breaking news
Presidents Award
-
మగువల మనసు దోచే ‘జమదానీ’
చేయి తిరిగిన చేనేత కార్మికులు వారు.. వస్త్ర రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. వారు తయారు చేసే వ్రస్తాలు చిరకాలం గుర్తుండిపోతాయి. వివాహ, శుభకార్యాల్లో జమదానీ చీరను ధరించడానికి మగువలు విశేష ఆదరణ కనబరుస్తారు. చేనేత వ్రస్తాల తయారీలో జమదానీ చీరలకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప కళ ఈనాటిది కాదు..శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. మొఘలు సామ్రాజ్య రాణులు, బ్రిటీష్ పాలకుల సతీమణిలు ధరించిన చీర ఇది. 5 దశబ్దాల క్రితమే రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకున్న చరిత్ర ఈ చీరకు ఉంది. ఈ చీరను పురాతన సాంస్కృతి సంపదగా యునెస్కో కూడా గుర్తించింది. దేశ, విదేశాల్లో కూడా జమదానీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో వందలాది మంది నేతన్నలు ఈ చీరలను తయారీ చేస్తున్నారు. ఈ జమదానీ చీరల తయారీలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చేనేత కార్మికులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రత్యేకమైన ఆకర్షణలు, డిజైన్లతో మగువల మనసు దోచే జమదానీ చీరలు తయారు చేస్తుంటారు. కొత్త అందాలను తెచ్చే ఈ చీరలు వివాహాది శుభకార్యాల్లో తలుక్కుమంటుంటాయి. మన నేత కార్మికుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురం, ఉప్పాడ, తూర్పుగోదావరి జిల్లాలో దొండపూడి వంటి ప్రాంతాల్లో కూడా జమదానీ చీరలు తయారు చేస్తున్నారు. – సాక్షి, అనకాపల్లిపేటకు పట్టం కట్టిన కోక.. అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేటతో పాటు, కాకినాడ జిల్లా పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో తయారయ్యే ఈ జమదానీ చీరలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. జమదానీ చీరల డిజైన్లతో కేంద్రం కూడా విడుదల చేసిందంటే ఈ చీరలకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట,నక్కపల్లి మండలంలో గోడిచర్లతో పాటు జిల్లావ్యాప్తంగా 1500 మంది వరకూ ఈ చేనేత కార్మికులు ఉన్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, ఉప్పాడలో 100 కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ద్వారపూడి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 300 కుటుంబాలు నేతన్నలు ఆర్డర్లు వారీగా ఈ చీరలు నేస్తుంటారు. స్థానికంగా విక్రయించేందుకు నేత చీరలు, పంచెలు, తువాళ్లు, తక్కువ ధరలకు విక్రయించే చీరలు తయారు వేస్తూ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తుంటారు. పాయకరావుపేట, తుని పట్టణాల్లో ఉన్న వస్త్ర దుకాణాలకు తాము తయారు చేసిన వస్త్రాలను సరఫరా చేస్తుంటారు.బెంగుళూర్లో నూలు కొనుగోలు.. జమదానీ చీరలు తయారు చేయడానికి ముడిసరుకు (నూలు) బెంగళూరు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో కొంతమంది మాత్రమే ఈ చీరలను తయారు చేస్తున్నారు. పాయకరావుపేటకి చెందిన వ్యాపారి ముడిసరుకు కొనుగోలు చేసి తీసుకువచ్చి తనకు వచ్చిన ఆర్డర్ల మేరకు కొనుగోలుదారులు కోరిన, సూచించిన డిజైన్లు, మోడళ్లు ఆధారంగా ఇక్కడి కార్మికులతో జమదాని చీరలను తయారుచేయిస్తారు... ఒక్కో చీరకు ముగ్గురు కార్మికులు సాధారణంగా జమదానీ చీర