'మాకు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోవాలి'
హైదరాబాద్: తమ కుటుంబానికి కాంగ్రెస్ హైకమాండ్ న్యాయం చేస్తుందని భావిస్తున్నామని పీవీ నరసింహారావు తనయుడు, మాజీ ఎంపీ పీవీ రాజేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా ఏవో కారణాల వల్ల ఇవ్వలేకపోయిందని వెల్లడించారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఎంపీ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ ఇస్తే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. తమ కుటుంబానికి ఇచ్చిన మాటను కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.