breaking news
punna Krishnamurti
-
విఠల్రావ్ను ‘స్మృతి’ద్దాం!
అందరి కోసం కనులు నవ్వు తాయి/నాకోసం కాటుక ఏడుస్తుంది (సబ్ కె లియె ఆంఖే హస్ తీ హై/ మేరే లియే కాజ ల్ రోతా హై) తాను తరచూ ఆలపించే గజల్ చరణం పండిట్ విఠల్ రావ్ శివ్పుర్కార్కు వర్తించడం ఎంత విషాదం! ‘సుకవి జీవించు ప్రజల నాల్కల మీద’ అన్నట్లుగా హైద్రాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మగ్దుం మొహియుద్దీన్ రచన ‘ఏక్ చమేలీ కె తలే’ను విఠల్‌రావు గాత్రంలో వినని గజల్ ప్రియులు లేరు! మే 29న షిర్డీలో విఠల్‌రావు తప్పిపోయారు. మరు సటి రోజు రాష్ట్రప్రభుత్వం వివిధరంగాల ప్రముఖులకు తెలంగాణ అవార్డులను ప్రకటించింది. జూన్ 2న పెరేడ్ గ్రౌండ్స్‌లో అవార్డు స్వీకరించేందుకు విఠల్రావూ వస్తారని అందరూ ఎదురు చూశారు. రాలేదు! ఎందుకు? అప్పుడు తెలిసింది... విస్మృత వ్యాధి! ఆయన అల్జీమర్స్ డిసీజ్(ఎడి)కు గురైనారని, తప్పిపో యారని! జూన్ 27న విఠల్‌రావు అనామకుడిగా ‘గాంధీ’ మార్చురీకి చేరారు! తాను జీవించి ఉండగా ప్రకటితమైన అవార్డును కుటుంబసభ్యులు వేద నాశ్రువులతో స్వీకరిం చారు! అవాంఛిత ప్రొటీన్లు మెదడులో గడ్డకట్టడం వలన అరవయ్యేళ్లు దాటిన వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవ కాశం ఉంది. వస్తువులు ఎక్కడ పెట్టిందీ గుర్తుండక పోవడంతో మొదలై స్నేహితులను, కుటుంబ సభ్యులను, స్థలాన్ని, కాలాన్ని, తనను, భాషనూ మరచిపోయే స్మృతి హీనతకు దారితీస్తుంది! ప్రాచీనస్మృతులు తప్ప వర్తమానం గుర్తుండదు! ప్రతి పది మంది వృద్ధుల్లో ఒకరికి, వయసు పెరిగే కొద్ది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి నిర్దుష్టమైన వైద్య చికిత్స లేదు. ఈ వయసులో ఇది సహజమే అనుకుంటూ కుటుంబ సభ్యులే సంరక్షిస్తారు. ఫలితంగా పాశ్చాత్య ప్రపంచంలో వలె మన ప్రభుత్వ వైద్యశాఖ రికార్డుల్లో అల్జిమీర్స్ వ్యాధిగ్రస్తుల గణాంకాలు ఖచ్చితంగా ఉండవు. చివరి నిజాం ఆస్థాన గాయకుడు, నిజాంకు ఆయన షహజాదీ (కుమార్తె)కి, వివిధ సంస్థానాధీశులకు గజల్స్ వినిపించిన విఠల్‌రావుకు ఆ వ్యాధి ఉందని ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు సన్నిహితులకు తప్ప ఇతరు లకు తెలియదు. శిష్యులకూ తెలీదు. కెనడా దేశపు అత్యు న్నత గాయనిగా జునొ అవార్డు పొందిన విఠల్‌రావు శిష్యు రాలు కిరణ్ అహ్లువాలియాకూ తెలీదు. విఠల్‌రావు శిష్యరి కం చేసిన హరిహరన్కూ తెలీదు! తెలిసినా చేయగలిగిందే మైనా ఉందా? పోలీసులకు ఫిర్యాదు చేయడం, తెలిసిన వారికి చెప్పడం, కళ్లుకాయలు కాసేలా కుటుంబసభ్యులు ఎదురుచూడడం తప్ప! సంస్థలు ఏర్పడాలి! తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మం ది వృద్ధులు వివిధ దశల అల్జిమర్స్ బాధితులని విఠల్‌రావు ఉదంతం వెలుగులో మనం గుర్తించాల్సి ఉంది. గుర్తిస్తేనే... అభివృద్ధి చెందిన దేశాల్లో వలె మనకూ అల్జి మర్స్ అసోసియేషన్స్, ఫౌండేషన్స్, ఆదు కునే యంత్రాంగం ఏర్పడతాయి. ఆయా దేశాల్లో వ్యాధికి గురైన వ్యక్తులకు తేలికగా తీసుకునేందుకు వీలుకాని కడియాలు, లాకెట్స్ అమర్చవచ్చు. అవి, సంబంధితుల ఫోన్ కాల్స్‌కు స్పందిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. శబ్దమూ, వెలుతురు