breaking news
Pancreas gland
-
పాంక్రియాటైటిస్ నుంచి కోలుకోవడం సాధ్యమే..
పాంక్రియాటైటిస్ అంటే పాంక్రియాస్ గ్రంథి అనారోగ్యం పాలుకావడం, ఇరిటేషన్‌కు, వాపుకు లోను కావడం అన్నమాట. పాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథి. మనకు చిరపరిచితమైన డయాబెటిస్ వ్యాధి ఈ గ్రంథి పనితీరు లోపించడం వల్లనే వస్తుంది. పాంక్రియాస్ పనితీరు లోపం నుంచి పాంక్రియాటైటిస్‌కు దారి తీయడానికి అనేక కారణాలుంటాయి. వాటిలో ఆల్కహాలు సేవనం మితిమీరడం వల్ల కలిగే గాల్‌స్టోన్స్ ప్రధాన కారణం. అయితే ఇది అప్పటికప్పుడు ఎదురయ్యే అనారోగ్య సూచన కాదు, దీర్ఘకాలికంగా కొనసాగడంతో పాంక్రియాస్ పూర్తిగా దెబ్బతినడం వల్ల ఎదురయ్యే సమస్య. పాంక్రియాటైటిస్... వస్తే ఏమవుతుంది? జీర్ణరసాలలోని ఆమ్లగుణాల కారణంగా పాంక్రియాస్ టిస్యూలు దెబ్బతింటాయి. పాంక్రియాస్ అతి సున్నితమై (ఓవర్ సెన్సిటైజ్), ఎర్రగా మారుతుంది. ఈ స్థితిలోకి మారిన పాంక్రియాస్ ఆమ్ల స్వభావం కలిగిన కణాలను, విషపూరితమైన వ్యర్థాలను విడుదల చేస్తుంది. అవి ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండెకు హాని కలిగిస్తాయి. పాంక్రియాటైటిస్‌లో అక్యూట్, క్రానిక్ దశలుంటాయి. ఎవరెవరికి వస్తుంది? పాంక్రియాటైటిస్ సమస్యను ఎక్కువగా దీర్ఘకాలంగా డయాబెటిస్తో బాధపడుతున్న మగవారిలోనే చూస్తుంటాం. గాల్‌స్టోన్స్ ఉన్న వారికి, మద్యపానం మితిమీరి తీసుకునే వారికి, ధూమపానం చేసేవారికి రిస్క్ ఎక్కువ. అలాగే ఒబేసిటీ, రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ ఉన్న వారికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. పాంక్రియాటైటిస్‌ను గుర్తించడం ఎలా? అక్యూట్ పాంక్రియాటైటిస్ని నిర్ధారించడానికి రక్తపరీక్ష చేస్తారు. ఇందులో జీర్ణక్రియకు దోహదం చేసే అమిలేజ్, లిపేజ్ అనే ఎంజైమ్‌ల స్థాయులను గుర్తిస్తారు. ఈ స్థాయులు ఎక్కువగా ఉంటే అక్యూట్ పాంక్రియాటైటిస్‌గా పరిగణిస్తారు. ∙అల్ట్రా సౌండ్ స్కానింగ్ లేదా కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) ఇమేజ్ ద్వారా పాంక్రియాస్ ఆకారాన్ని, సంభవించిన మార్పులను, గాల్ బ్లాడర్, బైల్ డక్ట్ (పైత్యరస నాళాలు)లను, వాటిలో ఏర్పడిన అపసవ్యతలను గమనిస్తారు. క్రానిక్ పాంక్రియాటైటిస్‌లో... సెక్రెటిన్: పాంక్రియాస్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించే పరీక్ష ►ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ : ఇది పాంక్రియాస్ డ్యామేజ్ అయిందనే సందేహం వచ్చినప్పుడు చేస్తారు. చక్కెర