breaking news
paper mil
-
భారీ అగ్నిప్రమాదం: మంటలను అదుపుచేస్తున్న 20 ఫైరింజన్లు..
గాంధీనగర్: గుజరాత్లో వల్సాద్‌లోని పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్థానికులు పోలీసులు,ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతున్నాయి. 20 ఫైరింజన్లో సహయంతో మంటలను అదుపులోకి తెవడానికి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అగ్నిమాపక అధికారి అంకిత్ లోట్టే తెలిపారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేవు. దీపావళి సందర్బంగా కార్మికులు పూజలో ఉండగా ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. పేపర్ మిల్కు నిన్న.. సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరు రాలేదు. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు లోనయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
వారి జీతాల కోసం చెట్లు అమ్మాలా ?
సాక్షి, బెంగళూరు : ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి శివమొగ్గలోని మైసూర్ పేపర్ మిల్లు పరిధిలోని చెట్లను అమ్మేయాలా అని అటవీ శాఖ అధికారులను సీఎం బి.ఎస్.యడియూరప్ప ప్రశ్నించారు. మిల్లు పరిస్థితిపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో సీఎం శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యడియూరప్ప మాట్లాడుతూ.. 1960లో శరావతి విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే సమయంలో శివమొగ్గలోని 3,500 కుటుంబాలు తమ భూములను కోల్పోయాయన్నారు. వారందరికీ పునరాసంతో పాటు 9,800 ఎకరాల భూమిని ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని కానీ వారికి సరైన సాయం అందలేదని తెలిపారు. ఆ కుటుంబాలకు సహాయం చేయడానికి వెంటనే టైటిల్ డీడ్స్ సిద్ధం చేయాలని శివమిగ్గ జిల్లా పాలన యంత్రాంగాన్ని ఆదేశించినట్లు పేర్కొన్నారు.అదే విధంగా ఈ భూమలుపై సమగ్ర సర్వే చేపట్టాలని తెలిపారు. దీంతో పాటు భూములకు సంబంధించిన పహానీలను పొందేందుకు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని అధికారులకు తెలిపారు. రోడ్లను వేయడానికి సంబంధిత శాఖ వద్ద ఎన్వోసీ పొందే విధంగా చర్యలు చేపట్టాలని టూరిజం శాఖకు వెల్లడించారు. తిర్థల్లి ఎమ్మెల్యే అరగ జ్ఞానేంద్ర మాట్లాడుతూ.... మిల్లు ఉద్యోగులకు మూడు, నాలుగేళ్లుగా జీతాలు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వారికి జీతాలు ఇవ్వడానికి కనిపిస్తున్న ఏకైక మార్గం పేపర్ మిల్లు పరిశ్రమలోని చెట్లను అమ్మడమేనని ఆయన అన్నారు. కాగా పేపర్ తయారీ కోసం 1936లో అప్పటి మైసూర్ రాజు కృష్ణరాజ వడయార్ బహదూర్ భద్రావతి నది ఒడ్డున శివమొగ్గలో దీన్ని స్థాపించారు. అది 1977లో ప్రభుత్వ సంస్థగా మారింది. ఈ మిల్లులో కర్ణాటక ప్రభుత్వానికి 64.7 శాతం వాటా ఉంది. ప్రభుత్వంతోపాటు ఆ ప్రాంత ప్రజలు, ఐడీబీఐ బ్యాంకు, ఎల్ఐసీ కూడా మిల్లులో వాటా దక్కించుకున్నాయి. -
జిల్లాలో పాలనా యంత్రాంగ ఉందా?
