breaking news
Qutb Shahi
-
డిజిటల్ వేదికగా ‘కుతుబ్ షాహీ టూంబ్స్’ పరిరక్షణ
సాక్షి, హైదరాబాద్: నగరానికే తలమానికమైన వారసత్వ సంపద ‘కుతుబ్ షాహీ సమాధుల’ను డిజిటల్ వేదికపై పరిరక్షించడంలో ముందుకు సాగుతున్నామని హెగ్జాగోనల్ రియాలిటీ టెక్నాలజీ సీఈఓ పాలో గుగ్లియెలి్మని తెలిపారు. కుతుబ్ షాహీ టూంబ్స్ డేటా–రిచ్ డిజిటల్ ట్విన్ కోసం హెగ్జాగోనల్ ఆధ్వర్యంలో రియాలిటీ టెక్నాలజీ నేపథ్యంలో మంగళవారం కుతుబ్ షాహీ సమాధుల వేదికగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలో గుగ్లియెల్మిని మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి, అధునాతన డిజిటల్ ఆవిష్కరణలతో చారిత్రాత్మక ల్యాండ్‌మార్క్‌ల సంరక్షణకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామన్నారు. నగరంలోని గత చరిత్రకు చెందిన అద్భుత ఆనవాళ్లను రక్షించడానికి రియాలిటీ టెక్నాలజీ వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. డిజిటల్–రియాలిటీ వేదిక డేటా– రిచ్ యాక్షన్ డిజిటల్ ట్విన్ను అనుసంధానం చేయడానికి అధునాతన ఏఐ పరిష్కారాలను వర్తింపజేశామని హెగ్జాగోనల్ ఆర్అండ్డీ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ మిశ్రా పేర్కొన్నారు. -
కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ?
చోళులు – ఆర్థిక పరిస్థితులు చోళుల కాలంలో ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం. దేవాలయాలు తమ ఆదాయాన్ని వ్యాపార సంస్థలు, గ్రామసభలకు 12 శాతానికి వడ్డీకి ఇచ్చేవి. గ్రామ రక్షణాధికారికి చెల్లించే పన్నును పాడికావలి కూలి అనేవారు. రాజరాజు–1 భూమిని సమగ్రంగా సర్వే చేయించాడు. వరిమ్ పొట్టగమ్ అంటే భూమిశిస్తు రికార్డు అని అర్థం. భూమి శిస్తును ధన, ధాన్య రూపాల్లో చెల్లించవచ్చు. వ్యక్తిగత భూములు, ప్రభుత్వ భూములు అని రెండు రకాల భూములుండేవి. పన్నులు మగ్గం పన్ను – తలైయిరై స్వర్ణకారులపై పన్ను – తట్టార పొట్టం నీటి వనరులపై పన్ను – వరక్కువార్ పట్టం సంతలపై పన్ను – అంగాడి పట్టం వర్తక పన్ను – శెట్టిరాం పన్ను ఉప్పు పన్ను – ఉప్పాయం చెరువుల అజమాయిషీని ‘పరిదారియం’ అంటారు. పంటలో 1/6 వంతును పన్నుగా విధించేవారు. మొదటి రాజరాజు కాలంలో 1/3 వంతు పంటను పన్నుగా విధించేవారు. గ్రామసభ సభ్యుడిగా పోటీ చేయాలంటే స్వగ్రామంలో ఒకటిన్నర ఎకరాల భూమి ఉండాలి. బహమనీ సుల్తానులు – ఆర్థిక పరిస్థితులు క్రీ.శ.1347– 1518 మధ్య కాలంలో బహమనీ సామ్రాజ్యంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ముఖ్యంగా మూడో మహ్మద్‌షా తన తల్లి ముఖ్దుమా–ఐ–జహాన్ కోరిక మేరకు ఆర్థిక అంశాల్లో నిపుణుడైన మహ్మద్ గవాన్‌ను ప్రధాని (వకీల్–ఐ–సుల్తానత్)గా నియమించాడు. దీంతోపాటు నిర్దిష్ట భూ వర్గీకరణ, శిస్తు విధానం, పంటల దిగుబడి లాంటి అంశాలను స్వయంగా పరిశీలించే వాడు. ఆ రోజుల్లో తోలు పరిశ్రమ ప్రధానమైందిగా కొనసాగింది. బీదర్, నిర్మల్, నాందేడ్, రాయ్చూర్లు కుటీర పరిశ్రమలకు కీలక కేంద్రాలుగా వెలుగొందాయి. కుండల తయారీకి బీదర్ కేంద్రంగా ఉండేది. బిద్రి పని విదేశాల్లో కూడా ప్రాధాన్యత పొందింది. 