breaking news
nicky
-
అమెరికా విదేశాంగ మంత్రిగా నిక్కీ!
పరిశీలనలో భారత సంతతి మహిళ పేరు వాషింగ్టన్: భారత సంతతి మహిళ, దక్షిణ కరోలి గవర్నర్ నిక్కీ హేలీ(44).. డొనాల్డ్ ట్రంప్ కేబినెట్లో చోటు దక్కించుకోనున్నారు. ఆమె పేరును అమెరికా విదేశాంగ మంత్రి పదవికి పరిశీలిస్తున్నారని వార్తలొచ్చాయి. అరుుతే న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గియాలియానీ కూడా ఈ పదవికోసం పోటీ పడుతున్నారని తెలిసింది. నిక్కీకి ఆ పదవి అప్పగిస్తే జాతి, లింగ వైవిధ్యం పాటించినట్లు ఉంటుందని భావిస్తున్నారు. నిక్కీ పేరును పలు మంత్రిత్వ శాఖలకు పరిశీలిస్తున్నారని, అందులో విదేశాంగ శాఖ కూడా ఉందని ది పోస్టు అండ్ కొరియర్ పత్రికకు దక్షిణ కరోలినా లెఫ్టినెంట్ గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ చెప్పారు. ఈ వార్తల నేపథ్యంలో నిక్కీ.. ట్రంప్‌ను కలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికలకు ముందు ట్రంప్‌కు మద్దతిస్తున్నానని నిక్కీ ప్రకటించారు. ఇపుడు నిక్కీ పేరు కూడా వినబడుతుండటంతో ట్రంప్ కేబినెట్ పరిశీలనలో రెండో భారత సంతతి వ్యక్తికి చోటు దక్కినట్లరుుంది. ఇంతకు ముందు లూసియానా మాజీ గవర్నర్ బాబీ జిందాల్ పేరు కూడా పరిశీలనలో ఉన్న విషయం విధితమే. మోదీకి ట్రంప్ ఫోన్ .. అమెరికాకు అధ్యక్షుడు, ఉపాధ్యక్షులుగా కొత్తగా ఎన్నికై న ట్రంప్, మైక్ పెన్సలు భారత ప్రధాని మోదీ సహా ప్రపంచంలోని 30 మంది కీలక నేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ట్రంప్ అధికార మార్పిడి బృందం వెల్లడించింది. ట్రంప్ ఫోన్ చేసిన ఇతర నేతల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, తదితరులున్నారు. తన ముఖ్య వ్యూహకర్తగా ట్రంప్ నియమించిన స్టీవ్ బ్యానన్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని 168 మంది డెమోక్రాట్లు ట్రంప్‌ను కోరారు. బ్యానన్‌కు శ్వేత జాతీయవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నారుు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఆయనను కలవనున్న తొలి అమెరికాయేతర నేతగా జపాన్ ప్రధాని షింజో అబే నిలవనున్నారు. పెరూలో భేటీ జరగనుంది. కాగా, అమెరికా గూఢచారుల చీఫ్ జేమ్స్ క్లాప్పర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒబామా పదవీకాలం పూర్తరుు్య, ట్రంప్ అధికారం చేపట్టడానికి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం విశేషం. -
శంషాబాద్ లో ఐఎస్ఐఎస్ మహిళా ఉగ్రవాది అరెస్టు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ మహిళా ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ జోసెఫ్ అనే ఉగ్రవాదిని పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నారు. గత జనవరిలో పోలీసులు అరెస్టు చేసిన మొయినుద్దీన్ అనే ఉగ్రవాదికి ఈమె ప్రియురాలని, ఈమె ఇంగ్లండ్ దేశస్థురాలని తెలుస్తోంది. ఈమెకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)తో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురిని ఐఎస్ఐఎస్లో చేర్చేందుకు ఈమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొయినుద్దీన్‌తో కలిసి ఓ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి.. దాని సాయంతో పలువురిని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఈమెకు 2011లోనే మొయినుద్దీన్‌తో పరిచయం అయ్యింది. ఇక్కడ కొన్నాళ్ల పాటు తమ కార్యకలాపాలు సాగించిన తర్వాత.. దుబాయ్ వెళ్లిపోయింది. ఆమెను పోలీసులు అత్యంత చాకచక్యంగా హైదరాబాద్‌కు రప్పించారు. ఇప్పుడు అరెస్టు చేసిన తర్వాత.. ఆమెకు హైదరాబాద్‌లో ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరికి ఆమె ఎర వేసిందనే వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తూ ఇప్పటివరకు 30 మందికి పైగా వ్యక్తులు శంషాబాద్‌లో అరెస్టయ్యారు. కోల్‌కతా నుంచి కూడా కొంతమంది గతంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. తాజా అరెస్టుతో కొంతవరకు దీనికి అడ్డుకట్ట పడినా.. ఇంకా ఏయే మార్గాల ద్వారా వెళ్తున్నదీ తెలుసుకోవాల్సి ఉంది. దానికి ఈమె అందించే సమాచారం కీలకం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.