breaking news
Pune ODI
-
తొలి వన్డేలో నో బౌలింగ్.. ఈ వన్డే సంగతేంటి!
ఫుణే : టీమిండియాలో గత కొంత కాలంనుంచి రాణిస్తున్న ఆటగాడు కేదార్ జాదవ్. బ్యాట్ తో పాటు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇవ్వగల క్రికెటర్. తొలి వన్డేలో భారత్ ఓటమిపాలుకాగా ఆ మ్యాచ్ లో జాదవ్ చేతికి బంతి అప్పగించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే రెండో వన్డేలో మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ విమర్శకులకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. రెండో వన్డేలో జాదవ్ తొలి ఓవర్లో కేవలం ఒకే పరుగు ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఆ సెషన్లో ఆరు ఓవర్లు వేసిన జాదవ్ కేవలం 16 పరుగులే ఇచ్చి కివీస్ టాప్, మిడిలార్డర్ ఆటగాళ్లను ఇబ్బందులకు గురిచేశాడు. తొలి వన్డేలోనూ జాదవ్ చేతికి బంతిని ఇచ్చి ఉంటే.. పరుగులు కట్టడి చేసేవాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పరుగులు రాని పక్షంలో కివీస్ బ్యాట్స్ మెన్లు ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకునేవారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వన్డేలో జాదవ్ బౌలింగ్ లో పరుగులు తక్కువ వస్తుండటంతో రన్ రేట్ పెంచే యత్నంలో కివీస్ కీలక ఆటగాళ్ల వికెట్లు కోల్పోయింది. తాను వేసిన చివరి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న జాదవ్.. ఓవరాల్ గా 8 ఓవర్లలో 3.87 ఎకానమీతో 31 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్ లో జాదవ్ కంటే అతి తక్కువ ఎకానమీ (3.80)తో బౌలింగ్ చేసిన ఆటగాడు బుమ్రా మాత్రమే. నేరుగా తన బౌలింగ్ లో వికెట్లు తీయకపోయినా తొలి ఆరు ఓవర్లలో పరుగులు ఇవ్వకపోవడంతో ఇతర భారత బౌలర్లకు వికెట్లు తీయడం సులభతరం అయిందని ట్వీట్లు చేస్తున్నారు. -
‘జాదవ్ రెచ్చిపోతాడనుకోలేదు’
పుణె: మొదటి వన్డే మ్యాచ్ లో టీమిండియాను ఓడించాలన్న తమ వ్యూహాలను కేదార్ జాదవ్ చిత్తు చేశాడని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వాపోయాడు. జాదవ్ చెలరేగుతాడని తాము ఊహించలేదని అన్నాడు. ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డేలో జాదవ్ విజృభించి సెంచరీ చేయడంతో కోహ్లి సేన శుభారంభం చేసింది. ‘భారత్ 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో మా కష్టాలు మొదలయ్యాయి. మిడిలార్డర్ లో మేము బ్యాటింగ్ బాగానే చేశాం కానీ బౌలింగ్ లో మాత్రం తడబడ్డాం. జాదవ్ విజృభించి ఆడతాడని మేము ఊహించలేదు. టీమిండియా విజయం ఘనత 65 బంతుల్లో సెంచరీ చేసిన అతడికే దక్కుతుంది. మా నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతి నుంచే బాదాడం మొదలు పెట్టాడు. మాకు అసలు అవకాశం ఇవ్వలేద’ని మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ కు ముందు జాదవ్ ఆటతీరును అధ్యయం చేశామని, అయితే సీరియస్ గా తీసుకోలేదని వెల్లడించాడు. ‘అంతర్జాతీయ మ్యాచుల్లో జాదవ్ ఆడిన మ్యాచ్లను చూశాం. అతడిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాం. జాదవ్ ను కట్టడి చేసేందుకు మరింత కసరత్తు చేయాల్సిందని మ్యాచ్ ముగిసిన తర్వాత అనిపించింద’ని మోర్గాన్ చెప్పాడు. కోహ్లిని కట్టికి చేసేందుకు తమ వ్యూహాలు ఫలించలేదని అన్నాడు.