breaking news
peddavadaguru
-
బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఆరుగురి ఆదివారం అరెస్టు చేసినట్లు పామిడి సీఐ నరేంద్రరెడ్డి, ఎస్ఐ రమణారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ రాయుళ్లను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి పెద్దవడుగూరులో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. దీంతో తమ సిబ్బందిని ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసి రంగంలోకి దింపినట్లు వివరించారు. పక్కా సమాచారం మేరకు వలపన్ని ఆరుగురు బెట్టింగ్రాయుళ్లను అత్యంత చాకచక్యంగా పట్టుకోగలిగామన్నారు. వారి నుంచి రూ.1.52 లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
నేనూ సొగసుగత్తెనే..
‘అందం ఒకరి సొంతం కాదు.. అద్దంలో చూసుకుంటే నేను కూడా సొగసుగత్తెనే... మీలో ఎవరైనా కాదంటారా? అయితే పక్కనే ఉన్న నా వాణ్ని అడిగి చూడండి... నన్ను మించిన సౌందర్యం మరెక్కడా లేదని అంటున్నాడు’ అన్నట్లుగా ఉంది కదూ ఈ చిత్రంలోని పిచ్చుకల హావభావాలు! పెద్దవడుగూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనానికి ఉన్న అద్దాల్లో ఈ పిచ్చుకలు గంటల తరబడి చూసుకుంటూ.. అద్దాన్ని ముద్డాడాయి. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు ఔరా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. - పెద్దవడుగూరు (తాడిపత్రి)