యాప్‌ను మూసేస్తున్న ఫేస్బుక్
తమ సైట్లో ఉండే ‘పేపర్’ అనే యాప్‌ను మూసేయాలని ఫేస్బుక్ నిర్ణయించుకుంది. రాజకీయాలు, టెక్నాలజీ, ఆహారం.. ఇలాంటి వివిధ రంగాలకు చెందిన సమాచారాన్ని యూజర్లు చూసేందుకు ఈ యాప్ ఉపయోగపడేది. జూలై 29 తర్వాత ఇక ఈ యాప్ పనిచేయదంటూ ఇప్పటికే దాన్ని వినియోగిస్తున్నవాళ్లకు సందేశం వెళ్తోంది. ఫేస్బుక్లో ఉన్న కంటెంట్‌ను మరింత సులభంగా, విస్తృతంగా చదవాలన్న ఉద్దేశంతో పేపర్ యాప్‌ను మొదలుపెట్టామని ఫేస్బుక్ తెలిపింది.
అయితే.. 2014 జనవరిలో లాంచ్ చేసిన ఈ యాప్ టాప్ 1500 డౌన్‌లోడ్స్‌లో కనిపించలేదని యాప్ యానీ అనే పరిశోధక సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్‌లో ఇది అసలు కనిపించలేదని, ఐఓఎస్ వెర్షన్‌ను కూడా చిట్టచివరిసారిగా 2015 మార్చిలో అప్డేట్ చేశారని చెప్పింది. వీక్షకుల నుంచి ఆదరణ పెద్దగా లభించకపోవడంతో ఇక దీన్ని మూసేయడమే నయమని భావించి, అందుకు అనుగుణంగా ఫేస్బుక్ నిర్ణయం తీసుకుంది.