breaking news
Owens
-
Simone Biles: ఒలింపిక్ లెజెండ్ - సింహం మెడలో మేక...
విమర్శలకు చాలా మంది కుంగిపోతుంటారు. ఆమెరికన్ ఆర్టిస్టిక్ జిమ్నాస్ట్ అయిన సిమోన్ అరియన్నే బైల్స్ ఓవెన్స్ మాత్రం విమర్శలనే సవాల్‌గా తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఇటీవల జరిగిన ఆల్‌రౌండ్ ఈవెంట్లో స్వర్ణం సాధించింది. దీంతో తొమ్మిది ఒలింపిక్ పతకాలు, 30 ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు ఆమె ఖాతాలో చేరి, ప్రపంచంలోనే అత్యధిక ఒలింపిక్ పతకాలు సాధించిన ఐదవ మహిళా ఒలింపిక్ జిమ్నాస్ట్‌గా పేరొందిందామె.27 ఏళ్ల సిమోన్ విజయం సాధించిన వెంటనే తన మెడలో మేక లాకెట్టుతో ఉన్న చైన్‌ను బయటకు తీసి అందరికీ చూపించింది. ‘చాలా మంది నన్ను ‘గోట్’ అని పిలుస్తుంటారు. నేను దానిని నెగిటివ్‌గా తీసుకోలేదు. ఈ గోట్లో కూడా ప్రత్యేకత ఉంది, అది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. అందుకే ‘స్టఫ్డ్ గోట్’ను హారంగా మెడలో ధరించాను’ అంటూ గోట్ లాకెట్‌ను చేత్తో పట్టుకొని చూపిస్తూ అంది సిమోన్ బైల్స్.తొమ్మిదవ ఒలింపిక్ పతకాన్ని, ఆరవ స్వర్ణాన్ని సంపాదించినందుకు సిమోన్ ప్రదర్శనలో అభినందనలు దక్కాయి. అయితే, 2021లో జరిగిన టోక్యో గేమ్స్ నుండి చివరి నిమిషంలో వైదొలగడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె చేష్టల కారణంగా మరొక క్రీడాకారిణికి అవకాశం లేకుండా పోయిందని, జాత్యహంకారం, సెక్సిస్ట్, ట్రాన్స్‌ఫోబిక్, డ్రగ్ చీట్... అని ఎంతో మంది చేత నాడు విమర్శలను ఎదుర్కొంది. దీంతో కుటుంబంలో వచ్చిన సమస్యలు, మానసిక సమస్యలతో పోటీల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. అయినా ఆమెపైన విమర్శలు ఆగలేదు. ఆ సందర్భంలో ఆమెను ‘గోట్’ అంటూ హేళన చేశారు. అదే ఆమె ఇప్పుడు తన బలంగా మార్చుకుని, దాంతోనే పతకాన్ని సాధించ గలిగింది. -
ఓవెన్స్ ఒలింపిక్ పతకానికి రూ.9 కోట్లు
లాస్ఏంజిల్స్: అమెరికా అథ్లెటిక్స్ గ్రేట్ జెస్సీ ఓవెన్స్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణ పతకానికి రికార్డు స్థాయిలో ధర పలికింది. కాలిఫోర్నియాలో ఆదివారం జరిగిన వేలంలో 14 లక్షల 66 వేల 574 డాలర్ల (దాదాపు రూ.9 కోట్లు) ధరకు కొనుగోలు చేశారు. ఇంత ధర ఇప్పటిదాకా ఏ ఒలింపిక్ పతకానికీ దక్కకపోవడం విశేషం. దీంతో విశ్వ వ్యాప్తంగా ఓవెన్స్ సాధించిన ఫీట్కున్న ప్రాముఖ్యత ఏమిటో లోకానికి వెల్లడయినట్టయ్యింది. వెయ్యికి పైగా క్రీడా వస్తువులను ఈ వేలంలో ఉంచారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జాత్యహంకారానికి చెంపపెట్టుగా... నల్ల జాతీయుడైన ఓవెన్స్ బెర్లిన్ ఒలింపిక్స్‌లో 100మీ., 200మీ., లాంగ్‌జంప్, 4ఁ100మీ.రిలేలో స్వర్ణాలు సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ నాలుగు పతకాలలో ఓ పతకం వేలానికి రాగా దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను వెల్లడి చేయలేదు. అయితే ఆయన తిరిగి ఈ స్వర్ణాన్ని ఆయన జెస్సీ ఓవెన్స్ ఫౌండేషన్‌ను ఇవ్వనున్నట్టు వేలం నిర్వాహకులు వెల్లడించారు. అలాగే 1960లో మహ్మద్ అలీ తన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకున్న బౌట్‌కు ముందు ధరించిన గౌను 60వేల 667 డాలర్ల (రూ.37 లక్షలు)కు అమ్ముడుపోయింది.