breaking news
Nitaqat victims
-
నతాఖా బాధితులకు ఊరట
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సౌదీ అరేబియా తీసుకొచ్చిన నూతన కార్మిక చట్టం(నతాఖా) బాధితులకు వెసులుబాటు(అఖామాల రెన్యువల్) కల్పిస్తూ.. వారు తమ పత్రాలను సరిచేసుకోవడానికి నెలరోజులపాటు సౌదీ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ మేరకు సౌదీ కార్మిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లిన కార్మికులకు కొద్దిపాటి ఊరట లభించినట్లయింది. సౌదీ అరేబియాలోని భవన నిర్మాణం, వ్యాపారాలు, స్థానిక కర్మాగారాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేస్తున్న తెలుగువారికి ఈ ఉత్తర్వుల ద్వారా లబ్ధి చేకూరనుంది. స్థానిక కంపెనీలు, భవన నిర్మాణ, షాపింగ్‌మాల్, చిన్న కంపెనీల యజమానులు కూడా తమ వద్ద పనిచేసున్న ఉద్యోగుల పత్రాలను సరిచేసుకునే అవకాశమిచ్చింది. విదేశీ కార్మికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వ్యాపారసంస్థలు, ఫ్యాక్టరీలు, హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు తమ వద్ద పనిచేస్తున్న విదేశీయుల అఖామా(వర్క్ పర్మిట్)లను సరిచేయించాలని కోరింది. కార్మికశాఖ ద్వారా గుర్తింపు పొందిన అఖామాలు కలిగి ఉన్న విదేశీయుల్నే పనిలో నియమించుకోవాలని, లేనిపక్షంలో ఆయా సంస్థలు, వ్యాపార సముదాయాలపై కేసులు పెడతామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. దాడులు కొనసాగుతాయని, అఖామా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న పత్రాలను చూపినట్లయితే ఎలాంటి అరెస్టులు ఉండబోవని స్పష్టం చేసింది. -
నతాఖా బాధితులకు ఊరట!
రియాద్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నతాఖా చట్టం బాధితులకు కొంత ఊరట కలిగించేలా సౌదీ ఆరేబియా ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమంగా సౌదీలో నివాసం ఉంటున్న వారి స్థితి ధృవీకరణృ క్రమబద్ధీకరణకు మరోమారు వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా నివసిస్తున్న కార్మికుల చట్టబద్ధత కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుం దని ప్రకటించింది. అయితే నతాఖా చట్టం గడువులోగా ధృవీకరణలు క్రమబద్దీకరణ చేసుకోనందున జరిమానా, శిక్షలు తప్పవని స్పష్టం చేసింది. అక్రమంగా నివసించే కార్మికుల కోసం తనిఖీలు యథావిధిగా కొనసాగుతాయని అక్కడి మంత్రిత్వశాఖ డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ అధికారి ఫైసల్ అల్ ఓటాబీ వెల్లడించారు. నతాఖా చట్టం కింద నివాస ప్రతిపత్తిని సరిచేసుకోవడం లేదా దేశం విడిచి వెళ్లి పోయేందుకు ఇచ్చిన ఏడు నెలల గడువు ముగియడంతో వారం రోజులుగా అరెస్టులు కొనసాగుతున్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వేలాదిమంది తెలుగువారు ఇప్పటికే అరెస్ట్ ఆయ్యారు. మరి కొందరు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఎగ్జిట్ పాస్‌లు పొంది నిరీక్షిస్తున్నారు. గడువు కంటే ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఎగ్జిట్ పర్మిట్ జారీ ప్రక్రియ నత్తలను తలపిస్తోంది. ఆదివారం ధమామ్, రియాద్, జెడ్డా, తైఫ్, ఆల్ఖుబర్, మదీ నా తదితర ప్రాంతాల్లోని ముమ్మర తనిఖీలు కొనసాగాయి. కాగా, సౌదీలో నివాస ప్రతిపత్తి లేని కార్మికులు తమకు తెలిసిన వారితో నివాస ప్రతిపత్తి క్రమబద్ధీకరణ కోసం ప్రయత్నిస్తున్నారు. సౌదీలోని కపీల్స్లకు సైతం గుబులు పట్టుకుంది. విదేశాల నుంచి పనికోసం సౌదీ అరేబియా చేరుకున్న వారే కాకుండా వారికి వీసా ఇచ్చి పిలిపించుకున్న స్థానికులు, పనిలో పెట్టుకున్నవారు ముగ్గురూ శిక్షార్హులేనని అక్కడి కార్మిక శాఖ అదేశాలు జారీ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తమవద్ద అక్రమంగా పనిలో పెట్టుకున్న వారిని అక్కడి వ్యాపారులే వర్క్‌పర్మిట్ రెన్యువల్ కోసం విడుదల చేస్తున్నారు. కంపెనీలపై దృష్టి: నతాఖా చట్టం కింద అక్రమ కార్మికుల కోసం రోడ్లపై తనిఖీలు కొనసాగిస్తున్న పోలీసు, కార్మిక శాఖాధికారులు సోమవారం నుంచి కంపెనీలపై దృష్టి సారించారు. ముమ్మర తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రియాద్‌లో 55, జిద్దాలో 64, అల్ఖుబార్లో 45 బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి బృందానికి ఇద్దరు ఇన్స్పెక్టర్లతోపాటు సెక్యూరిటీ అధికారులను నియమించారు. కంపెనీలపై ఏ క్షణమైనా దాడులు జరిగే అవకాశం ఉంది. పని గంటలతో సంబంధం లేకుండా ఏ క్షణంలోనైనా తని ఖీలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్మికశాఖ అదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. రియాద్, జెడ్డాలో ప్రత్యేక కౌంటర్లు : నతాఖా చట్టం బాధితులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం సహాయక చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రియాద్, జెడ్డా, ధమామ్లో ప్రత్యేక ఎయిర్ కౌంటర్లను ఏర్పాటు చేస్తునట్లు రియాద్‌లో ఎయిర్ ఇండియా మేనేజర్ ప్రభుచంద్ర తెలిపారు. స్తంభించిన వ్యాపారం, వాణిజ్యం సౌదీలోవాణిజ్య, వ్యాపార రంగాలపై నతాఖా తీవ్ర ప్రభావం చూపుతోంది. సౌదీ అరేబియాలో వారం రోజుల నుంచి జనజీవనం స్తంభించిపోయింది. వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కార్యాలయాలు ఆదివారం కూడా తెరుచుకోలేదు. ప్రతినిత్యం సందడిగా ఉండే ప్రధాన కేంద్రాలు జనం లేక బోసిపోతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలతోపాటు వందలాది వ్యాపార, వాణిజ్య కేంద్రాలు మూత పడ్డాయి. షాపింగ్ కాంపెక్స్‌లు తెరుచుకొలేదు. పండ్లు, కూరగాయల మార్కెట్లో ఎగుమతి, దిగుమతి నిలిచిపోయింది. తక్షణమే చర్యలు చేపట్టాలి నతాఖా చట్టం బాధితులను సురక్షితంగా స్వదేశానికి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిప్రధికన చర్యలు చేపట్టాలి. ఉపాధి కొల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక తెలుగువారు తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సౌదీకి ఒక బృందాన్ని పంపించి సహాయక చర్యలు చేపట్టాలి. - కె.నర్సింహనాయుడు, గల్ఫ్ బాధితుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్