breaking news
protection wall
-
రూ.118.64 కోట్లతో కృష్ణానదికి రక్షణగోడ
సాక్షి, అమరావతి: కృష్ణానదికి విజయవాడలో పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రూ.118.64 కోట్లతో రక్షణగోడ నిర్మాణానికి ప్రభుత్వం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని షరతు విధించింది. టెండర్ షెడ్యూలు దాఖలుకు నవంబర్ 10వ తేదీని గడువుగా నిర్ణయించింది. నవంబర్ 15న ఆర్థిక బిడ్‌ను తెరిచి.. అదేరోజున రివర్స్ టెండరింగ్ నిర్వహించి, కనిష్ట ధరకు పనులు చేయడానికి ఆసక్తిచూపిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తుంది. చదవండి: టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు.. ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు ఈ గోడ నిర్మాణం పూర్తయితే కృష్ణానదికి గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా.. విజయవాడలోని లోతట్టు ప్రాంతాల్లోకి చుక్కనీరు కూడా చేరదు. కృష్ణానదికి కేవలం మూడులక్షల క్యూసెక్కుల వరద వస్తే చాలు.. విజయవాడలో కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. కృష్ణానదికి వరదలు వచ్చాయంటే లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. రక్షణగోడలు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీలివ్వడం, తర్వాత వాటిని బుట్టదాఖలు చేయడం రివాజుగా మారిపోయింది. కానీ.. 2004 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీ మేరకు యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు కృష్ణానదికి 2.28 కిలోమీటర్ల పొడవున రక్షణగోడలు నిర్మించారు. మహానేత హఠాన్మరణం తర్వాత మిగిలిన లోతట్టు ప్రాంతాలకు రక్షణగోడ నిరి్మంచడంపై ఆ తర్వాతి ప్రభుత్వాలు దృష్టిపెట్టలేదు. రక్షణగోడ రెండోదశ.. రికార్డు సమయంలో పూర్తి పాదయాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కోటినగర్ నుంచి తారకరామనగర్ వరకు 1.56 కిలోమీటర్ల పొడవున రక్షణగోడ నిర్మాణ పనులను రూ.125 కోట్లతో 2021 మే 31న ప్రారంభించి రికార్డు సమయంలో పూర్తిచేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినా లోతట్టు ప్రాంతాలకు వరద చేరకుండా పటిష్టంగా రక్షణగోడ నిర్మించారు. దీంతో కృష్ణానదికి ఇటీవల సుమారు ఆరులక్షల క్యూసెక్కుల వరద వచి్చనా విజయవాడలో లోతట్టు ప్రాంతాల్లోకి చుక్కనీరు కూడా చేరలేదు. ముంపు ఇబ్బందులు ఉండవు విజయవాడలో కృష్ణానది పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించేందుకు పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు రక్షణగోడ నిర్మించే పనులకు సీఎం వైఎస్ జగన్ రూ.135 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులకు రూ.118.64 కోట్లతో ఓపెన్ విధానంలో జలవనరుల శాఖ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ పనులు పూర్తయితే ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు గరిష్టంగా 12 లక్షల క్యూసెక్కుల వరదను విడుదల చేసినా.. విజయవాడలోని లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ప్రజలకు ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి చెప్పారు. -
యాదాద్రి ఆలయం రక్షణ గోడ నుంచి వాటర్ లీకేజ్
-
రూ.18 లక్షలతో సత్యదేవుడి కొండకు రక్షణ గోడ
అన్నవరం : రత్నగిరి దిగువన తొలిపావంచా పక్కనే ఉన్న గార్డె¯ŒS వద్ద నుంచి దేవస్థానం క్వార్టర్స్ వరకూ మెయి¯ŒSరోడ్‌ను ఆనుకుని ఉన్న కొండకు రక్షణ గోడ నిర్మించే పనులను దేవస్థానం చైర్మ¯ŒS రాజా, ఐవీ రోహిత్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. రూ.18 లక్షల వ్యయంతో ఈ గోడ నిర్మిస్తున్నారు. గతంలో ఈ కొండను పలువురు ఆక్రమించి ఇళ్లు నిర్మించారు. అలాగే వ్యాపారులు కూడా ఈ స్థలంలో పలు వ్యాపారాలు నిర్వహించేవారు. 2013లో అన్నవరం మెయి¯ŒSరోడ్ విస్తరణ పనుల్లో భాగంగా ఈ ఆక్రమణలు తొలగించారు. ఆ తరువాత దేవస్థానం స్ధలం ముందు స్తంభాలు పాతి కంచె నిర్మించారు. అయితే కంచె దాటి లోపల వ్యాపారులు హోర్డింగ్స్ వంటివి ఏర్పాటు చేయడం, ఆ కంచె కూడా బలహీనంగా ఉండడంతో కంచె తొలగించి రక్షణ గోడ నిర్మాణానికి ఈఓ కె.నాగేశ్వరరావు నిర్ణయించారని దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజు తెలిపారు. ఆ రక్షణ గోడ కూడా ఇటుకలు సిమెంట్‌తో కాకుండా కొత్త పద్ధతిలో నిర్మిస్తున్నామని ఆయన వివరించారు. ఇందులో వాడే సిమ్మెంట్ స్తంభాలకు ఇరువైపులా లోతుగా ఉంటుంది. ‡ ముందుగా గోతులు తవ్వి ఆ గోతులలో సిమ్మెంట్ స్తంభాలను పాతి కాంక్రీట్ వేస్తారు. అనంతరం స్తంభాల మధ్యలో సిమ్మెంట్ కాంక్రీట్ దిమ్మలు గోడ మాదిరిగా అతికించి దానిపై ప్లాస్టింగ్ చేసేస్తారు. భవిష్యత్‌లో ఈ రక్షణగోడ తొలగించాలనుకున్నా సిమ్మెంట్ స్తంభాలు, వాటి మధ్యలోని కాంక్రీట్ దిమ్మలను సులువుగా తొలగించి మరోచోట వాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. దేవస్థానానికి పెట్రోల్ బంక్ వద్ద గల గార్డె¯ŒSకు కూడా ఇదే విదంగా రక్షణ గోడ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ గోడ నిర్మాణానికి రూ.21.5 లక్షల అంచనా వ్యయంతో టెండర్ పిలవగా రూ.18 లక్షలకు తక్కువ టెండర్ ఖరారైందన్నారు. దేవస్థానం డీఈ వి.రామకృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.