స్థాయులను పాంక్రియాస్ ఎలా నిర్వహిస్తుందో తెలుసుకోవడం కోసం చక్కెర ద్రవం తాగక ముందు ఒకసారి, తాగిన తర్వాత ఒకసారి పరీక్షిస్తారు. స్టూల్ టెస్ట్ : ఆహారం ద్వారా అందిన కొవ్వులను కణాలుగా విభజించడంలో దేహం నిర్వీర్యమవుతున్నట్లు సందేహం కలిగినప్పుడు చేస్తారు. ∙ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ : దీనినే ఎండోసోనోగ్రఫీ అని కూడా అంటారు. ఎండోస్కోప్ పరికరాన్ని గొంతులో నుంచి కడుపు, చిన్న పేవులు, పాంక్రియాస్ వరకు పంపిస్తారు. దానికి అమర్చిన కెమెరా ద్వారా పాంక్రియాస్, ట్యూబులు, లివర్, గాల్ బ్లాడర్, పైత్యరస నాళాలను పరిశీలిస్తారు. ∙ఈఆర్సీపీ (ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజియోపాంక్రియాటోగ్రఫీ) : ఇది కూడా ఎండోస్కోపీలాగానే చేస్తారు. అయితే ఇందులో పరీక్షతోపాటు పాక్షికంగా చికిత్స కూడా జరిగిపోతుంది. ఈ పరీక్షలో పాంక్రియాస్, వాటి ట్యూబుల లోపలి భాగాలను కూడా పరిశీలిస్తారు. పాంక్రియాస్లో కానీ బైల్ డక్ట్‌లో కానీ ఏదైనా అడ్డంకులు కనిపిస్తే వాటిని పరీక్ష సమయంలోనే తొలగిస్తారు. నివారణ ఎలా? ఆరోగ్యకరమైన జీవనవిధానమే ప్రధానం. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, మందులు తీసుకుంటూ ధూమపానం, మద్యపానం మానేస్తే క్లోమం తిరిగి ఆరోగ్యవంతం అవుతుంది. పాంక్రియాస్... ఎక్కడ ఉంటుంది? ఇది పొట్టకు పై భాగంలో చిన్న పేగు మొదలయ్యే చోట ఉంటుంది. ఈ గ్రంథికు అనుసంధానమై ఉండే ట్యూబ్ ద్వారా జీర్ణరసాలు చిన్నపేగులోకి ప్రవహిస్తాయి. ఇది ఏయే పనులు చేస్తుంది? దీని ప్రధాన కర్తవ్యం జీర్ణరసాలను ఉత్పత్తి చేసి విడుదల చేయడం, ఇన్సులిన్ హార్మోన్‌ను విడుదల చేయడం. జీర్ణ రసాలు ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వును వేరు చేసి జీర్ణప్రక్రియ సక్రమంగా జరగడానికి దోహదం చేస్తాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధం చేస్తుంది. దేహానికి శక్తిని విడుదల చేస్తూ కొంత శక్తిని నిల్వ చేసుకుంటుంది. పాంక్రియాటైటిస్ లక్షణాలు ఇలా... పాంక్రియాటైటిస్ రకాన్ని బట్టి (అక్యూట్, క్రానిక్) లక్షణాలు కొద్దిగా మారుతుంటాయి. అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో... ∙పొట్ట పై భాగం (అప్పర్ అబ్డామిన్)లో ఒక మోస్తరు నుంచి తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. ఈ నొప్పి వెన్ను వరకు పాకుతుంది. ∙నొప్పి ఒక్కోసారి అకస్మాత్తుగా వచ్చి తగ్గుతుంది. కొన్నిసార్లు కొద్దిరోజులు కొనసాగుతుంది -
భోజనం తర్వాత షుగర్ తగ్గుతోందేంటి?
