breaking news
Prime Minister Fernando javelina
-
ఎల్‌నినోకు 72 మంది బలి
-
ఎల్‌నినోకు 72 మంది బలి
పెరూలో ఎమర్జెన్సీ లిమా: పెరూలో కురుస్తున్న భారీ వర్షాలకు 72 మంది మృత్యువాత పడినట్లు ఆ దేశ ప్రధాని ఫెర్నాండో జవాల ప్రకటించారు. ఎల్‌నినో ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాలు మరో రెండువారాలు కొనసాగుతాయని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వరద తాకిడితో దేశంలోని 811 నగరాలు ఎమర్జెన్సీని ప్రకటించాయి.జల దిగ్బధంతో రాజధాని లీమాకు గత వారంరోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. 1998లో ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావంతో తుఫాన్లు ఏర్పడి దేశంలో 374 మంది చనిపోయారని, ప్రస్తుతం అలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. వరద వల్ల దేశంలో నిత్యావసరాల ధరలు 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వం అంగీకరించింది.