1/6 వంతును సరాసరి శిస్తుగా వసూలు చేసేవారు. వృత్తిపని వారు, కూలీల స్థితి రైతుల కంటే మెరుగ్గా ఉందని నికిటిన్ రాశాడు. వజ్రాలకు రాయచూర్ ప్రసిద్ధి చెందింది. ‘మహబూబ్–ఉల్–వతన్ ’అనే గ్రం«థం ఆ కాలంలోని సుంకాల గురించి పేర్కొంటుంది. వస్త్ర పరిశ్రమకు బీజాపూర్ ప్రసిద్ధి చెందింది. బంగారం, సుగంధద్రవ్యాలు, చైనా వస్తువులు, ముత్యాలు, బానిసలు, మేలురకం అశ్వాలు ప్రధాన దిగుమతులు. వస్త్రాలు, బిద్రి పరికరాలు, వరంగల్ కార్పెట్లు ప్రధాన ఎగుమతులు. కలప, గడ్డిపై ఎలాంటి పన్ను లేదు. గుల్బర్గా, బీదర్‌లలో టంకశాలలు ఉండేవి. పరిపాలనా యంత్రాంగం దివాన్ – ఆర్థిక మంత్రి అమీర్–ఐ–జుమ్లా – ఆర్థిక సలహాదారు సరబ్దారు – నీటి పంపిణీ పర్యవేక్షకుడు కుతుబ్‌షాహీలు – ఆర్థిక వ్యవస్థ కుతుబ్‌షాహీల కాలంలో రేవు పట్టణ ముఖ్యాధికారి? – షాబందర్ షాబందర్ ముఖ్య విధులు? – ఎగుమతి, దిగుమతి సుంకాల వసూలు కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్? – మజుందార్ ట్రెజరీ వ్యవహారాలు చూసే అధికారి? – ఖజానాదార్ మోటుపల్లి ఆనాటి ప్రధాన రేవు పట్టణం. అప్పట్లో నిజాంపట్టణం ఆదాయం? 55 వేల పగోడాలు బ్రాహ్మణులు, బనీయాలు రెవెన్యూ వసూలు, హక్కుల వేలంలో పాల్గొనేవారు. ఆనాటి ఒక çహోన్ను నేటి 3 రూపాయలకు సమానం. గ్రామస్థాయి అకౌంటెంట్? – కులకర్ణి పరగణా స్థాయి అకౌంటెంట్? – దేశ్‌పాండే వైశ్యులు భారీ ఎత్తున వ్యాపారం చేసేవారని థామస్చౌరీ తన రచనల్లో రాశాడు. సముద్రంపై జరిగే వ్యాపారాన్ని ‘ఓడబేరము’ అనేవారు. ‘ఓడకాడు’ అనే పదాన్ని శుకసప్తతిలో పేర్కొన్నారు. రాజమాత మాసాహెబా సైదాబాద్ పరిసరాల్లో మాసాహెబా ట్యాంక్‌ను నిర్మించింది. ఆర్థిక మంత్రిని ‘మీర్‌జుమ్లా’ అంటారు. వర్తకుల పెద్దగా చౌదరి ఉండేవాడు. పోతేదార్.. నాణేల మారకందారు. తుపాకీ మందుకు మచిలీపట్నం, నీలిమందుకు నాగులపంచ ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్‌లోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు మెరుగుపెట్టేవారు. పులికాట్, నరసాపురం, నిజాంపట్టణం మొదలైనవి ప్రసిద్ధ ఓడరేవులు. బ్రిటిష్ నౌక ‘గ్లోబ్’ను నరసాపురంలోనే తయారుచేశారు. గ్రామాల్లో మిరాశీ భూములుండేవి. మిరాశీ భూములు అంటే వంశపారంపర్య భూములు. దుర్గ్ జలాశయాన్ని గోల్కొండకు 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించారు. కుతుబ్‌షాహీల కాలం నాటి ప్రధాన కరెన్సీ – హోన్ను (బంగారు నాణెం). హోన్నును విదేశీ వర్తకులు, బాటసారులు ‘పగోడా’ అనేవారు. గోల్కొండ రాజ్యంలో వాడుకలో ఉన్న ఇతర కరెన్సీ – ఫణం, తార్, కాసు 1656లో కొల్లూరు గనిలో ‘కోహినూర్ వజ్రం’ దొరికింది. వజ్ర పరిశ్రమకు గోల్కొండ ప్రసిద్ధి. రామళ్లకోట, వజ్రకరూర్, పరిటాల.. వజ్రాలకు ప్రసిద్ధి చెందాయి. ‘పెరికలు’ వర్తక సామగ్రిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసేవారు. కుతుబ్‌షాహీల కాలంలో ‘ముఘ్రా’, ‘తెలియా’ అనేవారు నేత పని చేసేవారు. మస్లిన్, చింట్జ్ వస్త్రాలను పర్షియాకు ఎగుమతి చేసేవారు. ‘రిసాలత్ –ఇ–మిక్ధారియా’ గ్రంథంలో మీర్–మొమీన్– మహ్మద్– అస్ట్రాబాదీ తూనికలు, కొలతలను వివరించారు. -
నేడు ప్రపంచ వారసత్వ దినం
