన్ని ఆస్పత్రిలో ఉన్న కొడుకుకు చెప్పలేదు. ప్రస్తుతం నరేష్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పోషణ భారమైంది: లక్ష్మి మూడేళ్లుగా పంటలు రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయని, కొడుకు ఆరోగ్యం క్షీణిం చిందని లింబయ్య భార్య లక్ష్మి వాపోయింది. వీటికితోడు కుటుంబ పోషణ భారమవడంతో తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విలపిం చింది. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ లక్ష్మి రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.