breaking news
Poultry sector Agricultural designation
-
ధర ఎగ్సే
సాక్షి, భీమవరం/అమరావతి: పౌల్ట్రీ రంగంలో సరికొత్త రికార్డు నమోదైంది. కోడి గుడ్డు రైతు ధర రూ.5.79కు చేరి పాత రికార్డులను తిరగరాసింది. ఈ ఏడాది ఇదే అత్యధిక రైతు ధర కావడం గమనార్హం. కాగా.. పెరిగిన మేత ధరలతో గుడ్డు ధర పెరిగినా ప్రయోజనం అంతంత మాత్రమేనని పౌల్ట్రీ రైతులు అంటున్నారు. మరోపక్క రిటైల్ మార్కెట్లో గుడ్డు రూ.7కు చేరింది. ఇదే ధర మరికొంత కాలం కొనసాగితే.. నష్టాల నుంచి గట్టెక్కుతామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. 60 శాతం ఉత్తరాదికి ఎగుమతి రాష్ట్రంలో 2 వేలకు పైగా కోళ్లఫారాలు ఉండగా.. వాటిలో ప్రస్తుతం 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. రోజుకు 6 కోట్ల గుడ్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. ప్రస్తుతం సగటున 4.20 కోట్ల నుంచి 4.75 కోట్ల మధ్య గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 40 శాతం స్థానికంగానే వినియోగిస్తుండగా.. మిగిలిన 60 శాతం బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, నాగాలాండ్, మణిపూర్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. శీతల ప్రభావం ఉండే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పౌల్ట్రీకి ముఖ్య సీజన్‌గా భావిస్తారు. ఏటా ఈ సీజన్లో అత్యధిక ధర నమోదవుతుంటుంది. 2017–18 సీజన్లో రూ.5.45 అత్యధిక ధర నమోదైంది. ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీలు విస్తరించడం, ఎగుమతుల్లో ఇతర రాష్ట్రాల పోటీతో సీజన్ కలిసి రాక రైతు ధర రూ.5 దాటడం గగనంగా ఉండేంది. చరిత్రలో ఇదే గరిష్ట ధర ఉత్తరాదిన కోళ్లు ఫ్లూ బారిన పడటంతో ఎగుమతులకు డిమాండ్ ఏర్పడి నాలుగేళ్ల తర్వాత 2022–23 పౌల్ట్రీ సీజన్లో రూ.5.57 గరిష్ట ధర పలికింది. కాగా.. ప్రస్తుత సీజన్ ఆరంభంలో ధరలో ఒడిదొడుకులు ఎదురైనా.. వారం, 10 రోజుల నుంచి ఫామ్ గేట్ వద్ద గుడ్డు ధర అనూహ్యంగా పెరుగుతూ బుధవారం రూ.5.79కి చేరి అల్‌టైమ్ రికార్డు నమోదైంది. కార్తీక మాసం ముగియడం, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో స్థానిక వినియోగం మరింత పెరగనుండటంతో ఫామ్ గేట్ వద్ద ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. నూకలు దొరకట్లేదు పౌల్ట్రీ పరిశ్రమలో విరివిగా ఉపయోగించే నూకలు టన్ను రూ.13 వేల నుంచి ఏకంగా రూ.25 వేలకు చేరింది. నూకలను ఎక్కువగా ఇథనాల్ ఉత్పత్తికి మళ్లిస్తుండటంతో మార్కెట్లో దొరకని పరిస్థితి నెలకొంది. ఫలితంగా నూకలకు బదులు మొక్కజొన్నపైనే రైతులు ఆధారపడాల్సి వస్తోంది. మొక్కజొన్న కూడా టన్ను రూ.17 వేల నుంచి రూ.25 వేలకు పెరిగింది. సోయాబీన్ టన్ను రూ.48 వేల నుంచి రూ.50 వేల మధ్య పలుకుతోంది. ఆయిల్ తీసిన తవుడు (డీవోపీ) టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెరిగింది. పెరిగిన మేత ధరలతో పాటు మందులు, వ్యాక్సిన్ల ధరలు, కార్మికుల జీతాలు పెరగడం పౌల్ట్రీల నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా పెంచేసింది. ఫలితంగా పిల్ల దశ నుంచి గుడ్డు పెట్టే దశ వరకు ఒక్కో కోడికి గతేడాది రూ.300–310 ఖర్చు కాగా.. ప్రస్తుతం రూ.360–370 ఖర్చవుతోంది. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్లో గుడ్డు ధర రూ.7, మారుమూల పల్లెల్లో రూ.7.50 వరకు పలుకుతోంది. సాధారణంగా రైతు ధరకు 40–50 పైసలు అదనంగా చేర్చి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంటారు. -
పౌల్ట్రీకి ప్రాణం