- మంత్రి హామీ ఇచ్చి రెండేళ్లవుతున్నా కార్మికులను పట్టించుకునే దిక్కులేదు - శాసనమండలి హామీల కమిటీ అసంతృప్తి కర్నూలు(అగ్రికల్చర్): ‘జిల్లాలో యంత్రాంగం ఉందా..? కార్మిక శాఖ పనిచేస్తుందా? శాసన మండలిలో మంత్రి 2014లోనే కర్నూలు పేపర్‌మిల్ లాకౌట్‌ను ఎత్తివేస్తున్నామని, కార్మికులకు జీతాలు ఇస్తున్నామని ప్రకటించారు. ఇక్కడ చూస్తే పేపర్‌మిల్లు తెరిచే పరిస్థితి లేదు. కార్మికులను పట్టించుకునే దిక్కు లేదు’ అని శాసనమండలి హామీల అమలు కమిటీ (అస్సూరెన్స్) సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు మంత్రులు ఇచ్చిన హామీలు అమలయ్యాయా అనేదానిపై హామీల అమలు కమిటీ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షించింది. శాసన మండలి చైర్మన్ చక్రపాణి యాదవ్, హామీల అమలు కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సభ్యులు చంద్రశేఖర్‌రావు, సుధాకర్‌బాబు తదితరులు సమీక్షించారు. 27 హామీలు ఉండగా కొన్నింటిని మాత్రమే సమీక్షించారు. పేపర్‌మిల్లుపై మంత్రి ఇచ్చిన హామీ గాలికొదిలారా? రాయలసీమ పేపర్‌మిల్లు హామీని సమీక్షించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన వివరాలు ఏమాత్రం సరిపోకపోవడంతో కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి శాసనమండలిలో 2014లోనే లాకౌట్ ఎత్తివేస్తున్నామని, కార్మికులందరికీ వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారని, కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదన్నారు. జిల్లాలో కార్మిక శాఖ ఏమి చేస్తోంటూ ప్రశ్నించారు. కేవలం 120 మందికి మాత్రమే పరిహారం ఇచ్చినట్లు లెక్కలున్నాయని మిగతా కార్మికుల పరిస్థితి ఏమైందని కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌రావు, సుధాకర్ రావు ప్రశ్నించారు. బీడీ కార్మికులందరికీ చంద్రన్న బీమా పథకాన్ని అమలు చేయాలని కమిటీ చైర్మన్ గాలిముద్దుకృష్ణమ నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఎంతమంది బీడీ కార్మికులను గుర్తించారు, వెయ్యి బీడీలు చుడితే ఇస్తున్న మొత్తమెంత? తదితర వివరాలను ఆరా తీశారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ సర్జరీ యూనిట్ ఏర్పాటుపై సంబంధిత మంత్రి శాసనమండలిలో హామీ ఇచ్చారని, దీని అమలు ఎంతవరకు వచ్చిందని కమిటీ చైర్మన్ ప్రశ్నించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరస్వామి మాట్లాడుతూ రూ.7.50 కోట్లతో కొన్ని నెలల క్రితమే కార్డియాలజీ సర్జరీ యూనిట్‌ను ప్రారంభించామని, మూడు నెలల్లో 36 ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసినట్లు వివరించారు. హామీ అమలు పట్ల అస్సూరెన్స్ కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. తుంగభద్రపై రిజర్వాయర్ల నిర్మాణంపై నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఇచ్చిన వివరాల పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 6జిల్లాలకు కర్నూలు నుంచే నీళ్లు రావాల్సి ఉందని, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరునగరి కాల్వలన్నీ కర్నూలు నుంచే మొదలై వివిధ జిల్లాలకు నీటిని ఇస్తున్నాయని తెలిపారు. జిల్లాలో గంజాయి సాగు గురించి శాసనమండలిలో వచ్చిన ప్రశ్నకు సంబంధించి ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను ఆరా తీయగా ఇప్పటివరకు జిల్లాలో 19 గంజాయి కేసులు పెట్టామని, 607 మొక్కలు, 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 25 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు బంగారుపేట నీలిషికారీలకు పునరావాసం కల్పించే దిశగా చర్యలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు సూచించారు. 2014 ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాకపోగా 2015 కరువుకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల కావడం ఏంటని కమిటీ సభ్యుడు చంద్రశేఖర్‌రావు ప్రశ్నించడంతో ఒకటిరెండు రోజుల్లో 2014 కరువుకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ విడుదల కానుందని కలెక్టర్ వివరించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులు, వాటిని అధిగమించిన తీరు తదితరవాటిని జిల్లా కలెక్టర్ సభ్యులకు వివరించారు. పశుగ్రాసం, తాగునీరు, పక్కా ఇళ్ల నిర్మాణానికి ఇంటి స్థలాల ఇవ్వడం తదితర సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. పట్టి సీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణాకు మల్లించడం ద్వారా రాయల సీమలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఇబ్బందులు కలుగ లేదని అన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు 60 టిఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి వచ్చిందని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశారని తెలిపారు. సమావేశంలో డీఆర్వో గంగాధర్‌గౌడు, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రమీల, కార్మిక శాఖ, ఎక్సైజ్, నీటిపారుదల తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.