breaking news
Newport Crown Court
-
రన్నరప్ రామ్‌కుమార్
న్యూపోర్ట్ (అమెరికా): రెండు దశాబ్దాలుగా భారత క్రీడాకారులను ఊరిస్తోన్న అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ సింగిల్స్ టైటిల్ నిరీక్షణ ఇంకా కొనసాగనుంది. ఆదివారం ముగిసిన న్యూపోర్ట్ ఓపెన్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’ ఏటీపీ–250 టోర్నమెంట్లో భారత ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ రన్నరప్‌గా నిలిచాడు. రెండు గంటలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 161వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–3, 2–6తో ప్రపంచ 48వ ర్యాంకర్, మూడో సీడ్ స్టీవ్ జాన్సన్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. విజేతగా నిలిచిన స్టీవ్ జాన్సన్‌కు 99,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 68 లక్షల 29 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ రామ్‌కుమార్‌కు 52,340 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 35 లక్షల 97 వేలు)తోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నైకు చెందిన 23 ఏళ్ల రామ్‌కుమార్ 6–4, 7–5తో టిమ్ స్మిజెక్ (అమెరికా)పై గెలుపొంది తన కెరీర్లో తొలిసారి ఏటీపీ–250 టూర్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. 2009లో చెన్నై ఓపెన్‌లో, 2011లో దక్షిణాఫ్రికా ఓపెన్‌లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫైనల్‌కు చేరిన తర్వాత భారత్ నుంచి రామ్‌కుమార్ రూపంలో మరో ప్లేయర్ ఏటీపీ టూర్ టోర్నీలో టైటిల్ పోరుకు చేరడం ఇదే ప్రథమం. సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. భారత్ తరఫున చివరిసారి ఏటీపీ టూర్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించిన ఆటగాడు లియాండర్ పేస్. 1998 న్యూపోర్ట్ ఓపెన్‌లో లియాండర్ పేస్ విజేతగా నిలిచాడు. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సుకోవా, స్టిక్ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో వింబుల్డన్ మాజీ సింగిల్స్ చాంపియన్ మైకేల్ స్టిక్ (జర్మనీ), 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెలెనా సుకోవా (చెక్ రిపబ్లిక్)లకు చోటు కల్పించారు. స్టిక్ 1991 వింబుల్డన్ టోర్నీలో బోరిస్ బెకర్ (జర్మనీ)పై వరుస సెట్లలో గెలిచాడు. 1994 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆండ్రీ అగస్సీ (అమెరికా) చేతిలో... 1996 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కఫెల్నికోవ్ (రష్యా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు. 1997లో రిటైరయిన స్టిక్ కెరీర్ మొత్తంలో 18 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. సుకోవా, మైకేల్ స్టిక్ -
ఇకపై డోర్ కొట్టకూడదట..!
డోర్ టు డోర్ ప్రచారం చేసేవాళ్ళు... సేల్స్ మెన్స్ తలుపు కొట్టి విసిగించడం చాలామందికి అనుభవమే అయ్యుంటుంది. అదే అనుభవం లండన్ లోని బ్రాడ్ పోర్డ్ కు చెందిన మహిళ విషయంలోనూ జరిగింది. పదే పదే జనం విసిగించకుండా ఉండేందుకు ఆమె తమ ఇంటి డోర్ పై ఓ స్టిక్కర్ ను అతికించింది. అయినా ఆమెకు బాధ తప్పలేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. అంతే కాకుండా గట్టిగా తన వాదనను వినిపించి... మొత్తానికి అనుకున్నది సాధించింది. ఏకంగా డోర్ టు డోర్ సేల్స్ నే బ్యాన్ చేసేట్టు చేసింది. వివరాల్లోకి వెళితే...