breaking news
Opposition leader jana reddy
-
‘సాక్షి’ ఎడిటోరియల్‌పై అసెంబ్లీలో చర్చ
సాక్షి, హైదరాబాద్ : తెలుగువారి మనస్సాక్షి 'సాక్షి' దినపత్రిక సంపాదకీయంపై తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ నడిచింది. ప్రతిపక్షాల నిరసన హక్కును అధికారపక్షం కాలరాస్తోందంటూ వాపోయిన సీఎల్పీ నేత జానా రెడ్డి.. సాక్షి ఎడిటోరియల్ ‘నిరసనల బహిష్కారం’ ఆర్టికల్‌ను స్పీకర్ మధుసూదనాచారికి చదివి వినిపించారు. బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ చాంబర్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు.. సభ జరుగుతోన్న తీరుపై ఫిర్యాదు చేశారు. ‘మీమీద మీకే ఫిర్యాదు చేయాల్సి రావడం ఒకింత బాధాకరమే అయినా తప్పడంలేదు. నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. కానీ అధికారపక్షం ఆ హక్కును కాలరాస్తోంది. పరిస్థితిలో మార్పు రాకుంటే సమావేశాలను బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోము’ అని స్పష్టం చేశారు. ప్రశ్న, నిరసనల్లోనే ప్రజాస్వామ్యం : ‘నిరసనల బహిష్కారం’ శీర్షికతో ప్రచురితమైన సాక్షి ఎడిటోరియల్ ఆర్టికల్‌ను ప్రతిఒక్కరూ చదవాల్సిందిగా జానారెడ్డి అభ్యర్థించారు. ‘‘ప్రజాస్వామ్యం అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో మాత్రమే ఉండదు. నిరసన వ్యక్తం చేయడానికి, నిలదీయడానికి సామాన్యులకు గల హక్కులో ఉంటుంది.. నిర్భీతిగా వ్యక్తం చేసే అభిప్రాయంలో ఉంటుంది. అధికార పీఠాలపై ఉన్నవారు చేస్తున్నది తప్పని చెప్పగల సాహసంలో ఉంటుంది..’’ అంటూ సాగే వ్యాసాన్ని చదివి వినిపించారు. చదవండి.. సాక్షి ఎడిటోరియల్ ఆర్టికల్ : నిరసనల బహిష్కారం -
వ్యవసాయాన్నిపండగ చేయండి
అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి రైతు కుటుంబాల ఆదాయం పెంచాలని విజ్ఞప్తి ప్రభుత్వ చర్యలకు సహకరిస్తామని ప్రకటన సాక్షి, హైదరాబాద్ : ‘‘వ్యవసాయాన్ని పండుగలా చేయండి. అసెంబ్లీ వేదికగా రైతుల్లో మనోనిబ్బరం కల్పించండి. ప్రభుత్వం చేపట్టే చర్యలన్నింటికీ సంపూర్ణంగా సహకరిస్తాం’’ అని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డి సూచించారు. రైతుల ఆత్మహత్యలు, వర్షాభావ పరిస్థితులపై బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అనంతరం ఆయనమాట్లాడారు. దేశంలో 91 శాతం కుటుంబా లు రూ.10 వేల లోపు నెలసరి ఆదాయంతో బతుకుతున్నాయని ఆర్థిక సర్వేలో తేలిందని, వాటిలో అత్యధికం సన్న, చిన్నకారు రైతు కుటుంబాలేనని అన్నారు. ఈ కుటుంబాల ఆదాయం పెంచేందుకు ప్రణాళికలు రూపొం దించాలని సూచించారు. ‘‘ఎకరానికి రూ.3 వేలు, లేదా రూ.4 వేలతో కాంటూరు కందకాలు తవ్వి నీటిని నిల్వ చేసుకోవచ్చు. దీంతో భూగర్భ జలం పెరుగుతుంది. సాగునీటికీ ఢోకా ఉండదు. సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు పెట్టే బదులు ప్రయోగాత్మకంగా ఓ లక్ష ఎకరాల్లో కాంటూరు కందకాలు తవ్వించాలి. దీన్ని ప్రోత్సహించేందుకు కాంటూరు సేద్యం చేసే రైతులకు ఖర్చును రీయింబర్స్ చేయాలి. హరితహారం మొక్కల పెంపకాన్ని రైతులకప్పగించాలి. వాటి ఖర్చులను చెల్లించటం ద్వారా వారి ఆదాయం పెంచొచ్చు. చివరి దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేసి నీరందించాలి’’ అని సూచించారు. తాను విమర్శలు చేయదలచుకోలేదన్నారు. వ్యవసాయ వర్సిటీల్లో వీసీలు, పరిశోధకులు, విస్తరణాధికారులు లేరని, వారిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. రుణమాఫీ గందరగోళం ప్రభుత్వం విడతలవారీగా రుణమాఫీ చేయడంతో క్షేత్రస్థాయిలో గందరగోళం ఏర్పడిందని జానా అన్నారు. రైతు రుణాలను ఒకేసారి సెటిల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రెండు విడతలు రుణమాఫీ నిధులను జమ చేసినా వారు కొత్త రుణం, వడ్డీ మాఫీ లబ్ధి పొందలేకపోతున్నారన్నారు. ‘‘పంట రుణాలపై బ్యాంకుల తీరు రైతులకు అర్థం కావడం లేదు. లక్ష రుణం తీసుకున్న రైతులకు ఏడాదిన్నరకు రూ.16,500 వడ్డీ వసూలు చేస్తున్నాయి. రుణమాఫీపై నేను ఒక బ్యాంకు నుంచి వివరాలు తెలుసుకున్నాను. ఎమ్మెల్యే రవీంద్రనాయక్ తీసుకున్న పంట రుణానికి కూడా బ్యాంకు వేసిన లెక్కలు గందరగోళంగా ఉన్నాయి’’ అంటూ సభ దృష్టికి తీసుకువచ్చారు. రుణమాఫీ చిక్కులపై తాను సేకరించిన సమాచార ప్రతిని స్పీకర్ ద్వారా కేసీఆర్‌కు అందించారు. ఎవరికీ అర్థం కాలేదు జానా రుణమాఫీ వడ్డీ రేట్ల లెక్కలు చెబుతుండగా, సభలో అన్ని పక్షాల సభ్యుల నుంచీ ‘ఏమీ అర్థం కావటం లే’దన్న గుసగుసలు విన్పించాయి. రుణమాఫీ లెక్కలు గంట సేపు విన్నా తనకే అర్థం కాలేదని జానా చెప్పారు. ఎవరికీ అర్థం కాదని తనకు తెలుసని, అయినా సభ దృష్టి కి తెచ్చేందుకే చెబుతున్నానని అన్నారు. మంత్రి హరీశ్ సీఎం దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెబుతుం డటంతో, ‘ఇంటికి వెళ్లినాక అర్థం చేయించండి’ అని జానా అనడంతో నవ్వులు విరిశాయి.