breaking news
Nobel Prize for literature
-
ఫ్రెంచ్ కవయిత్రికి సాహిత్యంలో నోబెల్
స్టాక్‌హోం: సాహిత్యంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి ఈ ఏడాది ఫ్రెంచ్ రచయిత అనీ అర్నాక్స్(82)కు లభించింది. అనీ అర్నాక్స్ పేరును నోబెల్ కమిటీ ప్రకటించింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్‌కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై చాలా స్పష్టమైన రీతిలో ఎర్నాక్స్ అనేక రచనల్లో తన అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు గానూ నోబెల్ బహుమతి వరించింది. సుమారు 30కి పైగా సాహిత్య రచనలు చేశారు అర్నాక్స్. 1940లో ఆమె నార్మాండీలోని యెవటోట్‌లో జన్మించారు. చాలా సుదీర్ఘ కాలం నుంచి ఎర్నాక్స్ రచనలు చేస్తున్నారు. నోబెల్ బహుమతి ప్రకటన తర్వాత మీడియాతో మాట్లాడారు అర్నాక్స్. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత, నాకు లభించిన బాధ్యత. రచన అంటే ఓ రాజకీయ చర్య, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టడమే.’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. సమాజ రచనలపై భాషను ఆమె ఓ కత్తిలా వాడుతున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు ఆమె ఈ ఎత్తుగడతో రచనలు చేస్తున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. ఇప్పటికే భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోను వైద్య నోబెల్‌కు ఎంపిక చేశారు. మానవ పరిణామ క్రమంపై ఆయన చేసిన పరిశోధనలకు ఈ అవార్డు దక్కించుకున్నారు. 'పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్'లో చేసిన పరిశోధనలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ అవార్డు వరించింది. రసాయనశాస్త్రంలో నోబెల్ అవార్డును ముగ్గురు శాస్త్రవేత్తలు దక్కించుకున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబర్ 10వ తేదీన ఆర్థిక రంగంలో నోబెల్ గ్రహీత పేరును వెల్లడిస్తారు. నోబెల్ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్ క్రోనర్ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. ఇదీ చదవండి: Nobel Prize 2022: కొత్త జాతిని గుర్తించిన స్వాంటే పాబో -
గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్కు నోబెల్ పురస్కారం!
స్టాక్‌హోమ్: 1960 నుంచి తన ప్రభావవంతమైన గీతాలతో ఒక తరానికి ప్రతినిధిగా, స్వరంగా నిలిచిన అమెరికన్ గీత రచయిత, పాటగాడు బాబ్ డిలాన్ను అత్యున్నత నోబెల్ సాహిత్య పురస్కారం వరించింది. అత్యున్నత సాహిత్య పురస్కారంగా భావించే నోబెల్ అవార్డును ఇప్పటివరకు కవులకు, రచయితలకు ఇస్తూ వస్తుండగా.. ఈసారి అనూహ్యరీతిలో సంగీత రంగానికి చెందిన గాయకుడికి ప్రకటించడం గమనార్హం. "బ్లోవిన్ ఇన్ ద విండ్', "మాస్టర్స్ ఆఫ్ వార్', "ఏ హార్డ్ రెయిన్స్ ఏ గాన్నా ఫాల్', "ద టైమ్స్ దే ఆర్ ఏ చేంజింగ్', "సబ్టెరానియన్ హోస్సిక్ బ్లూ', "లైక్ ఏ రోలింగ్ స్టోన్' వంటి తన గీతాలతో బాబ్ డిలాన్ అసమ్మతిని, తిరుగుబాటును, స్వతంత్రకాంక్షను ప్రకటించారు. "డిలాన్లో ఒక ఐకాన్ ఉన్నారు. సమకాలీన సంగీతంపై ఆయన ప్రభావం అపారం' అని స్వీడిష్ అకాడెమీ పేర్కొంది. నోబెల్ పురస్కారం కింద డిలాన్‌కు ఎనిమిది మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (9.30లక్షల డాలర్లు.. రూ. 