21 నుంచి షర్మిల పరామర్శయాత్ర పునఃప్రారంభం
హైదరాబాద్: మహానేత వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువుచాలించిన వారి కుటుంబాలను ఓదార్చే నిమిత్తం వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో మూడో విడత ఈ నెల 21న ప్రారంభం కానున్నది.
21, 22 తేదీల్లో వరంగల్ జిల్లాలో 11 కుటుంబాలను పరామర్శిస్తారని, 22 సాయంత్రం పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలంగాణ వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో షర్మిల పరామర్శయాత్ర మొదటి విడత మంథని నియోజకవర్గం మేడిపల్లి నుంచి ప్రారంభమవుతుందని, మొత్తం 12 కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు.