breaking news
Public sector telecom company
-
బీఎస్ఎన్ఎల్ సీఎండీగా శ్రీవాస్తవ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సీఎండీగా అనుపమ్ శ్రీవాస్తవ నియామకాన్ని కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది. గత ఎంతో కాలంగా ఈ ఆమోదముద్ర పెండింగులో ఉంది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి బీఎస్ఎన్ఎల్ ప్రతినిధి నిరాకరించారు. ప్రస్తు తం బీఎస్ఎన్ఎల్ సీఎండీగా ఆ సంస్థ డెరైక్టర్ ఏఎన్ రాయ్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. -
బీఎస్ఎన్ఎల్ నుంచి కొత్త ఫోన్.. @ భారత్ రూ.1799
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ చౌక ఫీచర్ ఫోన్, భారత్ ఫోన్‌ను శుక్రవారం మార్కెట్లోకి తెచ్చింది. పాంటెల్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఫీచర్ ఫోన్ ధర రూ. 1,799 అని బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఆర్.కె. ఉపాధ్యాయ్ తెలిపారు. సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన 3 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 1,200 నిమిషాల టాక్‌టైమ్ ఉచితమని పేర్కొన్నారు. ఈ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయవచ్చని, ఫేస్బుక్, ఈ మెయిల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని, మ్యూజిక్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఈ ఫోన్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ కంపెనీ మరో రెండు మొబైల్ ఫోన్లను, ఒక ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. 5 అంగుళాల స్మార్ట్‌ఫోన్ ధర రూ. 6,999 గానూ, 6.5 అంగుళాల స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999గానూ, ట్యాబ్లెట్ పీసీ ధరను రూ.6,999గానూ నిర్ణయించింది. ఈ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీ స్పెషల్ టారిఫ్ ఓచర్(ఎస్టీవీ)లతో లభ్యమవుతాయని ఉపాధ్యాయ్ చెప్పారు.