రోజుకు కనీసం మూడు, నాలుగు సార్లు డోర్ కొట్టి విసిగిస్తున్న సేల్స్ మెన్స్ బాధ నుంచి తప్పించుకునేందుకు లండన్ కు చెందిన కెల్లీ రోజ్ తనవంతు ప్రయత్నం చేసింది. ''నా అడ్రస్ తో ఏదైనా పార్శిల్ వచ్చినా దయచేసి నన్నుడిస్ట్రబ్ చేయొద్దు'' అంటూ కెల్లీ తన ఇంటి డోర్ పై ఓ సూచనను అతికించింది. ఆ స్టిక్కర్ చూసైనా సేల్స్ వాళ్ళు తనను అనవసరంగా విసిగించరని అభిప్రాయ పడింది. తలుపు కొట్టొద్దు అన్న సంకేతాన్ని స్టిక్కర్ తో సూటిగా చెప్పాననుకుంది. కానీ లాభం లేకపోయింది. ఆ విషయాన్ని పట్టించుకున్న నాధుడే కనిపించలేదు. ఎప్పట్లాగే తలుపు కొడుతూనే ఉన్నారు. హడావిడిగా బయటకు వెడుతున్న సమయంలోనూ అడ్డుకొట్టేవారూ లేకపోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆమె తలుపు కొట్టిన వారిని కోపంగా ప్రశ్నించింది కూడా. తలుపుపై అంటించిన స్టిక్కర్ మీకు కనిపించలేదా అని.. దానికి కొందరు తాము గమనించలేదని, మరి కొందరు మరో అడుగువేసి ఆ స్టిక్కర్ పై ఎటువంటి లీగల్ అథారిటీ లేదని చెప్పడాన్ని తట్టుకోలేక పోయింది. ఇరుగు పొరుగులను కూడా సంప్రదించింది. వారూ అదే సమస్యతో ఇబ్బందులు పడుతూనే ఉన్నామని చెప్పారు. మరొకరు ఇప్పటికే లీగల్ అథారిటీతో స్టిక్కర్ తీసుకున్నామని చెప్పారు. సమస్యను నివారించేందుకు ఏం చేయాలో కెల్లీ తీవ్రంగా ఆలోచించింది. ఇంటికి వచ్చిన సేల్స్ బాయ్స్ తాలూకు ఏజెన్సీకి ఫోన్ చేసింది. తాను బుక్ చేయకుండానే వారి ఏజెన్సీనుంచి సేల్స్ బాయ్స్ వచ్చి తలుపు కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఏజెన్సీ నుంచి కూడ కెల్లీకి భంగపాటు ఎదురైంది. మేడమ్..! మీకు ఎవరూ డిస్ట్రబ్ చేయడం నచ్చకపోతే అఫీషియల్ స్టిక్కర్ ను అతికించుకోమన్న సమాధానం రావడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. ఇక లాభం లేదనుకున్న కెల్లీ... డోర్ టు డోర్ ప్రచారం, సేల్స్ వంటివి బ్యాన్ చేయించడం తప్పితే... సమస్యకు పరిష్కారం లేదని భావించింది. ఇంతకు ముందే ఇటువంటి గుర్తింపులేని, నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరుపుతున్న పలువురు వ్యాపారస్తుల కేసుల్లో శిక్షార్హులైన వారి ఆధారాలను సేకరించింది. సౌత్ వేల్స్ లోని న్యూ పోర్ట్ క్రౌన్ కోర్టులో దావా వేసి గట్టిగా తన వాదనను వినిపించి... చివరికి కేసు గెలిచింది. ఆప్రాంతంలో డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించింది. అయితే ఇలా డోర్ టు డోర్ ప్రచారాలు, అమ్మకాలకు విసిగిపోయేవారితో పాటు వారికి సపోర్ట్ ఇచ్చేవారూ ఉన్నారనేందుకు కెల్లీ కేసు ఉదాహరణగా నిలుస్తోంది. ఆమె కేసు గెలిచి, డోర్ టు డోర్ సేల్స్ బ్యాన్ చేయించడాన్ని కొందరు తప్పు బడుతున్నారు. అలా బ్యాన్ చేయడం వల్ల అవసరమైన, ముఖ్యమైన సమాచారం, పార్శిళ్ళు, కొరియర్లు మిస్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలాగే .. కడుపు నింపుకునేందుకు సేల్స్ పై ఆధారపడి జీవించే వారు ఉంటారని, అటువంటి వారికి ఇది పెద్ద అవరోధమని అంటున్నారు. డిస్ట్రబెన్స్ వద్దనుకునేవారు ఇటీవల అందుబాటులో ఉన్న ఐ-బెల్ వంటి (తలుపు తెరవకుండా, తమ ఫోన్లలో డోర్ బయట ఉన్నవారి వివరాలు చూసే) యాప్ లను డౌన్ లోడ్ చేసుకొని, ఆధునిక పద్ధతులను అమలు చేసి సేల్స్ వారి బాధనుంచీ దూరమవ్వొచ్చనీ అంటున్నారు. అంతేతప్ప.. మొత్తానికే నిరోధించడం సరికాదని అభిప్రాయ పడుతున్నారు.