breaking news
Railway Information
-
ఎస్ఎంఎస్ తో రైల్వే సమాచారం
రైల్వే ఎంక్వైరీకి ఫోన్ చేసి సరైన సమాచారం పొందలేక ఇబ్బంది పడుతున్నారా? మీరు వెళ్లాలనుకుంటున్న ట్రైన్ పేరు, నంబరు, టైమ్ టేబుల్, టికెట్ ధర, పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే 139 నంబరుకు ఎస్ఎమ్మెస్ చేసి సులభంగా సమాచారం పొందవచ్చు. ఎస్సెమ్మెస్ ఎలా చేయాలి? పద్ధతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. - సాక్షి, ఒంగోలు ఆన్లైన్ విధానంలో ట్రైన్ పేరు, ట్రైన్ నంబరు కోసం... టీఎన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ పేరు లేక ట్రైన్ నంబరు ఎంటర్ చేయండి. ఉదా: TN <TRIAN NAME> OR TN <TRIAN NUMBER> ఆ పేరున ఉన్న అన్ని ట్రైన్ల నంబర్లు, ట్రైన్ల పేరు మీ ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. టికెట్ ధర తెలుసుకోవాలంటే... ఫేర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ ప్రయాణం తేదీ, నెల, సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: FARE <TRIAN NUMBER> <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి ఎక్కడికి, అన్ని తరగతులు ధరలు కనిపిస్తాయి. ట్రైన్ టైమ్ టేబుల్ కావాలంటే... టైమ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు ఎంటర్ చేయాలి. ఉదా: TIME <TRIAN NUMBER> ట్రైన్ పేరు, ఎక్కడి నుంచి బయలు దేరుతుంది, ఎక్కడికి వెళ్తుంది, వారంలో ఎన్ని సార్లు అందుబాటులో ఉంటుంది, ఏ తరగతులు అందుబాటులో ఉంటాయి తదితర వివరాలు మీకు తెలుస్తాయి. ట్రైన్లో సీట్ ఉందా లేదా, వెయిటింగ్ లిస్ట్ తెలుసుకోవాలంటే.. సీట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబర్ స్పేస్ ప్రయాణం తేదీ నెల సంవత్సరం టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఎక్కే స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ దిగదలుచుకున్న స్టేషన్ ఎస్టీడీ కోడ్ స్పేస్ ఇచ్చి ప్రయాణించే తరగతి స్పేస్ కేటగిరిని ఎంటర్ చేయాలి. ఉదా: EAT <DOJ-*-*-*-D-D-MMYY> <STATION FROM: STD CODE > <STATION TO: STD CODE> <CLASS> <QUOTA> ఇక్కడ మీకు అన్ని తరగతులలో అందుబాటులో ఉన్న వివరాలు, వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉందో తెలుస్తుంది. ట్రైన్ రాకపోకల సమయం కోసం ఎడి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్రైన్ నంబరు స్పేస్ స్టేషన్ ఎస్టీడీ కోడ్ ఎంటర్ చేయాలి. ఉదా: AD <TRIAN NUMBER> <STATION STD CODE'> మీరు తెలుసుకోవాలనుకున్న ట్రైన్ టైమ్ టేబుల్ తెలుసుకోవచ్చు. పీఎన్ఆర్ ఎంక్వైరీ కోసం.. పీఎన్ఆర్ స్పేస్ ఇచ్చి పది సంఖ్యల పీఎన్ఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. ఉదా: PNR <PNR TEN DIGIT NUMBER> మీరు రిజర్వ్ చేసుకున్న టికెట్ స్టేటస్ తెలుస్తుంది. -
టోటల్ ఫ్రీ సేవలు
ఆరోగ్యశ్రీ కోసం 104 ఆరోగ్యశ్రీ పథకం గురించి 104కు పోన్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద అందించే సేవల సమాచారంతో పాటు ఈ పథకం కింద ఎక్కడైనా సేవలు అందకపోయినా, సిబ్బంది స్పందించకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. హెచ్ఐవీ సమస్యలకు 1997 ఎయిడ్స్, సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకునేందుకు 1997 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. హెచ్ఐవీ రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన పద్ధతులు తెలుస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలకు 108 ఎవరైనా ఆనారోగ్యం పాలైనా, ఎక్కడైనా ప్రమాదం జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వెంటనే హాస్పిటల్‌కు తరలించేందుకు 108 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసిన కొద్ది నిమిషాలకే అంబులెన్స్ కుయ్‌కుయ్ మంటూ పరుగులు పెడుతూ వస్తుంది. అంబులెన్స్ రావడం ఆలస్యమైతే ఈ నెంబరుకు మళ్లీ ఫోన్ చేయవచ్చు. బ్లడ్ బ్యాంకు కోసం 1910 ప్రమాదాలు అనుకోకుండా జరుగుతుంటాయి. ప్రాణాపాయంలో రక్తం అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి సమయాలతోపాటు అనారోగ్యంతో బాధపడుతుండే వారికి అత్యవసరంగా రక్తం కావాలన్న