ద్వారా పౌరసమాజం గుర్తిస్తుం ది. ఆ పరికరాల్లోని మెడికల్ రికార్డు, వైద్యు లకు ఉపకరిస్తుంది. లోకం చుట్టిన గాయకుడు... అమెరికాతో సహా అనేక యూరోప్ దేశాలు, మధ్యప్రా చ్య దేశాలు పర్యటించిన విఠల్‌రావును ఆయా దేశాల్లో స్థిరప డమని ప్రముఖులు కోరారు. తాను ఘోషామహల్ వీడ నని ఒక గజల్ (సారే ఫలక్ కీ సైర్ కియా...) ద్వారా చెప్పారు! లోకం చుట్టిన గాయకుడు అల్జీమర్స్ కారణంగా తన గూటికి చేరుకోలేకపోయారు! ‘రాత్రి నిశ్శబ్దంగా వెళ్లిపోయిందని ఒక పిచ్చివాడు ఏడ్చాడు’ అనే చరణాన్ని అభిమానులకు మిగిల్చి! ఆ సాంస్కృతిక రాయబారి పేరుతో 108 తరహాలో ఒక ‘స్మృతి’దాయక వైద్యవ్యవ స్థను ఏర్పాటు చేయడం ప్రజలందరూ హర్షించే నివాళి కాగలదు! (వ్యాసకర్త, ఇండిపెండెంట్ జర్నలిస్ట్) మొబైల్: 7680950863 - పున్నా కృష్ణమూర్తి -
ది గ్రేట్ ఎస్కేప్
మీర్ లాయక్ అలీ (Mir Laiq Ali) పారిశ్రామిక వేత్త, ఇంజనీర్. 1947 డిసెంబర్ 1న హైదరాబాద్ స్టేట్ (చివరి) ప్రధాన మంత్రిగా నిజామ్ నియమించాడు. యునెటైడ్ నేషన్స్‌లో తమ దేశపు అధికారిక ప్రతినిధిగా పాకిస్థాన్ నియమించింది. 1948 సెప్టెంబర్‌లో ‘పోలీస్ చర్య’ ఫలితంగా హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. హైద్రాబాద్ స్టేట్ చివరి ప్రధాని, పాకిస్థాన్ దౌత్యవేత్త అయిన లాయక్ అలీని బేగంపేటలోని ఓ విశాలమైన ఇంట్లో (ఇప్పటి అమృతామాల్) భారత ప్రభుత్వం నిర్బంధించింది. కాలం గడుస్తోంది. 1950 జనవరి 26న గణతంత్ర రాజ్యంగా ఇండియా ఆవిర్భవించింది. లాయక్ భవిష్యత్ అగమ్యం!. పాకిస్థాన్‌కు తరచూ వెళ్లివచ్చే న్యాయవాది అబ్దుల్ కువీ, అలీ భార్య, చెల్లెలితో కూడబలుక్కుని ప్లాన్ వేశారు. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు ‘అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తయారు చేశారు’! లాయక్ అలీ ‘అనారోగ్యం’! తనకు కడుపునొప్పి అని ఆగ్రా జైలు సిబ్బందిని నమ్మిస్తాడు ఛత్రపతి శివాజీ! తన ఆరోగ్యం ‘బాగు’ చేసిన వైద్యుల కోసం, జైలు సిబ్బంది కోసం పండ్లు తెప్పించుకుంటాడు. అనుకూలమైన సమయం కోసం వేచి ఉంటాడు! ఖాళీ పండ్ల గంపలలో తాను, తన కుమారుడు ఆగ్రా నుంచి తప్పించుకుంటారు. ఈ ఉదంతంలో ‘అనారోగ్యం’ చిట్కా లాయక్ బృందానికి నచ్చి ఉంటుంది. అధికారులు చరిత్ర చదవరని వారికి తెలుసు! తన భర్తకు అనారోగ్యంగా ఉందని లాయక్ భార్య టాంటాం వేసింది! లాయక్ మంచం ఎక్కాడు! రోజూ అరుపులు, ప్రార్థనలు, వచ్చిపోయేవారు! బంజారాల నాట్య బృందంతో వచ్చే సందర్శకులు కాపలా సిబ్బందికి పండ్లు, స్వీట్లు, ఇతర ఆకర్షణీయ వస్తువులూ అందజేసేవారు. సిబ్బంది ఆడుతూ పాడుతూ ఆనందంగా డ్యూటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాయక్ సమీప బంధువుల వివాహం ఉందని ఒక వాహనాన్ని తెప్పించి నిర్బంధ గృహం నుంచి కొన్ని వస్తువులను పాకిస్థాన్ తరలించేందుకు పరదాలలో తరలించారు! పరదా కారు! బేగం సాహెబా ఫౌరన్ డాక్టర్ దగ్గరకు వెళ్లాలని ఒక పరిచారిక గార్డులతో నమ్మబలికింది. బెడ్‌పై దిండ్లు అమర్చి లాయక్ ‘గృహం’లోనే ఉన్నారనే ఎఫెక్ట్ తెచ్చి బేగం సాహెబా కాపలాదారుల కంటపడకుండా