breaking news
plunging area
-
ముంపులో 2 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 2 లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని వ్యవసాయశాఖ వర్గాలు అంచనా వేసినట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయి అంచనాలను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ప్రస్తుత వర్షాల వల్ల పంటలకు వచ్చిన ముప్పేమీ లేదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వచ్చే రెండ్రోజుల్లోనూ అన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ సూచనలు పాటించాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. ఈ మేరకు అత్యవసర బులెటిన్ విడుదల చేసింది. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచనలు ఇవీ... ► భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వర్షాధార పంట పొలాల్లోంచి మురుగునీటిని తీసేయాలి. మురుగునీరు పోవడానికి కాలువలు చేసుకోవాలి. ►రెండు రోజుల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున పంటల్లో మందులను పిచికారీ చేయడం వాయిదా వేసుకోవాలి. ►ముంపునకు గురైన వరి పొల్లాల్లో నత్రజని ఎరువులు వేయడం తాత్కాలికంగా ఆపాలి. ►ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు సోకేందుకు అనుకూలమన్నారు. తొలిదశ వ్యాప్తి నివారణకు, మురుగు నీటిని తొలగించి అగ్రిమైసిన్ ప్లాంటోమైసిన్ మందును నిర్ణీత మోతాదులో ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ►వరిలో ఆకుముడత సోకేందుకు అనుకూలత ఉన్నందున.. నివారణకు ఎసిఫేట్ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ మందును నిర్ణీత కొలతలో లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ►పత్తిలో వడల తెగులు సోకడానికి అనుకూల పరిస్థితులు ఉన్నందున తెగులును గమనిస్తే నివారణకు కాపర్ ఆక్సీ–క్లోరైడ్ మందును ఒక లీటర్ నీటికి కలిపి మొక్క మొదలు చుట్టూ నేలను తడపాలి. ►కాయ కుళ్లు తెగులు నివారణకు 10లీటర్ల నీటికి నిర్ణీత మో తాదులో పౌషామైసిన్ లేదా స్ట్రెప్టోసైక్లిన్ మందును కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి. ►ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగుల నివారణకు నిర్ణీత మోతాదులో కార్బెండజిమ్, ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పైరుపై చల్లాలి. ►పత్తిలో గూడు రాలు నివారణకు నిర్ణీత మోతాదులో ప్లానోఫిక్స్ మందును పది లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి. వర్షాలు తగ్గాక పైపాటుగా అదనపు మోతాదుగా ఎకరానికి 35 కిలోల యూరియా, 10 కిలోల పోటాష్ వేసుకోవాలి. ఒకవేళ పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో నిర్ణీత మోతాదులో మల్టి–కే మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ►కందిలో పైటోఫ్తారా ఎండు తెగులు నివారణకు నిర్ణీత మోతాదులో కాపర్ ఆక్సీ–క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు నిర్ణీత మోతాదులో కార్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ►వర్షాలు ఆగాక నిర్ణీత మోతాదులో మల్టీ–కే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ►మొక్కజొన్నలో ఎర్వినియ ఎండు తెగులు నివారణకు 100 కిలోల వేప పిండి, 4 కిలోల బ్లీచింగ్ పౌడర్ కలిపి పొలమంతా చల్లుకోవాలి. ► సోయా చిక్కుడు పంటలు సాగు చేసే రైతులు ౖవర్షాలు తగ్గాక నేలలో పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో నిర్ణీత మోతాదులో యూరియా లేదా మల్టీ–కే మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ►సోయాచిక్కుడులో ఆకుమచ్చ తెగులు నివారణకు నిర్ణీత మోతాదులో కార్బెండజిమ్+మాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. -
ప్రాణహిత ముంపుపై 'మహా’సర్వే!
- 'మహా’సీఎం సోదరి ఆందోళన - నేటి నుంచి తుమ్మిడిహెట్టి ముంపు ప్రాంతాల్లో సర్వే హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల సాగునీటి ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్‌లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం వల్ల మహారాష్ట్రలో కలిగే ముంపుపై ఆ రాష్ట్ర నీటి పారుదల అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు తెలంగాణ లెక్కలను పరిగణలోకి తీసుకుంటూ ఎత్తు తగ్గించాలని మహారాష్ట్ర వాదిస్తోంది. వాస్తవ ముంపు అంతకంటే ఎక్కువగా ఉం టుందంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోదరి, ఎమ్మెల్సీ శోభాతాయి ఫడ్నవీస్ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు వాస్తవాలు తేల్చే పనిలో పడ్డట్టు సమాచారం. ఈ మేరకు గురువారం నుంచి సర్వే చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం తుమ్మిడిహె ట్టిలో నిర్మించే బ్యారేజీలో ప్రాణహిత నుంచి 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టు డిజైన్ చేసిన విషయం తెలిసిందే. 150 మీటర్లకు తగ్గించాలంటున్న ‘మహా’ గోదావరి నుంచి 90 రోజుల్లో 160 టీఎంసీలు తీసుకోవాలంటే ప్రతిరోజూ 1.8 టీఎంసీ మేర నీటిని ఎత్తిపోయాల్సి ఉన్న దృష్ట్యా, బ్యారేజీ ఎత్తు 152 మీటర్లకు దిగువన ఉంటే సాధ్యమయ్యేది కాదని తెలంగాణ మొదటి నుంచి చెబుతోంది. బ్యారేజీతో జరిగే ముంపు సైతం 1850 ఎకరాలను మించదని చెబుతున్నా మహారాష్ట్ర మాత్రం ఎత్తును 150 లేదా 151 మీటర్ల వరకు తగ్గించే అంశాలను మరోసారి పరిశీలించాలని కోరుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ జరిపిన చర్చల్లో కూడా ప్రధానంగా ఎత్తు తగ్గిం చాలనే అంశాన్నే మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తింది. దీంతో ప్రాజెక్టు డిజైన్ మార్చి కాళేశ్వరం దిగువన నీటిని మళ్లించేలా కసరత్తు మొదలుపెట్టారు. పాత డిజైన్‌తోనే మేలు..! ప్రాజెక్టుల అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ ప్రాణహితకు పాత డిజైనే మేలని, తుమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి నీటిని మళ్లిస్తే నష్టమేమీ లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి వారం కిందట మహారాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి మాలనీ శంకర్‌తో చర్చలు జరిపారు. 15 మీటర్ల ఎత్తుతో జరిగే ముంపుతో పాటే, ఎత్తును 151 లేదా 150 మీటర్ల వరకు తగ్గిస్తే ముంపు ఏ రీతిన తగ్గుతున్న విషయం వివరించారు. అయితే తెలంగాణ చెబుతున్న లెక్కలను మహారాష్ట్ర ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని, ఈ మేరకు కూడా సర్వే చేస్తామని స్పష్టం చేశారు.