డయాబెటిక్ కౌన్సెలింగ్ నా వయసు 73. బరువు 63. పరగడుపున రక్తంలో చక్కెరపాళ్లు 114 నుంచి 131 ఎంజీ/డీఎల్ ఉన్నాయి. అయితే భోజనం తర్వాత చక్కెర పాళ్లు తక్కువగా ఉంటున్నాయి. (అంటే 130 కంటే తక్కువ). మనం తీసుకున్న భోజనాన్ని బట్టి పోస్ట్ లంచ్ విలువలు ఆధారపడి ఉంటాయన్న సంగతి తెలుసు. అయినా నా సందేహం ఏమిటంటే... నా భోజనం తర్వాతి బ్లడ్ షుగర్ విలువలు, ఫాస్టింగ్ కంటే తక్కువగా ఎలా ఉంటున్నాయి? అంటే ఆ చక్కెర నిల్వలు నా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడటం వల్ల భోజనం తర్వాతి విలువలు ఫాస్టింగ్ కంటే తక్కువగా ఉంటున్నాయా? నాకు సలహా ఇవ్వండి. - విశ్వేశ్వరరావు, వరంగల్ సాధారణంగా మన రక్తంలో ఉన్న చక్కెర పాళ్లను అదుపులో పెట్టేందుకు ఎంత అవసరమో గ్రహించి దానికి మ్యాచ్ అయ్యేలా ప్యాంక్రియాస్ గ్రంథి అంత ఇన్సులిన్ని స్రవిస్తుంది. ఒక్కోసారి రక్తంలో ఎంత చక్కెర ఉంది అన్న అంచనా ప్యాంక్రియాస్ గ్రంథికి లేనప్పుడు అది ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. దాంతో రక్తంలోని చక్కెరపాళ్లు గణనీయంగా పడిపోతుంటాయి. సాధారణంగా డయాబెటిస్ వచ్చే ముందు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయి కాబట్టి దీన్ని డయాబెటిస్‌కు ముందు దశగా పరిగణించవచ్చు. డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేసేందుకు లేదా నివారించేందుకు తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తింటూ ఉండండి. ఇక దీనితో పాటు మీ ఆహారంలో పిండిపదార్థాలు తక్కువగా తీసుకోండి. క్రమం తప్పక వ్యాయామం చేయండి. అన్ని రకాల ఒత్తిళ్లకు దూరంగా ఉండండి. బరువును అదుపులో పెట్టుకోండి. ఈ నియమాలన్నీ కేవలం డయాబెటిస్‌కు ముందు దశలో ఉన్నవాళ్లేగాక ఆరోగ్యవంతులూ ఆచరించవచ్చు. నా వయసు 39. నాకు టైప్-2 డయాబెటిస్ ఉంది. నా డయాబెటిస్‌కు కారణమేమిటి అన్న విషయాన్ని తెలుసుకోవడం ఎలా? అంటే నాలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల ఇది వచ్చిందా? లేక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిందా?. నాకు ఇటీవలే డయాబెటిస్ బయటపడింది. దాని తర్వాత వెంటనే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ప్రిస్క్రయిబ్ చేశారు. కారణం తెలియకపోవడం వల్ల నాకు ఇస్తున్న చికిత్స సరైనదా, కాదా అనే సందేహంలో ఉన్నాను. మా కుటుంబ చరిత్రలో డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉన్నారు. దయచేసిన నా సందేహాలను తీర్చండి. - వినోద్, గుంటూరు మీకు టైప్-2 డయాబెటిస్ ఉందని అన్నారు కాబట్టి అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో పాటు తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల కావచ్చు. దీన్ని నిర్ధారణ చేయాలంటే కొన్ని షుగర్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు భోజనం చేసిన రెండు గంటల తర్వాత ‘సి-పెప్టైడ్’ పరీక్ష కూడా చేయించాలి. అప్పుడు మీ రక్తంలో పెరిగిన ఇన్సులిన్, సి-పెప్టైడ్ పాళ్లు తెలుస్తాయి. మీ డాక్టర్‌గారు మీకు ఇన్సులిన్ ప్రిస్క్రయిబ్ చేయడం ద్వారా చేస్తున్న చికిత్స సరైనదే. ఇది బహుశా కొంతకాలం కోసమే కావచ్చు.