జాతీయస్థాయి పోటీల్లో ‘పాంచజన్య’ విద్యార్థుల ప్రతిభ
హిందూపురం టౌన్ : స్థానిక పాంచజన్య పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు పాఠశాల అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. నవంబర్ 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో పాఠశాల విద్యార్థులు నవీన్‌రెడ్డి రెండు బంగారు పతకాలు, సాయిచంద్ర ఒక బంగారు పతకం, ఒక కాంస్య పతకం సాధించారని ఆయన తెలిపారు. వీరు ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఆసియా గేమ్స్‌కు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల కోశాధికారి నందకుమార్, ఏఓ భాస్కర్, హెచ్ఎం గాయిత్రి, ఏహెచ్ఎం విజేయంద్ర, శశికళ, పీఈటీ పద్మజకుమార్ అభినందించారు.