తయారీలో ఒక్కో చీరను ముగ్గురు కార్మికుల అవసరం ఉంటుంది. చీర డిజైన్‌ను బట్టి తయారీకి అదనపు సమయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చీర తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. అదనపు డిజైన్లు కూడా యాడ్ చేయాలంటే మరో మూడు నాలుగు రోజులు అదనంగా పడుతుంది. ఉదాహరణకు పాయకరావుపేటలో ఉండే 500కు పైగా నేతన్నలు జమదానీ చీరలు నేస్తారు. ముడిసరుకు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో ఇక్కడి కార్మికులు కేవలం మజూరీ కోసమే పనిచేయాల్సి వస్తుంది. బెంగళూరు వెళ్లి ముడిసరుకు కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడం చాలా కష్టతరం కావడంతో కాంట్రాక్టరు ఇచి్చన మజూరీ తీసుకుని తమ వస్త్ర నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జాందాని చీరల తయారీలో పట్టును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రకం చీరల తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా లూజు అనేది రాకూడదు. అడ్డు నిలువు పట్టును ఉపయోగించాలి. దీంతో ఒక్కో చీర తయారీలో ముగ్గురు కార్మికుల అవసరం కూడా ఉంటుందని నేత కార్మికులు అంటున్నారు.ఆరు మెట్రోపాలిటన్ సిటీల నుంచి ఆర్డర్లు..ఇక్కడ తయారు చేయించిన జమదానీ చీరలను హైదరాబాద్, బెంగళూరు. చెన్నై, విశాఖపట్నం, ముంబై, కోల్‌కత వంటి మహానగరాల్లో ఉన్న పెద్ద వస్త్ర దుకాణాలకు విక్రయిస్తుంటారు. ముందుగానే ఆర్డర్లు ఇచ్చి జమదానీ చీరలు తయారు చేయస్తుంటారు. ఒక జమదానీ చీర తయారీకి డిజైన్ బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల విలువ గల నూలు అవసరమవుతుంది. ఇద్దరు నేత కార్మికులు 15 రోజుల పాటు కప్పపడితే ఒక జమదాని చీర తయారవుతుంది. ఇలా నెలకు రెండు నుంచి మూడు చీరలు తయారు చేస్తారు. ఇక్కడ తయారయ్యే జమదానీ చీరల ఖరీదు కనిష్టంగా రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంటుంది. ఇంటి వద్దే ఉంటూ నెలకు రెండు చీరలు తయారు చేస్తే మజారి కింద రూ.10 వేలు చెల్లిస్తారు. జమదానీ చీరలు తయారు చేయించి విక్రయించే వ్యక్తికి నూలు, మజారి ఖర్చు పోను చీర దగ్గర రూ.3 నుంచి రూ.5 వేలు మిగులుతుంది. ఇతని దగ్గర రూ.10వేలు పెట్టి కొనుగోలు చేసిన చీరను పెద్ద పెద్ద మాల్స్, షాపుల్లోను 504 శాతం లాభం వేసుకుని. రూ.15 వేలకు విక్రయిస్తుంటారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.గత ఐదేళ్లలో చేనేత రంగానికి స్వర్ణయుగం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నేతన్నలకు పెట్టుబడి సాయం అందించారు. మగ్గం కలిగిన కుటుంబాలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. దీంతో కార్మికులు నేరుగా ముడిసరకు తామే కొనుగోలు చేసుకుని వ్రస్తాలు తయారు చేసి లాభాలు పొందేవారు. పెట్టుబడికి అప్పు చేసే పరిస్థితి లేక పోవడంతో గత ఐదేళ్లు చేనేత రంగానికి స్వర్ణయుగంగానే గడిచినా..ఇప్పుడు గడ్డుకాలమే.వివాహ, శుభకార్యాల్లో జమదానీ కోక..వివాహ, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఆర్డర్లు పెట్టుకుంటారు. ఆర్డర్లు ఆధారంగా జమదానీ చీరలు తయారు చేస్తాం. పాయకరావుపేటలో చేయి తిరిగిన నేత కార్మికులు ఉన్నారు.పలు డిజైన్లతో పట్టు. జమదానీ చీరలు తయారీ చేయడంలో వీరు దిట్ట. ముడి సరుకు సొంతంగా కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో మజూరు కోసం వ్రస్తాలు తయారు చేస్తుంటారు. మార్కెటింగ్ సదుపాయం పెంచి..కాంట్రాక్టర్లు ఆర్డర్లు పెంచితే చీరలు తయారీ పెరుగుతుంది. హైదరాబాద్, బెంగుళూర్, ముంబై, కోల్‌కత, చైన్నై వంటి సిటీలకు ఎగుమతి చేస్తుంటాం. – వీరనాగేశ్వరరావు, చేనేత సొసైటీ మేనేజర్ -