6.22 కోట్లు) బహుమానం లభించనుంది. 50 ఏళ్లకుపైగా కొనసాగుతున్న తన గీత ప్రస్థానంలో ఇప్పటికే డిలాన్ గీతాలు రచిస్తున్నారు. అప్పుడప్పుడు ప్రపంచ పర్యటనలు చేపడుతున్నారు. ప్రస్తుతం జీవిస్తున్న వారిలో ఆయన అత్యున్నత కవి (గ్రేటెస్ట్ లివింగ్ పోయెట్) అయి ఉంటారు’ అని అకాడెమీ సభ్యుడు పెర్ వాస్ట్బర్గ్ పేర్కొన్నారు. డిలాన్‌కు నోబెల్ ప్రకటించడంలో ప్యానెల్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుందని అకాడెమీ శాశ్వత కార్యదర్శి సరా డెనియస్ పేర్కొన్నారు. డైనమేట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరిట 1901 నుంచి ప్రతి సంవత్సరం విజ్ఞానం, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసినవారికి పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
కెనడా మీద చెహోవ్ నీడ
‘ఆమె స్త్రీల గురించి రాసింది. స్త్రీల కోసమే రాసింది. ఈ పనిలో పురుషులను రాక్షసు లుగా చిత్రించే ప్రయత్నం మాత్రం చేయ లేదు.’ 2013 సాహిత్య నోబెల్ పురస్కారానికి ఎంపికైన ఏలిస్ మన్రో సాహిత్యం గురించి అమెరికా విమర్శకుడు డేవిడ్ హోమెల్ చేసిన వ్యాఖ్య ఇది. 1916లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు అర్రాస్ యుద్ధం లో తనకు తాను వీరతిలకం దిద్దుకుని విజయం సాధించిన కెనడా ఒక స్వతంత్ర దేశం గా అవతరించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని కుదిపిన మహామాం ద్యం వేళ (జూలై 10, 1931) ఆ కెనడాలోనే ఒంటారియోలో (వింగ్హాం) ఏలిస్ మన్రో జన్మించింది. ఆమె 8వ ఏట తన దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంది. ఆ సంక్షుభిత పరిణామాల తరువాతే 1950లో ఏలిస్ తొలి కథ ‘ది డైమన్షన్స్ ఆఫ్ ఎ షాడో’ రాసింది. అప్పటికి ఆమె పశ్చిమ ఒంటారియో విశ్వవి ద్యాలయంలో చదువుకుంటోంది. తండ్రి రాబర్ట్ లెయిడ్‌లా వ్యవసాయదారుడు. తల్లి ఉపాధ్యాయిని. పార్కిన్సన్స్ వ్యాధితో తల్లి పడుతున్న బాధ చూడలేక ఏలిస్ పుస్తకాలను ఆశ్రయించింది. అందుకే ఆమె కథల నిండా బాలికల సందిగ్ధావస్థ చిత్రితమై ఉంటుంది. ఏలిస్ తను పుట్టి పెరిగిన చిన్న పట్టణం ఒం టారియో (ఆమె కథలలో కనిపించే జూబ్లీ పట్టణం అదే) నేపథ్యంగానే ఎక్కువ రచనలు చేశారు. స్వీడిష్ అకాడమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్ ఏలిస్ను వర్తమాన కథా సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతురా లిగా పేర్కొన్నాడు. అయితే ఇతివృత్తం, శైలిని బట్టి చూస్తే ఏలిస్ రచనలు కథా విస్తృతికి అందేవి కావు. నవల లోతుపాతులే ఎక్కువగా కనిపిస్తాయి. రష్యన్-అమెరికన్ కథా రచ యిత సింథియా ఓజిక్ ఆమెను ఎంతో గౌర వంగా 19వ శతాబ్దపు రష్యా నాటక