breaking news
public charging locations
-
ఈవీలు.. చార్జింగ్!
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) అమ్మకాలతోపాటు.. వాటి విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. 2024–25లో రికార్డు స్థాయిలో సుమారు 19.65 లక్షల ఈవీలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈవీల కోసం ఏర్పాటుచేస్తున్న పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్) కూడా గత మూడేళ్లలో భారీగా పెరిగాయి. కేంద్ర విద్యుత్ సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ – సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. ఈ స్టేషన్లలో చార్జింగ్ కోసం 2024–25లో వినియోగించిన విద్యుత్ 847 మిలియన్ యూనిట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 82 శాతం అధికం కావడం గమనార్హం. పీసీఎస్‌లు వినియోగించిన విద్యుత్ విషయంలో తెలుగు రాష్ట్రాలు టాప్ – 7 జాబితాలో ఉన్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈవీల కోసం ఏర్పాటుచేసిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో (పీసీఎస్) దేశవ్యాప్త విద్యుత్ వినియోగం 2024–25లో 847.8 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. 2024 ఏప్రిల్ నెలలో వినియోగం 52.88 ఎంయూలు కాగా 2025 మార్చిలో ఇది 60.7 శాతం పెరిగి 85 ఎంయూలకు ఎగసింది.తెలంగాణ@ 5.. ఏపీ @ 7కేంద్ర విద్యుత్ సంస్థ నివేదిక ప్రకారం పీసీఎస్‌లు వినియోగించే విద్యుత్‌లో ఢిల్లీ 38.69 శాతం వాటాతో ముందంజలో ఉంది. విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, పీసీఎస్‌ల అధిక విద్యుత్ వినియోగానికి కారణం.. రాజధానిలో ఈవీల అమ్మకాలు దూసుకెళ్లడమే. మహారాష్ట్ర 25.57 శాతం, కర్ణాటక 9.39, గుజరాత్ 7.56 శాతాలతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 5వ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ నిలిచాయి. టాప్ – 4 మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 18.78 శాతం విద్యుత్‌ను వినియోగించాయి.ఈవీలు – చార్జింగ్ స్టేషన్లుగత సంవత్సరంలో అమ్ముడైన ఈవీలు సుమారు 19.65 లక్షలు2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,1512025 ఏప్రిల్ 1 నాటికి 26,367కు చేరిక» ప్రస్తుతం తెలంగాణలో 976, ఏపీలో 616 కేంద్రాలు» 2013–14 నుంచి 2024–25 మధ్య అమ్ముడైనవి 59.25 లక్షల యూనిట్లు» ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి 44 లక్షలు2.5 నుంచి 3.5 రెట్లు తెలంగాణలో ఈ ఏడాది ఒక రోజులో నమోదైన గరిష్ఠ విద్యుత్ వినియోగం దాదాపు 339 ఎంయూ. అదే ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే సుమారు 240 ఎంయూ. అంటే తెలుగు రాష్ట్రాల ఒక రోజు విద్యుత్ వినియోగంతో పోలిస్తే సుమారు 2.5 నుంచి 3.5 రెట్లు ఎక్కువ విద్యుత్తును.. 2024–25లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు వినియోగించాయన్నమాట.ఏటా 50,000 స్టేషన్లుభారత్లో 2025 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ఈవీల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 26,367. 2022 డిసెంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నాటికే వీటి సంఖ్య సుమారు ఐదింతలు కావడం విశేషం. కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో 5,880 కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,746, ఉత్తరప్రదేశ్‌లో 2,137, ఢిల్లీలో 1,951, తమిళనాడులో 1,524 స్టేషన్స్్స పనిచేస్తున్నాయి. తెలంగాణలో 976, ఆంధ్రప్రదేశ్‌లో 616 స్టేషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం; ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం ఎలక్ట్రిక్‌వే ఉండాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా చార్జింగ్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో ఏటా దాదాపు 50,000 చార్జింగ్ పాయింట్ల చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది.త్రీవీలర్ల అమ్మకాల్లో నం.1 ఈవీల అమ్మకాల్లో భారత్‌లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 2024–25లో 17 శాతం వృద్ధితో 19,64,831 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో టూవీలర్స్ గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగి 11,49,307 యూనిట్లు, త్రీవీలర్స్ 10 శాతం అధికమై 6,99,062 యూనిట్లను తాకాయి. 1,07,462 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల అమ్మకాల్లో రెండేళ్లుగా భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. చైనా గత ఏడాది 3,00,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్స్‌ను విక్రయించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు సరుకు డెలివరీ కోసం ఈవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. 2032 నాటికి 12.3 కోట్ల ఈవీలు భారతీయ రోడ్లపై పరుగు తీస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2013–14 నుంచి 2025 మార్చి వరకు భారత్‌లో 59.25 లక్షల యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం 44 లక్షలు రోడ్లపై పరుగుతీస్తున్నాయి. -
చార్జింగ్ వసతులకు రూ.16,000 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) కోసం దేశంలో పెరుగుతున్న పబ్లిక్ చార్జింగ్ డిమాండ్‌ను తీర్చడానికి.. అలాగే 2030 నాటికి 30 శాతానికి పైగా ఈవీలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి భారత్‌కు రూ.16,000 కోట్ల మూలధన వ్యయం అవసరమని ఫిక్కీ సోమవారం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ‘ప్రస్తుతం ఈవీ చార్జింగ్ స్టేషన్ల వినియోగం 2 శాతం లోపే ఉంది. దీంతో ఇవి లాభసాటిగా లేవు. ఇవి లాభాల్లోకి రావడానికి, మరింత విస్తరణ చెందేందుకు 2030 నాటికి వీటి వినియోగాన్ని 8–10 శాతానికి చేర్చే లక్ష్యంతో పనిచేయాలి. ఇంధన వినియోగంతో సంబంధం లేకుండా స్థిర ఛార్జీలతో విద్యుత్ టారిఫ్ ఉండడం, అలాగే పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో తక్కువ వినియోగం కారణంగా బ్రేక్ ఈవె న్ సాధించడం సవాలుగా మారింది. యూపీ, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాలు సున్నా లేదా తక్కు వ స్థిర సుంకాలను కలిగి ఉన్నాయి. అయితే స్థిర సుంకాలు ఎక్కువగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మనుగడ సవాలుగా మారింది’ అని నివేదిక తెలిపింది. అనుమతి అవసరం లేని.. స్వచ్ఛ ఇంధనం, సుస్థిరత వైపు భారత పరివర్తనను ప్రారంభించడానికి విధాన రూపకర్తలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలతో సహా కీలక వాటాదారులు రంగంలోకి దిగాలి. పబ్లిక్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచడానికి పరిమిత ఆర్థిక సాధ్యత, డిస్కమ్ లేదా విద్యుత్ సంబంధిత సమస్యలు, భూమి సమస్యలు, కార్యాచరణ సవాళ్లు, ప్రామాణీకరణ మరియు ఇంటర్–ఆపరేబిలిటీ వంటి కీలక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈవీ వ్యవస్థ అంతటా పన్నుకు అనుగుణంగా చార్జింగ్ సేవలకు జీఎస్టీ రేట్లను 18 నుండి 5 శాతానికి ప్రామాణీకరించాలి. అన్ని రాష్ట్రాలలో స్థిర ధరలతో రెండు–భాగాల టారిఫ్ నుండి సింగిల్–పార్ట్ టారిఫ్‌కు మార్చాలి. ఎలక్ట్రిక్ త్రీవీలర్ కొనుగోలు కోసం ఎటువంటి అనుమతి అవసరం లేని విధానాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. అలాగే సీఎన్జీ త్రీ–వీలర్ నుండి ఎలక్ట్రిక్‌కు మారడానికి అదే అనుమతిని ఉపయోగించేలా వెసులుబాటు ఇవ్వాలి’ అని నివేదిక పేర్కొంది. టాప్–40 నగరాల్లో..చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్‌మ్యాప్ అమలును ప్రారంభించడానికి, పర్యవేక్షించడానికి పరిశ్రమల వాటాదారులు, రాష్ట్ర, కేంద్ర అధికారుల ప్రాతినిధ్యంతో రాష్ట్ర–స్థాయి సెల్‌ను ఏర్పాటు చేయాలి. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను సకాలంలో స్థాపించేందుకు రాష్ట్ర డిస్కమ్‌ల కోసం ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల యొక్క సంస్థాపన, నిర్వహణకై విద్యుత్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉండాలి. 2015 నుండి 2023–24 వరకు ఈవీ విక్రయాల ఆధారంగా విశ్లేషించిన 700లకుపైగా నగరాలు, పట్టణాల్లోని టాప్–40, అలాగే 20 హైవేల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత ఈవీ స్వీకరణ రేటు, అనుకూల రాష్ట్ర విధానాలను బట్టి ఈ ప్రధాన 40 నగరాలు, పట్టణాలు రాబోయే 3–5 సంవత్సరాలలో అధిక ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని కలిగి ఉంటాయని అంచనా. ఈ 20 హైవేలు 40 ప్రాధాన్యత నగరాలను కలుపుతున్నాయి. మొత్తం వాహనాల్లో ఈ నగరాల వాటా 50 శాతం’ అని నివేదిక వివరించింది. -
పంచభూత స్థలాలు వాటి ప్రాముఖ్యత
భారతీయ దేవాలయాలు ప్రార్థన కోసం ఏర్పరచబడిన ప్రదేశాలు కావు. ఎప్పుడూ ఎవరూ అక్కడ ప్రార్థన చేయించరు. ఈ సంప్రదాయంలో మీకు ఎప్పుడూ చెప్పేదేమిటంటే మీరు ఒక దేవాలయానికి వెళ్తే అక్కడ మీరు కొంచెం సేపు కూర్చోవాలి. ఎందుకంటే ఈ దేవాలయాలు శక్తి కేంద్రాలు. ఇవి పబ్లిక్ చార్జింగ్ ప్రదేశాల లాంటివి. ప్రతీరోజూ ఉదయాన్నే స్నానం చేసి, దేవాలయానికి వెళ్లి కూర్చుని ఆ శక్తిని పొంది మిమ్మల్ని మీరు శక్తివంతులను చేసుకోవాలని, ఆ తరువాతే ఈ ప్రపంచంలోకి సరైన ప్రకంపనలతో వెళ్ళాలని చెప్పేవారు. లింగాన్ని సృష్టించే శాస్త్రాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇది కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిలో ఉంది. కానీ గత 800-900 సంవత్సరాలుగా భక్తి ఉద్యమం దేశమంతా వ్యాపించిన తరువాత ఈ శాస్త్రం కనుమరుగైపోయింది. ఒక భక్తునికి అతని భావోద్వేగం తప్ప మరేదీ ముఖ్యం కాదు. అతని భావోద్వేగమే అతని మార్గం. ఒక భక్తుడు అతను కోరుకున్నది చేయవచ్చు. ఎందుకంటే అది తన భావోద్వేగపు బలము. అందువల్ల వారు శాస్త్రాన్ని పక్కన పెట్టి, వారికి నచ్చిన విధంగా దేవాలయాలను కట్టడం మొదలుపెట్టారు. అందువల్ల లింగాలను తయారుచేసే శాస్త్రం మరుగున పడిపోయింది. సాధారణంగా, శాస్త్రీయ ఆధారం కలిగిన లింగాలు ముక్తిని ఒక శాస్త్రీయ ప్రక్రియగా పరిగణించిన సిద్ధులు, యోగులచే సృష్టించబడినవే. అవి నిరంతర ప్రకంపనలు. సాధారణంగా అవి ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం, నిర్దిష్ట గుణాలతో మంత్రాలను ఉపయోగించి ప్రతిష్టించబడ్డాయి. దక్షిణ భారతదేశంలో పంచ భూతాల కోసమై అయిదు లింగాలు ఉన్నాయి. మీ భౌతిక శరీరం భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాలతో నిర్మించబడినదే. మీరు అనుభవించే ప్రతీదానిపై వాటికి గట్టి పట్టు ఉంటుంది. వీటిని దాటి పోవడానికి యోగాలో ఉన్న మౌలికమైన సాధనే భూతశుద్ధి. ప్రతీ ధాతువుకి, దాని నుండి విముక్తులవడానికి మీరు చేయగలిగే ఒక ప్రత్యేకమైన సాధన ఉంది. దీని కోసమే పంచభూత స్థలాలను సృష్టించారు. మీరు వెళ్లి సాధన చేసుకోవడానికి మహోన్నత దేవాలయాలు నిర్మించారు. భౌగోళికంగా అవన్నీ డెక్కన్ ప్రాంతంలోనే - నాలుగు తమిళనాడులో, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. నీటికి సంబంధించిన దేవాలయం తిరువనైకావల్‌లో, అగ్నికి సంబంధించిన దేవాలయం తిరువన్నామలైలో, వాయువుకి సంబంధించిన దేవాలయం కాళహస్తిలో, భూమికి సంబంధించిన దేవాలయం కాంచీపురంలో, ఆకాశానికి సంబంధించిన దేవాలయం చిదంబరంలో ఉన్నాయి. మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఈ అయిదు లింగాలు సాధన కోసం సృష్టించబడినవి, ప్రార్థన కోసం కాదు. జనాలు ఒక దేవాలయం నుంచి మరొక దేవాలయానికి ఈ పంచ భూతాల సాధన కోసం వెళ్ళేవారు. దురదృష్టవశాత్తూ, ఈ సంబంధం ఈనాడు లేదు. ఎందుకంటే ఈ సాధనకు కావలిసిన వాతావరణం తొలిగించేయబడింది. దీనికి కావలసిన అవగాహనా, నైపుణ్యం సాధారణంగా కనుమరుగైపోయాయి, కానీ దేవాలయా లు ఇంకా ఉన్నాయి. కొన్ని ఆలయాలు ఆ గుణాన్నీ, శక్తినీ నిలబెట్టుకున్నాయి, మిగతా ఆలయాలు బలహీనమైపోయాయి. ప్రేమాశీస్సులతో, సద్గురు జగ్గీ వాసుదేవ్ www.sadhguru.org - సద్గురు