దివ్యమైన ప్రతిభ
సత్యభామ.. శ్రీ కృష్ణుడు.. వేంకటేశ్వరుడు.. పద్మావతి.. దివ్యమైన పాత్రలన్నింటినీ ఆమె ఆహార్యంతో అందంగా రూపుకడుతుంది.వైకల్యం ఆమె అభిలాషను అడ్డుకోలేకపో యింది. అడుగు కదపలేదు అనుకున్నవారి అంచనాలను ఆవలకు నెట్టి పట్టుదలతో అవరోధాల మెట్లను అధిరోహించింది. రంగస్థల నటిగా గుర్తింపుతో పాటు స్వరమాధురిగానూ పేరొందింది. కళారంగంలో రాణిస్తూనే దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సేవా పెన్నిధిగానూ ప్రశంసలు అందుకుంటోంది.ఆమెప్రతిభకు గుర్తింపుగా మూడుసార్లు రాష్ట్రపతి పురస్కారం వరించింది.ఖమ్మం జిల్లావాసి అయిన డాక్టర్ పొట్టబత్తిని పద్మావతి కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. హైదరాబాద్‌లోని తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని మునుగనూరులో ఉంటున్నారు డాక్టర్ పద్మావతి. ఆమెకు ఏడాది వయస్సులో పో లియో సోకడంతో రెండు కాళ్ళు చచ్చుబడి పో యాయి. తన పరిస్థితిని చూసి కుటుంబ సభ్యులు ఆమె భవిష్యత్తుపై ఆందోళనకు గురయ్యేవారు. అయితే పద్మావతి ఐదేళ్ల వయస్సులో సెయింట్ మేరీస్ పో లియో పునరావాసం పర్యవేక్షకురాలు ఆస్ట్రేలియాకు చెందిన క్లారా హీటన్ కు పరిచయం అయ్యారు. క్లారా దత్తత తీసుకోవడంతో పద్మావతి జీవితం కొత్త మలుపు తిరిగింది. క్లారా పర్యవేక్షణలో పద్మావతికి పలు మార్లు శస్త్ర చికిత్స జరిగింది. పాదాలు, నడుము.. భాగాలు శస్త్ర చికిత్సతో సరి చేశారు. అప్పటి వరకు మంచానికే పరిమితమైన ఆమె క్యాలిపర్సు, కర్రలు సహాయంతో క్రమంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది. కాలు కదల్చలేని స్థితిలో మంచం మీద ఉండి చదువులో ప్రతిభ కనబరుస్తూ ఎదిగిన తీరు పద్మావతి మాటల్లో మన కళ్ల ముందు కదలాడుతుంది. సేవాభిలాష గానం, నాటక రంగంలో ఉన్న ఆసక్తితో పద్మావతి క్యాలిపర్సు సహాయంతోనే ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. సత్యభామ, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరుడు తదితర పాత్రలను సమర్ధంగా పో షించి దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో అవార్డులను పొందారు. వేగేశ్న ఫౌండేషన్ ద్వారా సంగీతంలో శిక్షణపొందడంతో పాటు, డిగ్రీ పూర్తి చేసి, ఆ సంస్థలోనే సంగీత ఉపాధ్యాయురాలుగా దివ్యాంగులకు శిక్షణ ఇస్తున్నారు. దివ్యాంగులకు సాయపడాలనే సంకల్పంతో మునుగనూరులో పద్మావతి ఇ న్ స్టిట్యూట్ ఫర్ ద (డిజ్) ఏబుల్డ్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా దివ్యాంగులకు కంప్యూటర్, నృత్యం, సంగీతం, టైలరింగ్.. వంటి వృత్తి విద్యా కోర్స్‌లలో శిక్షణ ఇప్పించి, ఉపాధి కల్పిస్తున్నారు. ప్రశంసలు.. పురస్కారాలు పద్మావతి ప్రతిభకు ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి. మూడుసార్లు రాష్ట్రపతి అవార్డులు అందుకున్నారు. ఓ వైపు కళలు, మరోవైపు సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సెన్సార్ బోర్డు సభ్యురాలుగా, నంది అవార్డు