సందర్భంలో, సంబంధిత గ్రూపు రక్తం అందుబాటులో ఉందా, లేదా అనే విషయం తెలుసుకునేందుకు 1910 నెంబరుకు ఫోన్ చే యవచ్చు. అగ్నిప్రమాదం సంభవిస్తే 101 ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే 101 నెంబరుకు ఫోన్ చేసి ప్రమాద విషయాన్ని చెప్పవచ్చు. వారు వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొస్తారు. వేసవికాలంలో ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వెంటనే గమనించి ఈ నెంబరుకు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చు. టెలికం సేవలకు 198 టెలిఫోన్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తితే 198కు ఫిర్యాదు చేయవచ్చు. శాఖాపరంగా కావాల్సిన సమాచారం తెలుసుకునేందుకు ఈ నెంబరు ఉపయోగపడుతుంది. పోలీసుల సహాయం కోసం 100 సమాజంలో కళ్లెదుటే జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేనప్పుడు పోలీసుల నుంచి తక్షణ సహాయం కోరేందుకు ఈ నెంబరు ఉపయోగపడుతుంది. సమాజంలో ఎక్కువగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు ఇతర సమస్యలపైనా 100 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. అసాంఘిక కార్యకలాపాలపైఫిర్యాదు కోసం 1090 నేర సంబంధిత సమస్యల గురించి 1090 నెంబరుకు ఫోన్ చేసి తెలపాలి. ఇది జిల్లా విభాగంలో క్రైం విభాగానికి చేరుతుంది. ఇతరులు నుంచి ఇబ్బందులు ఎదురైనా, వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలు, జూదం, వ్యభిచార నిర్వహణ తదితర వీటిపై ఈ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. రైల్వే సమాచారం కోసం 131 రైళ్లలో ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు రైల్వే రిజర్వేషన్లు, రైళ్ల రాకపోక వివరాలను 131 నెంబరు ద్వారా తెలుసుకోవచ్చు. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి నడిచే రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఓటరు నమోదుకు 1950 రాజ్యాంగం ప్రకారం మన ఓటును మనమే నమోదు చేసుకోకపోతే అది చాలా తప్పు. అలా కాకుండా ఓటరుగా నమోదు కోసం 1950 నెంబరుకు పోన్ చేయవచ్చు. నమోదుకు కావల్సిన పత్రాలు, ఇతర వివరాలతో పాటు మార్పులు, చేర్పులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. ఫోన్‌ను దుర్వినియోగం చేయవద్దు ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, విలువైన సమాచారాన్ని తెలుసుకునేందుకు, సమస్యలను వివరించేందుకు, పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్లను ఆయా సంస్థలు ప్రకటించాయి. ఉచితంగా సేవలు అందుతాయి కదా అని, అనవసరంగా ఫోన్ చేసి తప్పుడు సమాచారం అందిస్తే సంబంధిత యంత్రాంగాల సమయం వృథాతోపాటు మరెన్నో అనర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. అవసరమైన వారికి సేవలు అందించడంలో జాప్యం చోటుచేసుకుంటుంది. గమనించండి. రైతుల కోసం 1800 425 2977 రైతులకు తమకు కావాల్సిన దాన్యం మద్దతు ధర అమలుకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు 1800425 2977 నెంబరుకు ఫోన్ చేయవచ్చు. రైతులకు మద్దతు ధర అందనప్పుడు, మిల్లర్లు దోపిడీ చేస్తున్నప్పుడు ఈ నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు. రైతులకు సంబంధిత అధికారులు సహకారం అందించకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 155333 విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారానికి 155333 నెంబరుకు ఫోన్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, సిబ్బంది పనితీరు, లో ఓల్టేజీ తదితర సమస్యలను సంబంధిత అధికారులకు ఈ నెంబరు ద్వారా తెలియజేయవచ్చు. మీసేవకు 1100 ఇటీవల కాలంలో ప్రవేశపెట్టిన మీసేవా కార్యక్రమాల అమలు తీరు తెలుసుకోవాలంటే 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న మీసేవలు సక్రమంగా పనిచేయకపోతే ఈ నెంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టీసీ సమాచారం కోసం 1800 200 4599 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సేవలపై అసంతృప్తి కలిగితే 18002004599 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టీసీ బస్సుల్లో కలిగే అసౌకర్యాలు, సిబ్బంది ప్రవర్తనపై ఈ నెంబరుకు ఫోన్ చేస్తే సరి.