ఇంటింటా సమస్యలు ఏకరువు
అనంతపురం: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమానికి వెళ్తున్న నాయకుల వద్ద ప్రజలు సమస్యలు ఏకరువు పెడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పార్టీ నాయకులు ప్రజలతో మమేకమాయ్యరు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ‘నవరత్నాలు’ పథకాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలోని రాజీవ్‌నగర్, వానవోలు గ్రామంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారయణ పర్యటించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు.
కళ్యాణదుర్గం నియోజకర్గమైన బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ, గుడిపల్లి, గుడమేపల్లి, గుండిగానిపల్లి గ్రామాల్లోనూ కార్యక్రమం నిర్వహించారు. గుడిపల్లి, గడమేపల్లి ›గ్రామాల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఉషశ్రీచరణ్ పాల్గొన్నారు. శింగనమల నియోజకవర్గంలోని శింగనమల మండలం పోతురాజుకాలువ, శివపురం, సలకంచెరువు, నిదనవాడ, నాయనవారిపల్లి గ్రామాల్లో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పర్యటించారు. అలాగే పుట్లూరు మండలం సూరేపల్లి, బాలాపురం, చెర్లోపల్లి, జంగంరెడ్డిపేట, అరకటివేముల గ్రామాల్లోనూ కార్యక్రమం జరిగింది. పార్టీ మండల కన్వీనర్ రాఘవరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.
గుంతకల్లు పట్టణం 1, 10, 15 వార్డుల్లో పర్యటించారు. కౌన్సిలర్ గోపీ, వార్డు కన్వీనర్లు నాగేంద్ర, వెంకటేష్ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా డి.హీరేహాల్ మండలం సోమలాపురం, రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అలాగే మడకశిర నియోజకవర్గం మడకశిర, అగళి, గుడిబండ, అమరాపురం, రొళ్ల మండలాలు, ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ, బెలుగుప్ప, వజ్రకరూరు, కూడేరు మండలాల్లో కార్యక్రమం జరిగింది.