సిద్దిపేట అర్బన్: పౌల్ట్రీరంగంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మెతుకుసీమది రెండోస్థానం. రంగారెడ్డి జిల్లా తర్వాత కోళ్ల ఫారాలు, ఉత్పత్తులు ఎక్కువగా ఉన్న జిల్లా. గడచిన పదేళ్లలో పౌల్ట్రీ జిల్లాలో బాగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి రూ.1,116 కోట్ల వరకు పౌల్ట్రీ వ్యాపారం సాగుతోంది. జిల్లాలో 80 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బాయిలర్ ఫారాలు 2 వేల వరకు ఉన్నాయి. ఇక 70 లక్షల సామర్థ్యం కలిగిన లేయర్ ఫారాలు 70, 5 లక్షల కోళ్ల పెంపకం సామర్థ్యం కలిగిన బ్రీడర్ పౌల్ట్రీ ఫారాలు జిల్లాలోని వివిధ చోట్ల ఉన్నాయి. పౌల్ట్రీరంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. నిర్వహణ ఖర్చులతో కుదేలు ఒకప్పుడు కాసులు కురిపించిన పౌల్ట్రీ రంగం రానురాను సంక్షోభంలో కూరుకుపోయింది. కోళ్ల ఫారాల నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో పాటు విద్యుత్ ఛార్జీలు, తరచూ దాణా ధరల పెరుగుదల వంటివి ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని కొన్నేళ్లుగా పౌల్ట్రీ రంగ ప్రముఖులు, రైతులు, సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఏర్పడ్డాక పౌల్ట్రీ సమాఖ్య ప్రతినిధులంతా మరోమారు సీఎం కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. సానుకూలంగా స్పందించిన కేసీఆర్ పౌల్ట్రీని గట్టెక్కించేందుకు ఈ పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా తన తొలి బడ్జెట్లోనే నిధులు సైతం కేటాయించారు. పౌల్ట్రీరంగం ఎదుర్కొన్న సమస్యలు కోళ్ల దాణాలో వినియోగించే మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, సోయాబీన్, చేపల మిశ్రమం వంటి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. దాణాను ప్రభుత్వరంగ సంస్థల నుంచి కాకుండా మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో వారు కొన్నిసార్లు కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేశారు. దీంతో కోళ్ల ఫారాల రైతులపై అదనపు భారం పడింది. సాధారణంగా కోళ్ల ఫారాలకు విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో విద్యుత్ శాఖ కోళ్ల ఫారాలను మూడో విభాగం కింద చేర్చి యూనిట్‌కు రూ. 6.08 ఛార్జీలు వసూలు చేస్తోంది. మన పొరుగున ఉన్న మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి యూనిట్‌కు రూ. 2 చొప్పునే చెల్లించే వెసులుబాటు కల్పించడంతో పాటు కోళ్ల ఫారాల నిర్మాణానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. ఈ విధంగా మనదగ్గర లేకపోవడంతో నిర్వహణ వ్యయం పౌల్ట్రీ నిర్వాహకులకు భారంగా మారుతోంది. వ్యవసాయ హోదాతో కలిగే లాభాలు ప్రభుత్వం ప్రస్తుతం కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా ఇవ్వడంతో చాలా వరకు కష్టాలు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీతో సులభంగా రుణాలు పొందే వెసులుబాటు కలుగుతుంది. విద్యుత్ ఛార్జీలు కూడా సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం యూనిట్ కరెంటుకు రూ. 6.08 చెల్లిస్తున్న పౌల్ట్రీ రైతులు, ఇక నుంచి రూ.3 చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. పభుత్వ రంగ సంస్థల నుంచే దాణాలో వినియోగించే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే అవకాశంతో పాటు సబ్సిడీలు పొందే వీలుంటుంది. నిర్వహణ భారం తగ్గడం వల్ల ఫారాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దవచ్చు. దీంతో కోళ్ల ఫారాల సమీపంలో నివసించే వారికి అనారోగ్య సమస్యలు, దుర్వాసన వంటి అసౌకర్యాలూ తొలగిపోతాయి. వ్యవసాయ హోదా వల్ల ఔత్సాహికులు ఫారాల ఏర్పాటుకు ముందుకు వచ్చి పౌల్ట్రీ వృద్ధికి దోహదపడడంతో పాటు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కూడా మెరుగవుతుంది. జిల్లా ఇదీ పరిస్థితి జిల్లాలో కోళ్ల పరిశ్రమకు మంచి ఆదరణ ఉండడంతో పాటు రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. సిద్దిపేట, రామాయంపేట, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాలలో ఎక్కువ సంఖ్యలో కోళ్ల ఫారాలు వెలిశాయి. కేవలం బ్రూడర్ కోళ్ల ఫారాలు సిద్దిపేటలో మాత్రమే ఉన్నాయి. మిగితా కొన్ని చోట్ల లేయర్స్ ఫారాలు ఉండగా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బాయిలర్స్ ఫారాలను రైతులు నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాలకూ జిల్లా నుంచి కోళ్లు, గుడ్లు ఎగుమతి చేస్తున్నారు. తెలంగాణ ఇతర జిల్లాలకు సిద్దిపేట నుంచి పిల్లలను తరలిస్తున్నారు. కోళ్ల పరిశ్రమకు వ్యవసాయ హోదా కల్పించడం పట్ల అందులో పని చేసే కూలీలు కూడా తమకు వేతనాలు పెరిగే అవకాశం ఉంది.