breaking news
occupants
-
కబ్జాదారులపై ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: చెరువుల గరిష్ట నీటి మట్టం (ఎఫ్టీఎల్) పరిధిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలను తొలగించాలని, భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణా లు చేపట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ విస్తీర్ణం మ్యాపులను మార్చేశారని, ప్రభుత్వమే రోడ్డు నిర్మాణం చేపడుతోందని, ఈ నేపథ్యంలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సోషలిస్టుపార్టీ తెలంగాణ విభాగం కార్యదర్శి డాక్టర్ లుబ్నాసార్వత్ రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో సుమోటో ప్రజాహిత వ్యా జ్యంగా స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని గురు వారం మరోసారి విచారించింది. ప్రభుత్వం ఏమైనా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టిందా అని ధర్మాసనం ప్రశ్నించగా ప్రభుత్వ న్యాయవాది లేదని సమాధానమిచ్చారు. గత ఏడాది ఇలాంటి అంశాన్నే విచారిస్తున్న సమయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులను ఎప్పుడైనా చూశారా అని కమిషనర్‌ను ప్రశ్నించగా లేదని చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. చెరువుల ఆక్రమణకు సంబంధించి ఏడాది కాలంగా తాను ప్రభుత్వ అధికారుల తీరును పరిశీలిస్తున్నానని, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించా ల్సిన అవసరం ఉందన్నారు. నిర్మల్ జిల్లాలో చెరువుల పరిరక్షణ కోసం కలెక్టర్, డీఎస్పీతో కూడిన చెరువుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, అదే తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నా రు, ఆక్రమణల తొలగింపు చర్యలను వివరిస్తూ ఆగస్టు 17లోగా పూర్తి వివరాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
పరిహారం కోసం వంశధార నిర్వాసితుల ఆందోళన
-
పోలవరం నిర్వాసితులపై కదలిక
ఈనెల 25న జాతీయ పర్యవేక్షణ కమిటీ సమావేశం న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసితులకు 1894 నాటి భూ సేకరణ చట్టం ఆధారంగా పరిహారం ఇస్తున్న అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అనేక పరిణామాల నేపథ్యంలో ఈనెల 25న జాతీయ మానిటరింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈమేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు భూసేకరణను 1894 నాటి చట్టం ఆధారంగా చేపట్టారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో వచ్చిన ‘న్యాయమైన పరిహారం, భూసేకరణలో పారదర్శకత, పునరావాస హక్కు చట్టం-2013’లోని సెక్షన్ 24, సబ్ సెక్షన్ 2 ప్రకారం.. అంతకుముందు అమలులో ఉన్న చట్టం ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ, ప్రాజెక్టు ప్రాంతం నుంచి నిర్వాసితులు ఖాళీ చేయకపోయినా లేదా పరిహారం పొందకపోయినా, కొత్త చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు అర్హులవుతారు. ఇప్పుడు పోలవరం ముంపు బాధితుల్లో మెజార్టీ ప్రజలు ఇంకా తమ స్థలాలు ఖాళీచేయనందున, పరిహారం పొందనందున వారికి కొత్త చట్టం ప్రకారం పరిహారం వర్తింపజేయాలని సోషల్ అండ్ హ్యూమన్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల విభాగానికి జనవరి 30న అప్పీలు చేశారు. దీనికి స్పందించిన ఆ విభాగం సంయుక్త కార్యదర్శి ప్రభాత్ కుమార్ సారంగి జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి బి.రాజేందర్‌కు అప్పట్లో ఒక లేఖ రాశారు. ఈ నేపథ్యంలో భూసేకరణ చట్టం-2013 అమలు బాధ్యతలు చూస్తున్న నేషనల్ మానిటరింగ్ కమిటీ సమావేశం కానుంది. నివేదిక సమర్పించాలి.. తొలిసారిగా జరగనున్న జాతీయ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పోలవరం పరిహారం అంశం ఉందని, దీనికి హాజరుకావాలని, ఒక సమగ్ర నివేదిక కూడా సమర్పించాలని కోరు తూ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిం ది. పెంటపాటి పుల్లారావు ఇచ్చిన పిటిషన్‌ను ఈ కమిటీ సమావేశంలో విచారించనున్నారు. -
ఇందిరా ప్రాజెక్ట్ నిర్వాసితుల ఆందోళన