breaking news
project presentation
-
దత్తాత్రేయతో ఎంపీ కవిత భేటీ
హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతో నిజామాబాద్ ఎంపీ కవిత ఆదివారం భేటీయ్యారు. దిల్కుష్ గెస్ట్ హౌస్‌లో కేంద్రమంత్రిని కలసి బీడీ కట్టలపై పుర్రె గుర్తు సైజు తగ్గించే విషయంపై చర్చించారు. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె గుర్తు ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉప సంహరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కనీసం 50 శాతానికి తగ్గించే విధంగా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో పాటు ప్రధాని మోదీతో మాట్లాడి నిబంధనలు సడలించేందుకు ప్రయత్నిస్తానని దత్తాత్రేయ కవితకు తెలిపారు. -
'ప్రతిపక్షాల ప్రజెంటేషన్‌కు ఎందుకంత భయం'
హైదరాబాద్: ఇరిగేషన్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా వాస్తవమే అయితే...ప్రతిపక్షాల ప్రజెంటేషన్‌కు ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేనాటికి 96 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయన్న విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు. ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో లక్షా 50 వేల కోట్ల నిధులు దుర్వినియోగం చేసే కుట్రలో భాగస్వామి కాకూడదనే కేసీఆర్ ప్రజెంటేషన్‌కు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉందని భట్టి చెప్పారు.