జుక్కల్, న్యూస్‌లైన్: జిల్లాలోని చారిత్రక సంపదకు రక్షణ కరువైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన అనేక కట్టడాలు శిథిలమవుతున్నాయి. జుక్కల్ మండలం కౌలాస్ కోటదీ ఇదే స్థితి. జుక్కల్ మండలం కౌలాస్ గ్రామం వద్ద 1544 సంవత్సరంలో కౌలాస ఖిల్లాను నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బాల్ ఘాట్ పర్వతాలలో కౌలాస అనే మహాముని తపస్సు చేసిన ప్రాంతంగా పేరున్నా ఈ ఖిల్లాకు కౌలాస ఖిల్లాగా నామకరణం చేసినట్లు కథనం ఉంది. ఇది రాష్ట్ర కూటులు, కాకతీయుల కాలంలో నిర్మించినట్లు చెబుతారు. మహ్మద్‌బిన్‌తుగ్లక్ పాలనలో కూడా ఈ కోట ప్రసిద్ధి చెందింది. కాకతీయులపై అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర చేసిన తర్వాత నాలుగు భాగాలుగా విభజించబడింది. బహమణి సుల్తానుల రాజ్యంలో ఇందూరు, కౌలాస ఖిల్లాలు ఉండేవి. కుతుబ్షాహి రాజ్యంలో కౌలాస్ సర్కార్‌గా పేరు గడించింది. మహారాష్ట్రలోని నాందేడ్ ఖందార్, ముఖేడ్, బాన్సువాడ బిచ్కుంద ప్రాతాలు కౌలాస రాజ్యం ఆధీనంలో కొనసాగాయి. నాలుగవ రాష్ట్రకూట రాజు గోవిందుని కాలంలో కౌలాస ప్రాంతం గొప్ప సాంస్కృతి కేంద్రంగా విరాజిల్లింది. కౌలాస్ ఖిల్లా అనేక యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. 1857లో బ్రిటిష్‌వారికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కౌలాస రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజా దీప్‌సింగ్ పాల్గొనట్లు చెబుతారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈకోటను చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. విలువైన శిల్ప సంపద కనుమరుగవుతండడంతో పర్యాటకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాతి కట్టడాలు ఖిల్లా లోపలిభాగంలో అత్యంత నైపుణ్యంతో నిర్మించిన రాతికట్టడాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. వెంకటేశ్వర మందిరం, రామ మందిరం, దుర్గా మాత మందిరాలు రాతితో నిర్మించారు. ప్రతి మందిరం వద్ద దిగుడు బావులతోపాటు ఏనుగులు స్నానాలు చేసేందుకు పెద్ద బావులను నిర్మించారు. ప్రస్తుతం ఈబావులు రాతికట్టడాలు కూలిపోయి పూడుకు పోతున్నాయి. దుర్గామాత మందిరంలోని గర్భగుడి కింద బంగారు నిధులు ఉన్నాయనే నమ్మకంతో కొందరు దుండగులు విలువైన విగ్రహాలను తొలగించి తవ్వకాలు జరిపారు. ఎంతో నైపుణ్యంతో నిర్మించిన మందిరాల చుట్టూ ముళ్ల పొదలు మొలచి ధ్వంసం అవుతున్నాయి. కోట లోపలి భాగంలో నిర్మించిన అనేక రాతి కట్టడాలలో ధాన్యాగారం, స్నానపు గదులు, రాణి గారి పట్టెపు మంచం, తదితర కట్టడాలు కూలిపోతున్నాయి. మాయమైన ఫిరంగులు పంచ లోహాలతో తయారు చేసిన అనేక ఫిరంగులు దొంగల పాలయ్యాయి. ఈ ఫిరంగుల తయారీలో బంగారాన్ని సైతం వాడిఉంటారనే నమ్మకంతో ఎత్తుకెళ్లి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఎక్కువ బరువుతో కూడిన కొన్ని ఫిరంగులు కోట లోపల ఉన్నాయి. అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ అధికారులు కోటను సందర్శించారు. గతంలో జిల్లా క లెక్టరుగా పనిచేసిన అశోక్ కుమార్ కోటను సందర్శించి పర్యటక ప్రదేశంగా మార్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయినా దీనిని పరిరక్షించేందుకు ఎలాంటి నిధులు విడదల కాలేదు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే వారసత్వంగా వస్తున్న చారిత్రక ప్రదేశాలు పర్యాటకులు కనువిందు చేస్తాయి.