కర్త ఆంటోన్ చెహోవ్‌తో పోల్చాడు. నోబెల్ అకాడమీ ఏలిస్ రచనా శైలిని స్పష్టతతో కూడిన మనో ధార్మిక వాస్తవికత పుష్కలంగా ఉన్న శైలిగా అభివర్ణించింది. నేను మరో పని ఏదీ చేయలేను కాబట్టి రచనా రంగంలో విజయం సాధించినట్టున్నానని చలోక్తిగా పలికే ఏలిస్, తను చవిచూసిన ఒంటారియో జీవితాన్నే చిత్రించింది. నేను మేధావిని కాదు. ఒక సామాన్య గృహిణిని మాత్రమే అని కూడా చెప్పుకునే ఏలిస్ బిడియస్థురాలు. తను సాధించిన సాహిత్య ప్రస్థానం తనకే ఇంద్రజాలంగా కనిపిస్తూ ఉంటుందని చెప్పుకున్నారు. ఆమె కథా సాహిత్యంలో ఒక సంఘర్షణ కూడా కనిపిస్తుంది. సంప్రదాయం, కొన్ని విలువల ఆధారంగా నడిచే తన సమాజంలో ఎదురైన అనుభవాలు, 1960 తరువాత ఆమె లో ఏర్పడిన విప్లవ దృష్టి ఆ ఘర్షణకు కారణమయ్యాయి. ‘డ్యాన్స్ ఆఫ్ ది హ్యాపీ షేడ్స్’ (1968), ‘లైవ్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఉమెన్’ (1971), ‘హూ డూయూ థింక్ యూ ఆర్?’ (1978) అనే కథా సంకలనాలకు కెనడా ప్రభు త్వం ఇచ్చే అత్యున్నత సాహితీ పురస్కారం గవర్నర్స్ జనరల్ అవార్డు లభించింది. 1901 లో ప్రారంభమైన నోబెల్ పురస్కారాలలో సాహిత్య విభాగానికి గాను 12 మంది మహి ళలు ఎంపికయ్యారు. ఏలిస్ 13వ పురస్కార గ్రహీత కాబోతున్నారు. ఏలిస్ ద్వారా కెనడా తొలిసారి ఈ పురస్కారం అందుకోవడం ఇంకో విశేషం. మొత్తం 12 కథా సంకలనా లను ఏలిస్ వెలువరించారు. ఆమెకు 2009లో బుకర్ ప్రైజ్ కూడా వచ్చింది. 1930-40లలో రచయిత్రిగా ఏలిస్ పునా దులు నిర్మించుకుంటున్న కాలం అంత గొప్ప దికాదు. కెనడాలో నాటికీ ప్రచురణ కర్తలంటే కేవలం పాఠ్య పుస్తకాల ప్రచురణ కర్తలే. రచనా వ్యాసంగం అప్పటికి ఒక జీవికగా అవతరించలేదు. అయినా ఆమె అందుకోసం తపనపడ్డారు. విజయం సాధించారు. మరో కెనడా రచయిత్రి మార్గరెట్ అట్వుడ్ మాటల్లో చెప్పాలంటే ఈ కాలపు ఆంగ్ల సృజనాత్మక రచయిత్రులలో ఏలిస్ అగ్రగణ్యురాలు. వయ సును బట్టి రచయితలు, రచయిత్రుల ఆలో చనా ధోరణులలో వచ్చే మార్పు ఏలిస్లోనూ కనిపిస్తుంది. 1960లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది స్త్రీలు తమ శరీరం మీద హక్కు తమదేనని ప్రకటించుకోవడమే స్వేచ్ఛకు ప్రతీకగా భావించారు. ఈ అంశాన్ని తీసుకుని ఏలిస్ ‘ద టర్కీ సీజన్’ నవల రాశారు. ఇందులో ప్రధాన పాత్ర లిలీ తాగుబోతు భర్త మర్జోరీని పడక గదికి దూరంగా ఉంచుతుం ది. అతడు తాగి ఉన్నప్పుడు ఏ నాడూ తన శరీరాన్ని తాకడానికి ఆమె అనుమతించలేదు. మరణం వరకు ఆ పాత్ర ఇదే ధోరణిలో సాగు తుంది. ‘ద మూన్స్ ఆఫ్ జూపిటర్’, ‘ద ప్రోగ్రెస్ ఆఫ్ లవ్’, ‘ఫ్రెండ్ ఆఫ్ మై యూత్’, ‘ఓపెన్ సీక్రెట్స్’, ‘ది లవ్ ఆఫ్ గుడ్ ఉమెన్’. ‘అవే ఫ్రమ్ హర్’, ‘రనవే’, ‘ద వ్యూ ఫ్రమ్ క్యాజల్ రాక్’, ‘టూమచ్ హ్యాపీనెస్’ వంటి కథా సంకలనాలు ఆమె వెలువరించారు. చివరి సంకలనం ‘డియర్ లైఫ్’. ఏలిస్ రచన లలో ఉద్వేగం ఉప్పొంగుతూ ఉంటుంది. సం భ్రమాశ్చర్యాలు ప్రవహిస్తూ ఉంటాయి. పెచ్చ రిల్లే లైంగిక వాంఛలు నివురు గప్పిన నిప్పుల్లా ఉంటాయని అంటారు. - గోపరాజు నారాయణరావు