జ్యూరీ కమిటీ మెంబర్‌గా సేవలందించిన పద్మావతి 2017లో రాష్ట్ర ప్రభుత్వం రోల్ మోడల్ అవార్డును అందుకున్నారు.. కళాకారిణిగా ప్రతిభ చూపినందుకు 2009లో రాష్ట్రపతి అవార్డు లభించింది. వైకల్యంతో బాధపడుతున్నా పలు రంగాలలో రాణించినందుకు గాను 2011లో రాష్ట్రపతి చేతులు మీదుగా స్త్రీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు ఆమె. దివ్యాంగులకు చేస్తున్న సేవను గుర్తించి 2022లో రాష్ట్రపతి సర్వశ్రేష్ట దివ్యాంగ న్ అవార్డుతో సత్కరించారు. దివ్యాంగులకు సేవచేయాలనే సదాశయంతో నడుపుతున్న ఇన్స్టిట్యూట్కు చేయూతనందిస్తే మరిన్నో ప్రయోజన కరమైన పనులను చేయగలననే ఆశాభావాన్ని పద్మావతి వ్యక్తపరుస్తు న్నారు. తన గమనమే ప్రశ్నార్ధకం అవుతుందనుకున్నవారి మాటలను పక్కనపెట్టి, పట్టదలతో ప్రయత్నించి, గెలుస్తున్న ఆమె జీవితం ఎందరికో ఆదర్శమవుతుంది. – శ్రీరాం యాదయ్య, హయత్‌నగర్, హైదరాబాద్, సాక్షి -
అనకాపల్లి వాసికి రాష్ట్రపతి అవార్డు
జైల్ వార్డర్‌గా ఉండగా చేసిన సేవలకు గుర్తింపు 26న హైదరాబాద్‌లో ప్రదానం అనకాపల్లి, న్యూస్‌లైన్ : విధుల్లో ఉండగా ఖైదీల సంక్షేమానికి, వారి మానసిక పరివర్తనకు కృషి చేసిన అనకాపల్లి వాస్తవ్యుడికి రాష్ట్రపతి అవార్డు దక్కింది. పట్టణానికి చెందిన విశ్రాంత జైల్‌వార్డర్ బల్లా నాగభూషణం ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. విశాఖ కేంద్ర కారాగారంలో పని చేస్తూ గత ఏడాది జూన్ 30వ తేదీన పదవీ విరమణ పొందిన బల్లా నాగభూషణం సేవా దృక్పథం ప్రాతిపదికన ఈ అవార్డు దక్కించుకున్నారు. రాష్ర్టంలోని వివిధ జైళ్లలో 30 సంవత్సరాలపాటు పనిచేసిన నాగభూషణం ఖైదీల సం క్షేమానికి, వారిలో మానసిక పరివర్తనకు కృషి చేశారు. ఖైదీల పిల్లల విద్యాభ్యాసానికి తనవంతుగా ఆర్థిక సాయం అందించడంలో ముం దుండేవారు. మరోవైపు సామాజిక సేవలో భాగస్వాములయ్యేవారు. బల్లా నాగభూషణం కు ఇప్పటికే 24 అవార్డులు దక్కాయి. వికలాం గులకు, వృద్ధులకు తన వంతు సేవలు అందించడంలో ఆయన ముందున్నారు. ‘నేరాన్ని ద్వే షించు.. నేరస్థుడిని ప్రేమించు’ అనే సూక్తిని జైలు వార్డెన్‌గా నాగభూషణం ఆచరించి చూపా రు. గణతంత్ర దినోత్సవం రోజున హైదరాబాద్లోరాష్ట్రపతి అవార్డు అందుకోనున్నారు. -
ఆచార్య పేరి సుబ్బరాయన్‌కు రాష్ట్రపతి అవార్డు
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: గ్రేటర్ తిరుపతి రోటరీ క్లబ్ సభ్యుడు, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ పేరి సుబ్బరాయన్‌కు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అవార్డు ప్రకటించినట్లు రోటరీ క్లబ్ గవర్నర్ ప్రత్యేక ప్రతినిధి సోమ్‌ప్రకాష్ తెలి పారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రొఫెసర్ సుబ్బరాయన్ రాజమండ్రి, తిరుపతి, న్యూఢిల్లీలోని అనేక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పనిచేసి విశేష అనుభవం గడిం చారని పేర్కొన్నారు. ఆయన చేసిన పరిశోధనలకు బోస్టన్, లండన్ విశ్వవిద్యాలయాలు ప్రత్యేక ఆహ్వానాలు పంపించాయని తెలి పారు. అవార్డు పొందిన సుబ్బరాయన్‌కు త్వరలోనే తిరుపతిలో సన్మా నం చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో రోటరీ సభ్యులు చంద్రశేఖర్, ద్రవిడ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ అరుణాచలం పాల్గొన్నారు.