దాక్కుంది. కారు పోర్టికోలోకి రాగానే నిశ్శబ్దంగా లాయక్‌అలీ కారులోకి చేరాడు. కారును నేరుగా తన చెల్లెలు ఇంటికి, మరో కారులో న్యాయవాది ఇంటికి డ్రైవ్ చేశాడు. అసలు కారు ‘గృహోన్ముఖం’ బేగం సాహెబా మందులతో వచ్చేశారహో అంటూ! దాక్కున్న చోటునుంచి బేగం సాహెబా లాయక్ అలీ డమ్మీ పడక వద్దకు వచ్చి, బెడ్‌షీట్స్ మార్చారు. డాక్టరుగారు మందులు మార్చారు, విశ్రాంతి తీసుకోండని పరిచారికలు వినేలా జనాంతికంగా చెప్పింది! తాను సిద్ధం చేసిన పరదా కారులో న్యాయవాది, లాయక్ అలీ, అతని కుమారుడు, చెల్లెలు గుల్బర్గా వైపు దూసుకుపోతున్నారు! నగర పొలిమేరలు దాటాక పరదాలు తొలగించి సిటీ శివారు ప్రాంతాలను లాయక్ అలీ చివరిసారి చూశాడు! సికింద్రాబాద్ నుంచి ముంబై వెళే ్లందుకు రైలులో నాలుగు బెర్త్‌లున్న ఫస్ట్‌క్లాస్ కంపార్ట్మెంట్ బుక్కై ఉంది. ప్రయాణికులు గుల్బర్గాలో ఎక్కుతారనడంతో ఇతరులెవరూ ఎక్కకుండా కంపార్ట్మెంట్ను రిజర్వ్ చేశారు. గుల్బర్గా దర్గాలో ప్రార్థనలు చేసి, సాధువుల దర్శనం చేసుకుని నలుగురూ రెలైక్కారు! గులాం అహ్మద్ పేరుతో విమానం ఎక్కిన లాయక్ అలీ ముం‘బై’ నుంచి పాకిస్థాన్ చేరుకున్నారు. లాయక్ అంటే నైపుణ్యం, అని గుర్తు చేస్తూ! కారు తోసిన పోలీసు పెద్ద! ఇక్కడ హైదరాబాద్‌లో వేళ తప్పకుండా ‘లాయక్ అలీ’కి బేగం మందులను అందిస్తున్నారు. చివరి ప్రధానమంత్రి ఆరోగ్యం కోసం వైద్యులు, సందర్శకులు, ప్రార్థనలూ షరామామూలు! తనకు విశ్వసనీయులైన అరబ్ సర్వెంట్‌కు బేగం కొత్త కరెన్సీ కట్టలను పుష్కలంగా అందజేశారు! ఫలానా ఫలానా వారికి ఆదివారం ఇవ్వవలసినదిగా సూచించి, తన సోదరుని ఇంటికి కారులో వెళ్లారు. అక్కడ నుంచి ముంబైకి వెళ్లేందుకు పరదాకారులో బేగంపేట బయలుదేరారు! ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్లడమే తరువాయి! కారు మొరాయించింది. డ్రైవర్ కారు దిగి, స్టీరింగ్ తిప్పుతూ నెడుతున్నాడు! వెనుక కారులో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జైటీ ్ల ! పరదాకారులో నగర ప్రముఖులు ఇబ్బందిపడుతున్నారనే కారుణ్యంతో కిందకు దిగి ‘హైలెస్సా’ అన్నారు! లాయక్ విమానంలో ఎగిరిపోతే ఆయన కుటుంబం ‘ఎస్.ఎస్.సబర్మతి’ అనే పడవలో కరాచీ చేరుకుంది! పాకిస్థాన్ రేడియో ఉవాచ! పాకిస్థాన్‌లోని ఇండియా హౌస్‌లో ఒక విందులో లాయక్ అలీ కన్పించారని తొలిసారిగా పాకిస్థాన్ ఆకాశవాణిలో ప్రతిధ్వనించింది! ‘ఇది నిజమా?’ అని అక్కడి భారత రాయబారి శ్రీప్రకాశ కేంద్ర హోంమంత్రి వల్లభాయ్ పటేల్‌కు ఫోన్ చేశారు! ‘లేదే’ అన్నారు ఉక్కుమనిషి! విచారించగా ‘క ట్టుకథ’ వెల్లడైంది! లాయక్ శ్రీమతి, సోదరి షౌకత్ ఉన్నీసా, న్యాయవాదిపై, కొందరు అధికారులపై, ఉద్యోగులపై ప్రభుత్వం కేసు పెట్టింది. భారత ప్రభుత్వం గణతంత్ర రాజ్యం అయిన నేపథ్యంలో, పూర్వరంగంలోని వ్యక్తులపై చేసిన అభియోగాలు పరిశీలించలేమని కోర్టు చెప్పింది! అక్టోబర్ 24వ తేదీకి లాయక్ అలీ మరణించి 44 ఏళ్లు అవుతోంది. న్యూయార్క్ నగరంలో ఉదయం పూట ప్రార్థన చేస్తూ మరణించిన అతడి పార్థివ దేహాన్ని సౌదీ అరేబియాలోని మదీనాకు తరలించి విశ్రమింపజేశారు! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి